మహిళల హాకీలో అజేయంగా... | Indian women book SF spot with thumping win over Thailand | Sakshi
Sakshi News home page

మహిళల హాకీలో అజేయంగా...

Published Tue, Aug 28 2018 12:38 AM | Last Updated on Tue, Aug 28 2018 12:38 AM

 Indian women book SF spot with thumping win over Thailand - Sakshi

భారత జట్టు

ఏషియాడ్‌ మహిళల హాకీ లీగ్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన భారత జట్టు (12 పాయింట్లు) పూల్‌ ‘బి’ టాపర్‌గా నిలిచింది. కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (37, 46, 56 నిమిషాలు) హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో సోమవారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. మోనికా (52వ ని.), నవజ్యోత్‌ కౌర్‌ (55వ ని.) చెరో గోల్‌ చేశారు.

థాయ్‌ గోల్‌ కీపర్‌ అలిసా నరీన్‌గ్రామ్‌ అడ్డుగోడలా నిలబడటంతో ఈ మ్యాచ్‌లో రాణి సేనకు పలు అవకాశాలు చేజారాయి. అయితే, కీలక సమయంలో జూలు విదిల్చిన కెప్టెన్‌... రెండు గోల్స్‌ కొట్టి ఆధిక్యం అందించింది. మూడు నిమిషాల తేడాతో మోనికా, నవ్‌జోత్‌ స్కోరు చేసి దానిని మరింత పెంచారు. ఆట ఆఖరులో రాణి మరో గోల్‌ కొట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement