jarman
-
కొరియాను చిత్తు చేసిన భారత్.. ఆరోసారి ఫైనల్లో
ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు మరోసారి దుమ్ములేపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఏకంగా ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. చైనా వేదికగా సోమవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సౌత్ కొరియాను 4-1తో చిత్తు చేసింది. ఆద్యంతం ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ.. గెలుపు జెండా ఎగురవేసింది. భారత ఆటగాళ్లలో ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ చెరొక గోల్ చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో మెరిశాడు. ఆట తొలి క్వార్టర్ చివరలో ఉత్తమ్ భారత్‌కు తొలి గోల్ అందించగా.. హర్మన్‌ప్రీత్ రెండో క్వార్టర్ ఆరో నిమిషంలో పెనాల్టీ కార్నర్ కిక్‌ను గోల్‌గా మలిచాడు. కొరియా ఒక గోల్ కొట్టిందిఆ తర్వాత జర్మన్ గోల్ సాధించగా.. మూడో క్వార్టర్లో హర్మన్ మరోసారి గోల్‌తో అదరగొట్టాడు. ఈ మూడూ కూడా ఫీల్డ్ గోల్సే(ప్రత్యర్థి గోల్‌పోస్టు ముందున్న స్ట్రైకింగ్ సర్కిల్ నుంచి) కావడం విశేషం. అయితే, మూడో క్వార్టర్‌లోనే కొరియా కూడా గోల్ కొట్టి పుంజుకునేందుకు ప్రయత్నించింది. అయితే, భారత డిఫెన్స్ వారిని కట్టడిచేయడంతో పరాజయం తప్పలేదు. భారత్ అజేయంగా ఫైనల్కుకాగా ఈ ఆసియా చాంపియన్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇక లీగ్ దశలో చైనాను 3-0తో, జపాన్ను 5-1తో, మలేషియాను 8-1తో, పాకిస్తాన్‌ను 2-1తో ఓడించింది. సెమీ ఫైనల్లో కొరియాను 4-1తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులో ఆతిథ్య చైనాతో తలపడనుంది.చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన చైనా.. తొలిసారి ఫైనల్‌కుPicture perfect team goal by the #MenInBlue 🤩#TeamIndia sizzle & notch up their 3️⃣rd with the finish from Jarmanpreet Singh 🔥Watch 🇮🇳 🆚 🇰🇷, LIVE NOW on #SonyLIV 📲 pic.twitter.com/Gw3v6A04ZW— Sony LIV (@SonyLIV) September 16, 2024 -
దేశం విడిచి వెళ్లాలంటూ జర్మన్ విద్యార్థికి ఆదేశం
సాక్షి, చెన్నై : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఓ జర్మన్ విద్యార్థిని అధికారులు దేశం నుంచి పంపించేశారు. అతని చర్య వీసా నిబంధనలను ఉల్లంఘిస్తోందని, దేశ బహిష్కరణ చేయకముందే దేశాన్ని విడిచి వెళ్లాలంటూ ఆ విద్యార్థికి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. మద్రాస్ ఐఐటీలో భౌతికశాస్త్రంలో పీజీ చదువుతున్న జాకబ్ లిండెంతల్ అనే జర్మన్ విద్యార్థి గత వారం సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకొని జాకబ్‌ను విచారించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను సోమవారం అర్థరాత్రి కల్లా దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లేదంటే దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో జాకబ్ చేసేది లేక సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి అమ్‌స్టర్‌డామ్ నగరానికి చేరుకున్నారు. ఈ విషయంపై జాకబ్ స్పందిస్తూ.. నేను స్నేహితులతో చెపాక్, వల్లవర్ కొట్టంకు వెళ్లాను. అప్పటికి 144 సెక్షన్ విధించలేదు. సీఏఏపై ఎలాంటి అభిప్రాయాన్ని గానీ, వ్యతిరేకతను గానీ వ్యక్తం చేయలేదు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని తెలిపాడు. అర్థాంతరంగా దేశం నుంచి వెళ్లగొట్టడంపై న్యాయ నిపుణులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటానని జాకబ్ వెల్లడించాడు. ఈ పరిణామాలపై మద్రాస్ ఐఐటీని సంప్రదించగా, వారు ఇంకా స్పందించాల్సి ఉంది. -
