జట్టు ఓటమిపై అర్జెంటీనా అభిమానుల ఆగ్రహం
బ్రెజిల్ : ప్రపంచ ఫుట్‌బాల్ సాకర్లో తమ జట్టు ఓటమిపై అర్జెంటీనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా జర్మనీ అభిమానులు, పోలీసులపై వారు దాడి చేశారు. ఈ సంఘటనలో 15మంది అభిమానులు గాయపడ్డారు. పలు దుకాణాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బ్రెజిల్ పోలీసులు అర్జెంటీనా అభిమానులపై బాష్పవాయువు ప్రయోగించారు. 40మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
ఇక ఫుట్‌బాల్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. ఆట కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. అవసరమైతే ఫుట్‌బాల్ కోసం ప్రాణం ఇస్తారు. తిక్కపుడితే ప్రాణాలు తీస్తారు కూడా. ఫుట్‌బాల్‌పై అభిమానం దురభిమానంగా మారిన సందర్భాలు అనేకం. అందుకు పై ఘటన కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా సాకర్‌పై అభిమానం ఆటగాళ్ల హత్యకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నెల్సన్ రివేరా (సాల్వడార్), ఒరేన్ సింప్సన్ (జమైకా) ఇలా పలువురు ఆటగాళ్లు దురాభిమానానికి బలైన వాళ్లే.