![Indian Women's Hockey Team play out 1-1 draw with South Korea - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/12/hocky.jpg.webp?itok=MsWOE2kW)
సియోల్: దక్షిణ కొరియా మహిళల హాకీ జట్టుతో జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత జట్టు 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్ ఖాయం చేసుకున్న రాణి రాంపాల్ బృందం నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించింది. తొమ్మిదో ర్యాంకర్ కొరియాతో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున వందన (48వ ని.లో), ప్రత్యర్థి జట్టు నుంచి బోమీ కిమ్ (50వ ని.లో) చెరో గోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment