womens hockey tournment
-
భారత్ శుభారంభం
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో మలేసియా జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (8వ, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ప్రీతి దూబే (43వ నిమిషంలో), ఉదిత (44వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఇతర తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా 15–0తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయగా... జపాన్, కొరియా మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. మలేసియా చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఈసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఎనిమిదో నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను సంగీత లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించినా ఫినిషింగ్ వేధించింది. ఫలితంగా 42వ నిమిషం వరకు భారత్ ఖాతాలో మరో గోల్ చేరలేదు. అయితే రెండు నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను ప్రీతి దూబే, ఉదిత సది్వనియోగం చేసుకోవడంతో భారత్ ఒక్కసారిగా 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా సంగీత ఫీల్డ్ గోల్‌తో భారత ఆధిక్యం 4–0కు పెరిగింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత్‌కు 11 పెనాల్టీ కార్నర్లు, మలేసియాకు ఒక పెనాల్టీ కార్నర్ లభించాయి. -
మహిళల హాకీలో అజేయంగా...
ఏషియాడ్ మహిళల హాకీ లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన భారత జట్టు (12 పాయింట్లు) పూల్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. కెప్టెన్ రాణి రాంపాల్ (37, 46, 56 నిమిషాలు) హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టడంతో సోమవారం చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. మోనికా (52వ ని.), నవజ్యోత్ కౌర్ (55వ ని.) చెరో గోల్ చేశారు. థాయ్ గోల్ కీపర్ అలిసా నరీన్‌గ్రామ్ అడ్డుగోడలా నిలబడటంతో ఈ మ్యాచ్‌లో రాణి సేనకు పలు అవకాశాలు చేజారాయి. అయితే, కీలక సమయంలో జూలు విదిల్చిన కెప్టెన్... రెండు గోల్స్ కొట్టి ఆధిక్యం అందించింది. మూడు నిమిషాల తేడాతో మోనికా, నవ్‌జోత్ స్కోరు చేసి దానిని మరింత పెంచారు. ఆట ఆఖరులో రాణి మరో గోల్ కొట్టింది. -
‘డ్రా’తో ముగింపు
సియోల్: దక్షిణ కొరియా మహిళల హాకీ జట్టుతో జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత జట్టు 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్ ఖాయం చేసుకున్న రాణి రాంపాల్ బృందం నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించింది. తొమ్మిదో ర్యాంకర్ కొరియాతో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున వందన (48వ ని.లో), ప్రత్యర్థి జట్టు నుంచి బోమీ కిమ్ (50వ ని.లో) చెరో గోల్ చేశారు. -
భారత్ పరాజయం
గ్లాస్గో (స్కాట్లాండ్): చాంపియన్స్ చాలెంజ్-1 మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా 2-4 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. ఆట 12వ నిమిషంలో వందన గోల్ తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత తడబడింది. ఒక్కసారిగా కొరియా దూకుడు పెంచి 14, 24, 28వ నిమిషాల్లో మూడు గోల్స్ చేసింది. 42వ నిమిషంలో కొరియా మరో గోల్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. 69వ నిమిషంలో పూనమ్ రాణి భారత్ ఖాతాలో రెండో గోల్‌ను జమచేసినా ఫలితం లేకపోయింది. సోమవారం జరిగే రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్తో భారత్ తలపడుతుంది.