బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా లక్ష్మణ్
క్యాబ్ విజన్ 2020 ప్రాజెక్ట్
కోల్‌కతా: తమ ‘విజన్ 2020’ ప్రాజెక్ట్‌కు వీవీఎస్ లక్ష్మణ్‌ను బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నియమించుకుంది. భారత మాజీ కెప్టెన్, క్యాబ్ సంయుక్త కార్యదర్శి సౌరవ్ గంగూలీ చొరవతో లక్ష్మణ్‌ను తీసుకుంది. సీజన్‌లో 30 రోజుల పాటు తన సేవలందిస్తానని చెప్పిన వీవీఎస్ పరుగులు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తానన్నాడు. ‘వచ్చే ఏడాది నుంచి నా పని ప్రారంభమవుతుంది. యువకులను తీర్చిదిద్దేందుకు నా శాయశక్తుల కృషి చేస్తా.
మా ఏకైక లక్ష్యం బ్యాట్స్‌మన్ పరుగులు చేయడం. దీనికి నైపుణ్యంతో పాటు టెక్నిక్ కూడా అవసరం. దీనిపై ఎక్కువగా దృష్టిపెడతా’ అని లక్ష్మణ్ వెల్లడించాడు. లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేయనున్నాడు. నవంబర్ 1న అతను ఇక్కడ చేరే అవకాశాలున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లోకి మళ్లీ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వీవీఎస్ అన్నాడు.