
జాబితాలో భారత్, దక్షిణ కొరియా, థాయ్‌ల్యాండ్
ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ నివేదిక
న్యూఢిల్లీ: ట్రంప్ హయాంలో పలు ఆసియా పసిఫిక్ దేశాలకు అధిక టారిఫ్‌ల రిస్క్ లు నెలకొన్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. భారత్, దక్షిణ కొరియా, థాయ్‌ల్యాండ్ తదితర దేశాలకు ముప్పు ఉందని ఒక నివేదికలో పేర్కొంది. మిగతా దేశాలతో పోలిస్తే తైవాన్, వియత్నాం, థాయ్‌ల్యాండ్, దక్షిణ కొరియాలాంటివి అమెరికాపై ఎక్కువగా ఆధారపడినందువల్ల టారిఫ్‌లు విధిస్తే ఆర్థికంగా వాటిపై ప్రభావం పడుతుందని వివరించింది.
భారత్, జపాన్‌లో దేశీ మార్కెట్ కాస్త భారీగా ఉండటం వల్ల టారిఫ్‌ల ప్రభావం నుంచి కొంత ఉపశమనం ఉండొచ్చని వివరించింది. భారత్ సహా వాణిజ్య భాగస్వాములపై ప్రతీకార టారిఫ్‌లు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆసియా పసిఫిక్‌లోని కొన్ని దేశాలు తమ ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలకన్నా అత్యధికంగా అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై విధిస్తున్నాయని నివేదిక వివరించింది. ప్రతీకార టారిఫ్ చర్యల కోసం సదరు దేశాలను పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment