అబా (సౌదీ అరేబియా): ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో బలహీన ప్రత్యర్థిపై గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ పేలవ ఆటతీరు కనబర్చి ‘డ్రా’గా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య గురువారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్... ఒక్క గోల్ అయినా నమోదు కాకుండా ‘డ్రా’ అయ్యింది.
తొలి అర్ధ భాగంలో మన్‌వీర్ సింగ్ రెండు సార్లు గోల్స్ చేసేందుకు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ వైపు దూసుకెళ్లాడు. కానీ గోల్ మాత్రం చేయలేకపోయాడు. రెండో అర్ధ భాగంలో విక్రమ్ ప్రతాప్ కూడా గోల్ కోసం విఫల యత్నాలు చేశాడు. మళ్లీ ఫినిషింగ్ లోపాలతో భారత్ ఖాతా తెరవలేకపోయింది.
సులువైన ప్రత్యర్థి జట్టు డిఫెన్స్‌ను ఛేదించలేకపోవడంపై భారత కోచ్ ఐగర్ స్టిమాక్ అసహనం వ్యక్తం చేశారు. తాజా ‘డ్రా’తో భారత్ ఈ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లాడిన భారత్ ఖాతాలో 4 పాయింట్లున్నాయి. 3 మ్యాచ్‌ల ద్వారా 9 పాయింట్లు సాధించిన ఖతర్ అగ్ర స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో ఖతర్ 3–0తో కువైట్‌పై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment