సంజయ్‌ బంగర్‌కు ఆర్‌సీబీ కీలక పదవి | Sanjay Bangar Appointed As RCB Batting Consultant For IPL 2021 | Sakshi
Sakshi News home page

సంజయ్‌ బంగర్‌కు ఆర్‌సీబీ కీలక పదవి

Published Wed, Feb 10 2021 1:50 PM | Last Updated on Wed, Feb 10 2021 2:08 PM

Sanjay Bangar Appointed As RCB Batting Consultant For IPL 2021 - Sakshi

బెంగళూరు: టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌కు ఆర్‌సీబీ కీలక పదవి ఇచ్చింది. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు సంబంధించి ఆర్‌సీబీ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా నియమించకుంది. ఈ సందర్భంగా ఆర్‌సీబీ ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని పేర్కొంది. 'సంజయ్‌ బంగర్‌.. ఆర్‌సీబీ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా మా జట్టుకు సహాయపడతారని ఆశిస్తున్నాం.. 'అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

కాగా సంజయ్‌ బంగర్‌ గతంలో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టుకు 2014 నుంచి 2017 వరకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. అంతేగాక 2017 నుంచి 2019 ప్రపంచకప్‌ వరకు కోహ్లి సారధ్యంలోని టీమిండియాకు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా సంజయ్‌ బంగర్‌ అనంతరం విక్రమ్‌ రాథోర్‌ టీమిండియా నూతన బ్యాటింగ్‌ కోచ్‌గా నియామకమయ్యాడు. కాగా బంగర్‌ టీమిండియా తరపున 12 టెస్టుల్లో 470 పరుగులు, 15 వన్డేల్లో 180 పరుగులు చేశాడు. 
చదవండి: ఆ బెయిల్‌ ఎలా కిందపడింది : ఇషాంత్‌
ఐసీసీపై విరాట్‌ కోహ్లి ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement