ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు మరోసారి దుమ్ములేపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఏకంగా ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. చైనా వేదికగా సోమవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సౌత్ కొరియాను 4-1తో చిత్తు చేసింది. ఆద్యంతం ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ.. గెలుపు జెండా ఎగురవేసింది.
భారత ఆటగాళ్లలో ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ చెరొక గోల్ చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో మెరిశాడు. ఆట తొలి క్వార్టర్ చివరలో ఉత్తమ్ భారత్‌కు తొలి గోల్ అందించగా.. హర్మన్‌ప్రీత్ రెండో క్వార్టర్ ఆరో నిమిషంలో పెనాల్టీ కార్నర్ కిక్‌ను గోల్‌గా మలిచాడు.
కొరియా ఒక గోల్ కొట్టింది
ఆ తర్వాత జర్మన్ గోల్ సాధించగా.. మూడో క్వార్టర్‌లో హర్మన్ మరోసారి గోల్‌తో అదరగొట్టాడు. ఈ మూడూ కూడా ఫీల్డ్ గోల్సే(ప్రత్యర్థి గోల్‌పోస్టు ముందున్న స్ట్రైకింగ్ సర్కిల్ నుంచి) కావడం విశేషం. అయితే, మూడో క్వార్టర్‌లోనే కొరియా కూడా గోల్ కొట్టి పుంజుకునేందుకు ప్రయత్నించింది. అయితే, భారత డిఫెన్స్ వారిని కట్టడిచేయడంతో పరాజయం తప్పలేదు.
భారత్ అజేయంగా ఫైనల్‌కు
కాగా ఈ ఆసియా చాంపియన్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇక లీగ్ దశలో చైనాను 3-0తో, జపాన్‌ను 5-1తో, మలేషియాను 8-1తో, పాకిస్తాన్‌ను 2-1తో ఓడించింది. సెమీ ఫైనల్లో కొరియాను 4-1తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులో ఆతిథ్య చైనాతో తలపడనుంది.
చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన చైనా.. తొలిసారి ఫైనల్‌కు
Picture perfect team goal by the #MenInBlue 🤩#TeamIndia sizzle & notch up their 3️⃣rd with the finish from Jarmanpreet Singh 🔥
Watch 🇮🇳 🆚 🇰🇷, LIVE NOW on #SonyLIV 📲 pic.twitter.com/Gw3v6A04ZW— Sony LIV (@SonyLIV) September 16, 2024
Comments
Please login to add a commentAdd a comment