కాంటర్‌బరి: వరుసగా రెండు మ్యాచ్‌ల విజయాలతో 2–0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇక ఏ ఒత్తిడి లేకుండా ఆఖరి పోరు ఆడుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ‘తొలి మ్యాచ్ గెలిచిన మాకు రెండో మ్యాచ్ కీలకమైంది. ఇందులో గెలిచి సిరీస్ సాధించాలనే పట్టుదలతో ఆడాం. అనుకున్నది సాధించాం.
ఎన్నో ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మాకు లార్డ్స్‌లో జరి గే ఆఖరి మ్యాచ్ నామమాత్రమైంది. అక్కడ ఏ బెంగ లేకుండా ఆడేయొచ్చు. అంతేకాదు... దిగ్గజ సీమ ర్ జులన్ గోస్వామి కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ కాబట్టి విఖ్యాత లార్డ్స్ మ్యాచ్ మాకిపుడు ప్రత్యేకమైంది. మా పేసర్‌కు విజయంతో వీడ్కోలు ఇస్తాం’ అని హర్మన్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొంది.
ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత...
భారత అమ్మాయిల జట్టు బుధవారం జరిగిన రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా 2–0తో ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. చివరి సారిగా 1999లో అక్కడ సిరీస్ నెగ్గింది. బుధవారం జరిగిన పోరులో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి దాకా చెలరేగింది.
హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. వ్యాట్ (58 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కాప్సీ (39; 6 ఫోర్లు), కెప్టెన్ అమీ జోన్స్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రేణుక సింగ్ (4/57) చావుదెబ్బ తీయగా, హేమలత 2 వికెట్లు పడగొట్టింది. రేపు లార్డ్స్‌లో ఆఖరి వన్డే జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment