Asia Pacific region
-
ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో బెంగళూరు టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గ్రేడ్–ఏ) విభాగంలో బెంగళూరు కొత్త రికార్డు నమోదు చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2022 సెప్టెంబర్ నాటికి 1.06 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసుల్లో ఉన్న సీబీఆర్ఈ ఇండియా ప్రకారం.. షాంఘై, బీజింగ్, సియోల్, టోక్యో, సింగపూర్ వంటి 11 ప్రధాన నగరాలను తలదన్ని బెంగళూరు ముందు వరుసలో నిలిచింది. షాంఘై ఒక కోటి, బీజింగ్ 76 లక్షల చ.అడుగుల విస్తీర్ణంతో ఆ తర్వాతి స్థానాలను అందుకున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఫ్లెక్సిబుల్ ఏ–గ్రేడ్ ఆఫీస్ స్థలంలో భారతదేశం ముందుంది. 12 నగరాలతో కూడిన జాబితాలో 66 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఢిల్లీ–ఎన్సీఆర్ అయిదవ స్థానంలో ఉంది. 57 లక్షల చ.అడుగులతో హైదరాబాద్ ఏడవ స్థానం ఆక్రమించింది. ఆసియా పసిఫిక్‌లో ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ రంగంలో ఈ మూడు నగరాల వాటా ఏకంగా 35 శాతానికి చేరింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే గ్రేడ్–ఏ కార్యాలయ భవనాలలో భారత్, సింగపూర్ అత్యధిక ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్థలం కలిగి ఉన్నాయి. భారత్ అత్యధిక వృద్ధి.. మొత్తం ప్రీమియం ఆఫీస్ స్పేస్‌లో 5.5 శాతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వాటాతో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మహమ్మారి తర్వాత ఫ్లెక్సీ–ఆఫీస్ మార్కెట్లో భారత్ అత్యధిక వృద్ధిని సాధిస్తోంది. ఆసియా పసిఫిక్‌లో ఫ్లెక్సిబుల్ స్థలం 6 శాతం వార్షిక వృద్ధితో 7.6 కోట్ల చ.అడుగులు ఉంది. మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే 2022 జనవరి–సెప్టెంబర్‌లో 15 శాతం వృద్ధి చెందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం ఫ్లెక్సిబుల్ కేంద్రాల సంఖ్య సుమారు 3,000 ఉంది. ఫ్లెక్సిబుల్ స్థల వినియోగంలో సాంకేతిక కంపెనీలు 36 శాతం, బిజినెస్ సర్వీసులు 28 శాతం కైవసం చేసుకున్నాయి. ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, రిటైల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు స్వల్పకాలిక ఒప్పందాలు, అనువైన నిబంధనలతో సేవలు అందిస్తున్నాయి. దీంతో క్లయింట్లకు వ్యయాలు తగ్గుతున్నాయి’ అని ద్వారక ఆఫీస్ స్పేసెస్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఫ్లెక్సిబుల్ కేంద్రాల్లో కార్యాలయాల నిర్వహణకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. -
దేశంలో నంబర్‌వన్ బీ–స్కూల్‌గా ‘ఐఎస్బీ’
రాయదుర్గం(హైదరాబాద్): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలోనే నంబర్‌వన్ బిజినెస్ స్కూల్‌గా మరోసారి గుర్తింపు సాధించింది. బ్లూమ్‌బెర్గ్ బిజినెస్ వీక్ ఉత్తమ బీ–స్కూల్స్– 2021 ర్యాంకింగ్స్‌ను బుధవారం ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో 5వ స్థానంలో నిలిచింది. బిజినెస్ స్కూల్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(పీజీపీ)లో ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. 2021–22 ర్యాంకింగ్స్‌ను ప్రకటించేందుకు బ్లూమ్‌బెర్గ్ బిజినెస్ వీక్ ప్రపంచవ్యాప్తంగా 119 బిజినెస్ స్కూల్స్‌ను సర్వే చేసింది. 6,640 మంది విద్యార్థులు, 12,462 మంది పూర్వ విద్యార్థులు, 853 మంది యజమానులను సర్వే చేసి ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. బిజినెస్ స్కూల్స్‌లో నిర్వహణ, ఎడ్యుకేషన్–లెరి్నంగ్, నెట్ వర్కింగ్, ఎంట్రప్రెన్యూర్íÙప్ వంటి నాలుగు అంశాలను ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్స్‌ను ఇచ్చారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఐఎస్బీ లెరి్నంగ్, నెట్ వర్కింగ్‌లో రెండోస్థానం, ఎంట్రప్రెన్యూర్íÙప్లో మూడో స్థానం, పరిహారంలో ఆరవ స్థానంలో నిలిచింది. సమష్టి కృషికి నిదర్శనం ఐఎస్బీ అత్యుత్తమ ర్యాంకింగ్ సాధనకు ఫ్యాకల్టీ, అధికారులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సమష్టిగా చేసిన కృషికి నిదర్శనం. ర్యాంకింగ్‌లు మెరుగుపడటంతో మరింత బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేస్తాం. –ప్రొఫెసర్ మదన్పిల్లుట్ల– డీన్ ఐఎస్బీ -
ఆసియా పసిఫిక్‌లో టాప్ టెక్ హబ్‌లకు కేంద్రంగా హైదరాబాద్
ఆసియా పసిఫిక్(ఏపీఏసీ) ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌లను కలిగి ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. హైటెక్ సిటీ ఎపీఎసీ ప్రాంతంలో ఇప్పటికే టాప్ 10 టెక్ కంపెనీలు స్థాపించబడ్డాయి. అలాగే, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమ శాఖ వ్యాపార సంస్థలు, టెక్నాలజీ క్యాంపస్ ల అభివృద్ధి కోసం ఇప్పటికే భూమిని కేటాయించింది. ఆసియా పసిఫిక్(ఏపీఏసీ)లో తగినంత కార్యాలయ స్థలం, రియల్ ఎస్టేట్ ఆధారంగా చూస్తే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, షెన్ జెన్, మనీలా నగరాలు టాప్-5 నగరాలు అని కొలియర్స్ నివేదిక తెలిపింది.(చదవండి: మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లున్నాయో తెలుసుకోండిలా!) ఆసియా మార్కెట్ డెవలప్ మెంట్ ఇండియా అండ్ ఎండి సీఈఓ రమేష్ నాయర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'హైదరాబాదులోని కార్యాలయం దీర్ఘకాలిక సూత్రాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. టెక్నాలజీ కంపెనీలు, ఇతర వర్క్ స్పేస్ ఆపరేటర్ల నేతృత్వంలో 2021లో మార్కెట్ 6.5 మిలియన్ చదరపు అడుగుల అందుబాటులోకి అవకాశం ఉంది" అని అన్నారు. ఈ నగరం అనేక బహుళజాతి కంపెనీలను, ప్రతిభ గల వ్యక్తులను ఆకర్షిస్తుంది. బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ అద్దె 15 నుంచి 20 శాతం చౌకగా ఉంటుంది అని అన్నారు. ప్రపంచ దిగ్గజాలు ఇక్కడ ఒక తమ అంతర్గత కేంద్రాల ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నాయి. హైదరాబాదులో దాదాపు 12 మిలియన్ చదరపు మీటర్ల కార్యాలయ స్థలం అందుబాటులో ఉంది అన్నారు. 90 శాతానికి పైగా టెక్ దిగ్గజాలకు హైటెక్ సిటీ ప్రధాన కేంద్రంగా ఉంది అని తెలిపారు. -
బ్లాక్‌లిస్టులో పాక్..!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఆ దేశాన్ని ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అక్టోబర్‌లో మళ్లీ ఈ చర్చలు జరగనున్నాయి. ఆ లోపు పాక్ తన వైఖరి మార్చుకొని ఉగ్రనిధులను ఆపకపోతే బ్లాక్ లిస్ట్‌లోనే ఉండిపోయే అవకాశం ఉంది. భారత్ కూడా సభ్యత్వం కలిగి ఉన్న ఈ ఎఫ్ఏటీఎఫ్ సదస్సుకు హోంశాఖ, విదేశాంగ శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. పాక్ తరఫున పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి వాటికి నిధులు అందకుండా చేయడంలో పాక్ విఫలమైందన్నది ఎఫ్ఏటీఎఫ్ ప్రధాన అభియోగం. ఈ బృందంలో 41 మంది సభ్యులు ఉండగా వారికి పాక్ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఉగ్ర నిధులకు వ్యతిరేకంగా రూపొందించిన 11 అంశాల్లో పదింటిని కూడా చేరలేకపోయింది. ఇప్పటికే గ్రే లిస్టులో ఉన్న పాక్ అక్టోబర్ కల్లా బృంద సభ్యులను మెప్పించగలిగేలా ఉగ్రనిధులను కట్టడి చేయాల్సి ఉంటుందని మరో అధికారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్న పాక్‌కు ఇది ఎదురు దెబ్బే. ఐరాసలో ‘కశ్మీర్’ మాటెత్తనున్న ఇమ్రాన్ ఇస్లామాబాద్: కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చూపించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతున్నా.. పాకిస్తాన్ వైఖరిలో మార్పు రావటం లేదు. త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెల 27వ తేదీన ప్రధాని ఇమ్రాన్ ఐరాసలో ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారయిందని ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. కశ్మీర్‌పై భారత్ ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ప్రసంగించే అవకాశముందని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు న్యూయార్క్ చేరుకోనున్న భారత ప్రధాని మోదీ వద్ద... భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ముస్లిం సంఘాలు, మానవ హక్కుల సంఘాలకు ఇమ్రాన్ సూచించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం ఉందని ఆ పత్రిక పేర్కొంది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంపై భారత్‌తో సంబంధాలను పాక్ తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.