జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కాపాడకోలేకపోయింది. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో జింబాబ్వే కైవసం చేసుకుంది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సికందర్ రజా, కెప్టెన్ చక్‌బావ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మదుల్లా (80), కెప్టెన్ తమీమ్(50), అఫీఫ్ హుస్సేన్(41) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రజా మూడు వికెట్లు, మాధేవేరే రెండు, న్యాచి, చివంగా తలా వికెట్ సాధించారు. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రజా, చక్‌బావ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు.
వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 201 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను జింబాబ్వే వైపు మలుపు తిప్పింది. అనంతరం జింబాబ్వే కెప్టెన్ చక్‌బావ 75 బంతుల్లో 102 పరుగులు చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ ఔటైనప్పటికీ రజా(127 బంతుల్లో 117పరుగులు) మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి జింబాబ్వేకు మరుపురాని విజయాన్ని అందించాడు.
రజా, చక్‌బావ అద్భుమైన ఇన్నింగ్స్‌ల ఫలితంగా జింబాబ్వే 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా రజాకు ఈ సిరీస్‌లో ఇదే వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. తొలి వన్డేలో కూడా జింబాబ్వే విజయంలో రజా తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం హరారే వేదికగా జరగనుంది.
చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు!
Comments
Please login to add a commentAdd a comment