vision 2020
-
Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్
"విద్వేష రాజకీయాల్లో టిడిపి ఎటు పోతే జనసేన అటు వైపే. ప్రభుత్వంపై విషం చిమ్మడంలో చంద్రబాబు ఎటు ఉంటే పవన్ కళ్యాణ్ అటు వైపే.కులాలు, మతాల మధ్య చిచ్చు రేపడంలో టిడిపి అడుగుజాడల్లోనే జనసేన నడక. అసత్య ప్రచారం చేయడంలో..కట్టకథలు వ్యాప్తి చేయడంలో బాబెలాగంటే పవన్ అలాగే. రాజకీయాల్లో అన్ని రకాల విలువలకూ తిలోదకాలివ్వడంలో బాబు రూటులోనే పవన్. చివరకు ప్రజలను మభ్యపెట్టేందుకు ఉద్దేశించిన విజన్ ప్రకటనల్లోనూ దొందూ దొందే. 2047కల్లా ఏపీనీ నంబర్ వన్ చేసేస్తామని చంద్రబాబు అనగానే పవన్ కళ్యాణ్ కూడా మీ మాటే మాట అంటూ అదే విజన్ వెలువరించారు. ఇద్దరూ షేమ్ టూ షేమ్ అంటున్నారు రాజకీయ పండితులు." నారా డైరెక్షన్.. దత్త పుత్రుడి ఓవరాక్షన్ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వంపై బురద జల్లడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ ఆరోపణలు చేస్తారో.. సరిగ్గా అవే ఆరోపణలను జనసేన అధినేవ పవన్ కళ్యాణ్ కూడా చేసేస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించడమే ఆలస్యం..పవన్ కళ్యాన్ ఆ నినాదాన్ని అంది పుచ్చుకున్నారు. హిందువులంటే మీకింత లోకువా? అంటూ పవన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. చిత్రం ఏంటంటే రామతీర్ధంతో సహా కొన్ని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంస ఘటనల్లో టిడిపి కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఉండడమే. అంటే విధ్వంస రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎలా అడుగులు వేస్తే పవన్ కళ్యాణ్ అటే నడుస్తున్నారని స్పష్టమైంది. అక్కడ స్లోగన్.. ఇక్కడ రీ సౌండ్ చంద్రబాబు నాయుడు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని అక్కడే తమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం వర్ధిల్లాలని నినదించడం ఆలస్యం పవన్ కళ్యాణ్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించారు. అమరావతి ఒక్కటే రాజధాని అన్నారు. 2019 ఎన్నికల్లో ఇదే పవన్ కళ్యాణ్ కర్నూలులో రాజధాని ఉండాలని అన్నారు. అమరావతి ఒక సామాజిక వర్గం రాజధానిగా ఉందని ఆరోపించింది కూడాపవనే. కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు టోన్ బట్టి పవన్ స్టోన్ కూడా మారిపోయింది. ఉప్పందితే చాలు.. దత్త పుత్రుడు చెలరేగి పోతాడు ఆంధ్ర ప్రదేశ్ అప్పుల పాలైపోయిందంటూ చంద్రబాబు నాయుడు అండ్ కో అబద్ధపు ప్రచారాన్ని భుజాలకెత్తుకోగానే పవన్ కళ్యాణ్ కూడా ఏపీని అప్పుల్లో ముంచేశారంటూ గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. చంద్రబాబు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదీ తీరాన నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేస్తే చంద్రబాబు అన్యాయం జరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది విధ్వంస రాజకీయం అన్నారు చంద్రబాబు. కొద్ది రోజుల తర్వాత పవన్ కూడా సరిగ్గా అదే మాట అందుకున్నారు. విధ్వంసాలతో పాలన మొదలు పెట్టారంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ప్యాకేజీకి ఇంత మహిమ ఉందా? వాలంటీర్ వ్యవస్థతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న దుగ్ధతో చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై లేనిపోని ఆరోపణలు చేస్తే.. పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి వాలంటీర్లు రాష్ట్రంలో 35 వేల మంది మహిళలను అక్రమంగా రవాణా చేసేశారని వారు దండు పాళ్యం బ్యాచ్ అని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబే దిగజారుడు రాజకీయం చేస్తే పవన్ మరింత లోతుకు దిగజారి ఇలాంటి వ్యాఖ్య చేశారు. విశాఖలో రుషికొండపై ప్రభుత్వం భవనాలు నిర్మిస్తోంటే చంద్రబాబు నాయుడు పర్యావరణానికి తూట్లు పొడిచేశారని గగ్గోలు పెట్టారు. చంద్రబాబు అన్న కొద్ది రోజులకే ఆ స్క్రిప్ట్ సహజంగానే పవన్ కళ్యాణ్ జేబులోకి వచ్చేసింది. రుషికొండను నాశనం చేసేశారని.. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నారని చంద్రబాబు లాగే పవన్ కూడా అడ్డగోలు ఆరోపణలు చేసేశారు. తాము చేసిన ఆరోపణలు విని నలుగురూ నవ్విపోతారేమోనన్న జంకు కూడా లేకుండా బాబును అలా ఇమిటేట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇద్దరికీ ఒకే సారి కలలోకి వచ్చిన 2047 తాజాగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో చంద్రబాబు ఓ షో ఏర్పాటు చేసి తనది విజన్ 2047 అన్నారు. 2047 కల్లా ఏపీని నంబర్ వన్ గా చేస్తానన్నారు. గతంలో విజన్ 2020 అన్న చంద్రబాబు ఏం చేశారో జనం చూసిన తర్వాతనే ఆయన్ను ఇంటికి పంపారు. ఇపుడు మరో 24 దూరానికి ఓ విజన్ పెట్టారు చంద్రబాబు. అప్పటికి చంద్రబాబు నాయుడికి 97 ఏళ్లు వస్తాయి. మరి అప్పటి వరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారా? అసలు ఆయన ముఖ్యమంత్రి కావడమే గగనం అయితే 2047లో ఏపీని ఏం చేస్తారో ఆయనెలా చెబుతారని విశ్లేషకులు నిలదీస్తున్నారు. సయామీ ట్విన్స్ కూడా సిగ్గుపడేలా.. చంద్రబాబు విజన్ 2047 అనగానే పవన్ కళ్యాణ్ కూడా సయామీ ట్విన్స్ లో సెకండ్ పార్ట్ లా తనది కూడా విజన్ 2047 అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడి ఇంట్లో స్విచ్ వేస్తే పవన్ కళ్యాణ్ ఇంట్లో లైట్ వెలుగుతోంది. చంద్రబాబు నాయుడి ఇంట్లో స్క్రిప్ట్ తయారైతే అది క్షణాల్లో పవన్ కళ్యాణ్ చేతికి వచ్చేస్తోంది. అందుకే చంద్రబాబు పవన్ ఏం చేసినా ఏం మాట్లాడినా ఒక్కలాగే ఉంటోంది. దశ దిశ లేకుండా దిక్కుమాలిన అజెండాలతో రాజకీయాలు చేయడంలో ఇపుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ షేమ్ టూ షేమ్ అంటున్నారు రాజకీయ పండితులు. CNS యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
భారత్ కలలు కల్లలేనా!
సాక్షి, న్యూఢిల్లీ : 2020 సంవత్సరం నాటికల్లా వర్దమాన దేశమైన భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మారడమే కాకుండా ప్రపంచంలో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, రాజకీయ నిపుణలు ఆశించారు, అంచనాలు వేశారు. భారత మాజీ రాష్ట్రపతి, ఇస్రో మాజీ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్, తోటి ప్రభుత్వ శాస్త్రవేత్త వైఎస్ రాజన్‌తో కలసి ఏకంగా ‘భారత్ 2020’లో అంటూ ఓ పుస్తకమే రాశారు. 2020లో ఆర్థికంగా చైనాను అధిగమించి అమెరికానే సవాల్ చేస్తామని, అప్పుడు వచ్చే దీపావళిని దేశభక్తులుగా గొప్పగా జరుపుకోవచ్చని బీజేపీ నేత సుబ్రమణియం స్వామి వ్యాఖ్యానించారు. 2020 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన ప్రభుత్వ విధానమని 2002లో అప్పటి దేశ ప్రధాని అటల్ బిహారి వాజపేయి స్వాతంత్య దినోత్సవ సందేశంలో ప్రకటించారు. వాస్తవానికి ఎంతో నిరాశ, నిస్పృహలతో భారత్ 2020లోకి అడుగుపెట్టింది. అభివృద్ధి ఫలాలను ఆస్వాదించాల్సిన చోట దేశవ్యాప్తంగా ఆందోళనలను చూడాల్సి వస్తోంది. ‘ఇండియా 2020 : ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’ పుస్తకాన్ని కలామ్, వైఎస్ రాజన్‌లు 1998లో రచించారు. 2007–8 సంవత్సరం నాటికి దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా వారు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 2020 నాటికి ప్రతి భారతీయుడు దారిద్య్ర రేఖకు ఎగువనే ఉంటారని కూడా ఆశించారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం భారత జనాభాలో ఇప్పటికీ 30 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనే బతుకుతున్నారు. దారిద్య్ర నిర్మూలనుకు అంచనా వేసిన సంవత్సరం గడిచిపోయి 12 సంవత్సరాలు గడిచిపోయినా పేదరిక నిర్మూలన జరగకపోగా పెరిగింది. జీవన ప్రమాణాలు మరింతగా పడిపోయాయి. ఐక్యరాజ్యసమతి అభివృద్ధి విభాగం అంచనాల ప్రకారం 2019 మానవ అభివృద్ధి సూచికలో 189 దేశాల్లో భారత్ స్థానం 129 స్థానానికి పరిమితమైంది. దేశ కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెరుగుతుందని అబ్దుల్ కలామ్ అంచనా వేయగా, మహిళా భాగస్వామ్యం 2017–18 సంవత్సరంలో మున్నెన్నడు లేనివిధంగా అత్యంత దిగువకు పడిపోయింది. మహిళ కార్మిక భాగస్వామ్యం విషయంలో ప్రపచంలో భారత్‌కన్నా ఎనిమిదంటే ఎనిమిది దేశాలే వెనకబడి ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. 2020 సంవత్సరం నాటికి భారత్ దిగువ–మధ్య ఆదాయంగల దేశం స్థాయి నుంచి ఎగువ– మధ్య ఆదాయ దేశంగా ఆవిర్భవిస్తుందని ప్రపంచ బ్యాంకకు కూడా తన నివేదికలో అంచనా వేసింది. భారత్ ఇంకా ఆ దిగువ స్థాయిలో ఉండిపోగా, పొరుగునున్న శ్రీలంగా దిగువ–మధ్య ఆదాయంగల స్థాయి నుంచి ఎగువ స్థాయికి ఎగబాకింది. 2020 నాటికి దేశంలో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగి నిరుద్యోగ సమస్య పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని కూడా అంచనా వేశారు. వారి అంచనాలకు విరుద్ధంగా 2017–2018 సంవత్సరంలో నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 6.1 శాతానికి చేరుకుంది. భారత్ ప్రణాళికా సంఘం ప్రతిపాదించిన లక్ష్యాల్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలేదు. 2020 నాటికి మహిళల్లో అక్షరాస్యతను 94 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 65 శాతం దాటలేదు. శిశు మరణాలను వెయ్యికి 22కు పరిమితం చేయాలనుకున్నారు. 2017 లెక్కల ప్రకారం అది వెయ్యికి 33 కొనసాగుతోంది. పిల్లల్లో పోషక పదార్థాల లోపాన్ని ఎనిమిది శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రస్తుతం అది 32.7 శాతానికి చేరుకుంది. దేశంలో ఆటోమొబైల్ రంగం వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా జీడీపీ వృద్ధి రేటు కూడా కనిష్ట స్థాయికి పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని మరోసారి ప్రధాన మంత్రిగా ఎన్నుకుంటే 2024 నాటికల్లా భారత్‌ను సూపర్ పవర్‌గా మారుస్తారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించగా, అబ్దుల్ కలాం ‘విజన్ 2020’ మోదీ నెరవేరుస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడంలో భారత్ 20 ఏళ్లు వెనకబడిందని పలువురు ఆర్థికవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. తోటి ఆసియా దేశాలైనా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకకన్నా భారత్ వెనకబడిపోయిందని ప్రముఖ భారత ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు భారత్ కలలు కల్లలేగదా! -
కలాం విజన్ ఇదీ..
