బ్యూనోస్ ఎయిర్స్:ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న అర్జెంటీనా ఈసారి ఖచ్చితంగా ఫైనల్ రేసు లో నిలుస్తుందని ఆ జట్టు మిడ్ ఫీల్డర్ జావియర్ మస్చిరానో అభిప్రాయపడ్డాడు. 24 ఏళ్ల తరువాత తొలిసారి సెమీస్ కు చేరిన అర్జెంటీనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందని స్పష్టం చేశాడు. మొన్న బెల్జియంతో జరిగిన క్వార్టర్ ఫైనల్ 1-0 తేడాతో గెలిచిన అర్జెంటీనా ..ఇక ముందు విజయ యాత్రను కొనసాగిస్తుందన్నాడు. 'మేము బెల్జియంపై విజయంతో ఆగిపోము. విజయ పరంపరను ఇలానే కొనసాగిస్త్తాం. సాధ్యమైనంత వరకూ అర్జెంటీనా ఫైనల్ రేస్ కు వెళ్లడానికి యత్నింస్తుంది 'అని తెలిపాడు. బుధవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ తో అర్జెంటీనా తలపడనుంది. గత వరల్డ్ కప్ లో రన్నరప్ గా గెలిచిన నెదర్లాండ్స్ ను తప్పకుండా నిలువరిస్తామని మస్చిరానో తెలిపాడు.