జర్మనీ చాన్స్‌లర్‌గా మెర్కెల్!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఐరోపాలో అతిపెద్ద దేశమైన జర్మనీ పార్లమెంటులో దిగువ సభ బుందేస్టాగ్‌కు ఆదివారం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ (63) వరుసగా నాలుగోసారి అధికారం చేపడతారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అలాగే ఇస్లాంను, వలసలను వ్యతిరేకించే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ తొలిసారిగా బుందేస్టాగ్‌లో అడుగుపెట్టనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పోటీచేసిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎస్పీడీ) ప్రస్తుత పాలక కూటమిలో భాగస్వామిగా ఉండటం విశేషం. జర్మనీలో రెండు ప్రధాన రాజకీయపక్షాలైన క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ), ఎస్పీడీ కలిసి ప్రభుత్వాన్ని నడిపితే దాన్ని ‘మహా సంకీర్ణం’ (గ్రాండ్ కొయెలేషన్) అని పిలుస్తారు. ప్రస్తుత మహాసంకీర్ణం సజావుగా నడవడం లేదనీ, భవిష్యత్తులో దీనిని కొనసాగించకూడదని భావించిన ఎస్డీపీ ఈ ఎన్నికల్లో అధికారం కోసం సొంతంగా పోటీపడింది. చాన్స్‌లర్ పదవికి ఎస్పీడీ అభ్యర్థిగా 61 ఏళ్ల మార్టిన్ షూల్జ్ రంగంలోకి దిగారు. ఐరోపా కూటమి పార్లమెంటు అధ్యక్షునిగాను 2012, 2014లో షూల్జ్ ఎన్నికయ్యారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి బుందేస్టాగ్‌కు ఎన్నికలు జరుగుతాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మెర్కెల్ పార్టీకి 32.5–33.5 శాతం, ఎస్పీడీకి 20–21%, ఏఎఫ్‌డీకి 13–13.5% ఓట్లు వచ్చాయి. 2005లో తొలిసారిగా ఏంజిలా చాన్స్‌లర్ పదవి చేపట్టారు. ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ)–క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో ఆధిక్యం సాధించడంతో పన్నెండేళ్లుగా ఏంజిలానే చాన్స్‌లర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే 16 ఏళ్లు అధికారంలో ఉండి, హెల్ముల్ కోల్ రికార్డును మెర్కెల్ సమం చేస్తారు. రెండు ఓట్లు–దామాషా పద్ధతి! జర్మనీలో ఓటు హక్కు కలిగినవారు ఆరు కోట్ల పదిహేను లక్షలమంది ఉన్నారు. బుందేస్టాగ్‌లో మొత్తం 598 మంది సభ్యులుంటారు. అందులో సగం మంది సభ్యులను(299 మంది) అంతే సంఖ్యలో ఉండే నియోజకవర్గాల నుంచి ఎన్నుకుంటారు. మిగిలిన సగం సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం(దామాషా పద్ధతి) ద్వారా ఎంపిక చేస్తారు. పోలింగ్ రోజు ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేస్తారు. ఒక ఓటు బుందేస్టాగ్‌లో తమ నియోజకవర్గ ప్రతినిధికి, రెండో ఓటు తమ కిష్టమైన రాజకీయ పార్టీకి వేసే హక్కు పౌరులకు ఉంది. మొదటి ఓటు ద్వారా 299 మంది బుందేస్టాగ్ సభ్యులు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతారు. రెండో ఓటు ద్వారా మిగిలిన సగం మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు. కనీసం 5 శాతం ఓట్లు దక్కించుకున్న ప్రతి రాజకీయపక్షం అదే నిష్పత్తిలో సభ్యులను (299లో వాటా కింద) బుందేస్టాగ్ సభకు నామినేట్ చేసుకుంటుంది. 5% ఓట్లు కూడా రాని పార్టీకి ఈ పద్ధతిలో సభ్యులను పంపే అర్హత ఉండదు. -
ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు
ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయానికి శనివారం జర్మనీకి చెందిన 15 వుంది భక్తులు వచ్చారు. స్వామి, అవ్మువారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. శిఖర దర్శనాలు చేసుకుని ఆలయ శిల్పసౌందర్యాన్ని కొనియాడారు. అనంతరం ఆలయ సమీపంలోని కళంకారీ సెంటర్లలో పలు వస్తువులు కొనుగోలు చేశారు. -
జట్టు ఓటమిపై అర్జెంటీనా అభిమానుల ఆగ్రహం
బ్రెజిల్ : ప్రపంచ ఫుట్‌బాల్ సాకర్‌లో తమ జట్టు ఓటమిపై అర్జెంటీనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా జర్మనీ అభిమానులు, పోలీసులపై వారు దాడి చేశారు. ఈ సంఘటనలో 15మంది అభిమానులు గాయపడ్డారు. పలు దుకాణాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బ్రెజిల్ పోలీసులు అర్జెంటీనా అభిమానులపై బాష్పవాయువు ప్రయోగించారు. 40మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇక ఫుట్‌బాల్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. ఆట కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. అవసరమైతే ఫుట్‌బాల్ కోసం ప్రాణం ఇస్తారు. తిక్కపుడితే ప్రాణాలు తీస్తారు కూడా. ఫుట్‌బాల్‌పై అభిమానం దురభిమానంగా మారిన సందర్భాలు అనేకం. అందుకు పై ఘటన కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా సాకర్‌పై అభిమానం ఆటగాళ్ల హత్యకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నెల్సన్ రివేరా (సాల్వడార్), ఒరేన్ సింప్సన్ (జమైకా) ఇలా పలువురు ఆటగాళ్లు దురాభిమానానికి బలైన వాళ్లే.