Batting consultant
-
ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు సహాయక బృందంలో...
భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుకు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయనున్నాడు. ఈ పర్యటనలో భాగంగా భారత ‘ఎ’ జట్టుతో ఇంగ్లండ్ అహ్మదాబాద్‌లో 3 నాలుగు రోజులఅనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టూర్ తొలి 9 రోజుల పాటు కార్తీక్ ఇంగ్లండ్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు. హెడ్ కోచ్ నీల్ కిలీన్ నేతృత్వంలో అతను పని చేస్తాడు. -
సంజయ్ బంగర్‌కు ఆర్సీబీ కీలక పదవి
బెంగళూరు: టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌కు ఆర్సీబీ కీలక పదవి ఇచ్చింది. ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించకుంది. ఈ సందర్భంగా ఆర్సీబీ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని పేర్కొంది. 'సంజయ్ బంగర్.. ఆర్సీబీ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా మా జట్టుకు సహాయపడతారని ఆశిస్తున్నాం.. 'అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా సంజయ్ బంగర్ గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు 2014 నుంచి 2017 వరకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. అంతేగాక 2017 నుంచి 2019 ప్రపంచకప్ వరకు కోహ్లి సారధ్యంలోని టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా సంజయ్ బంగర్ అనంతరం విక్రమ్ రాథోర్ టీమిండియా నూతన బ్యాటింగ్ కోచ్‌గా నియామకమయ్యాడు. కాగా బంగర్ టీమిండియా తరపున 12 టెస్టుల్లో 470 పరుగులు, 15 వన్డేల్లో 180 పరుగులు చేశాడు. చదవండి: ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్ ఐసీసీపై విరాట్ కోహ్లి ఆగ్రహం We are delighted to welcome Sanjay Bangar to the RCB Family as a batting consultant for #IPL2021! 🤩 Welcome aboard, Coach! 🤜🏻🤛🏻#PlayBold #WeAreChallengers #NowARoyalChallenger pic.twitter.com/SWKLthSyXl — Royal Challengers Bangalore (@RCBTweets) February 10, 2021 -
మీ కోచింగ్ పదవి నాకొద్దు..
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయాలంటూ చేసిన ప్రతిపాదనను భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ తిరస్కరించాడు. ముందే కుదుర్చుకున్న ప్రొఫెషనల్ ఒప్పందాలతో పాటు వ్యక్తిగత అం శాలు కూడా ఇందుకు కారణమని అతను చెప్పాడు. 12 టెస్టులు, 15 వన్డేలు ఆడిన బంగర్ భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఐదేళ్ల పాటు అద్భుతమైన ఫలితాలు సాధించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ లోపాలను సరిదిద్ది వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. తమ టెస్టు జట్టును పటిష్టపర్చేందుకు బంగ్లాదేశ్ బంగర్ సేవలను కోరింది. అయితే ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అతను తన వల్ల కాదని చెప్పాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్ బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. -
బంగ్లా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సంజయ్ బంగర్?
ఢాకా : అన్నీ అనుకున్నట్లు జరిగితే టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ను జూన్‌లో ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ జట్టుకు టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా చూడొచ్చు. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సంజయ్ బంగర్‌ను టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా తీసుకోవాలనే యోచనలో ఉంది. ' మేము సంజయ్ బంగర్‌తో ఈ విషయమై చర్చించాము.. కానీ తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ బంగర్ రాలేని అవకాశం ఉంటే మిగతావాళ్లతో కూడా టచ్‌లో ఉంటాము' అని బీసీబీ ఎగ్జిక్యూటివ్ కోచ్ నిజాముద్దీన్ చౌదరీ పేర్కొన్నాడు. (టెస్టు చాంపియన్‌షిప్‌పై వకార్ యూనిస్ అసంతృప్తి) కాగా ఇప్పటికే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్ బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలసిందే. ఒకవేళ బంగర్ బంగ్లా జట్టుకు టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వస్తే మాత్రం జూన్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు కొనసాగే అవకాశం ఉంది. ('ధోని ఇక జట్టులోకి రావడం కష్టమే') -
బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా లక్ష్మణ్
క్యాబ్ విజన్ 2020 ప్రాజెక్ట్ కోల్‌కతా: తమ ‘విజన్ 2020’ ప్రాజెక్ట్‌కు వీవీఎస్ లక్ష్మణ్‌ను బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నియమించుకుంది. భారత మాజీ కెప్టెన్, క్యాబ్ సంయుక్త కార్యదర్శి సౌరవ్ గంగూలీ చొరవతో లక్ష్మణ్‌ను తీసుకుంది. సీజన్లో 30 రోజుల పాటు తన సేవలందిస్తానని చెప్పిన వీవీఎస్ పరుగులు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తానన్నాడు. ‘వచ్చే ఏడాది నుంచి నా పని ప్రారంభమవుతుంది. యువకులను తీర్చిదిద్దేందుకు నా శాయశక్తుల కృషి చేస్తా. మా ఏకైక లక్ష్యం బ్యాట్స్‌మన్ పరుగులు చేయడం. దీనికి నైపుణ్యంతో పాటు టెక్నిక్ కూడా అవసరం. దీనిపై ఎక్కువగా దృష్టిపెడతా’ అని లక్ష్మణ్ వెల్లడించాడు. లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేయనున్నాడు. నవంబర్ 1న అతను ఇక్కడ చేరే అవకాశాలున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లోకి మళ్లీ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వీవీఎస్ అన్నాడు.