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2020 నాటికి భారత్ ఎలా ఉండాలో, దాని రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయనకు ఎన్నో అంచనాలున్నాయి. 2000 సంవత్సరంలో కలాం నేతృత్వంలో శాస్త్ర, సాంకేతిక రంగంలోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్‌ఐసీ)కు చెందిన 500 మంది నిపుణులతో విజన్–2020 డాక్యుమెంట్ రూపొందించారు. అప్పటికి భారత్ రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయన వైఎస్.రాజన్ తో కలసి ‘2020: ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. భారత్‌లో ఉన్న సహజవనరులు, మానవ వనరులు, భారతీయుల్లో నెలకొన్న పోటీతత్వం మన దేశాన్ని శక్తిమంతమైన దేశాల సరసన నిలబెడుతుందని అంచనా వేశారు. విద్యతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని 2020 నాటికి భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోయి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతుందని ఆకాక్షించారు. అవినీతి రహిత సమాజం ఏర్పాటు కావాలంటే అక్షరాస్యత పెరగాలన్నారు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’అంటూ యువతకు పిలుపునిచ్చారు. భారత్ ఆర్థికంగా ఉచ్ఛ స్థితికి చేరుకోవాలంటే 2020 నాటికి స్థూల జాతీయోత్పత్తి 11 శాతంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పన జరిగితేనే దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. కలాం కన్న కలలకు అందరూ సలాం చేసినా ఆయన అంచనాలకు దేశం ఏ మాత్రం చేరుకోలేకపోయింది. పైగా సరికొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. -
బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా లక్ష్మణ్
క్యాబ్ విజన్ 2020 ప్రాజెక్ట్ కోల్‌కతా: తమ ‘విజన్ 2020’ ప్రాజెక్ట్‌కు వీవీఎస్ లక్ష్మణ్‌ను బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నియమించుకుంది. భారత మాజీ కెప్టెన్, క్యాబ్ సంయుక్త కార్యదర్శి సౌరవ్ గంగూలీ చొరవతో లక్ష్మణ్‌ను తీసుకుంది. సీజన్లో 30 రోజుల పాటు తన సేవలందిస్తానని చెప్పిన వీవీఎస్ పరుగులు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తానన్నాడు. ‘వచ్చే ఏడాది నుంచి నా పని ప్రారంభమవుతుంది. యువకులను తీర్చిదిద్దేందుకు నా శాయశక్తుల కృషి చేస్తా. మా ఏకైక లక్ష్యం బ్యాట్స్‌మన్ పరుగులు చేయడం. దీనికి నైపుణ్యంతో పాటు టెక్నిక్ కూడా అవసరం. దీనిపై ఎక్కువగా దృష్టిపెడతా’ అని లక్ష్మణ్ వెల్లడించాడు. లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేయనున్నాడు. నవంబర్ 1న అతను ఇక్కడ చేరే అవకాశాలున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లోకి మళ్లీ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వీవీఎస్ అన్నాడు. -
విజన్ 2020 కాదు.. విజన్ 2029!!
-
విజన్-2020 ప్రారంభించిన మమ్ముట్టి
తిరువనంతపురం: కంటి సంబంధిత కాటరాక్ట్ వ్యాధి లేని కేరళ రాష్ట్రం చూడాలని మలయాళ నటుడు మమ్మూట్టి కలలుకంటున్నారు. అందుకోసం మమ్మూట్టి తన జన్మదినం రోజున విజన్ 2020 ప్రారంభించారు. కోచీలో మమ్ముట్టి 63వ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన విజన్ 2020 కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పాల్గొన్నారు. కంటి సంబంధి వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చాందీ హామీ ఇచ్చారు. మమ్మూట్టి ప్రారంభించి కార్యక్రమానికి నిధులు అందిస్తామని ఆయన చెప్పారు. మమ్ముట్టి జన్మదినం రోజునే తిరు ఓనమ్ కావడం విశేషం. అంతేకాకుండా మమ్ముట్టి నటించిన మున్నారియిప్పు, రాజాధి రాజా చిత్రాలు మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. -
మళ్లీ చంద్రబాబు విజన్ 2020
కొత్త అభివృద్ధి వ్యూహాన్ని అమలుచేసేందుకు మరోసారి విజన్ 2020ని టీడీపీ ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది. దాంతోపాటు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు విజన్ 2029 ప్రవేశపెడతామంటోంది. ఈ విషయాలను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. నిర్దిష్ట రంగాల్లో కార్యక్రమాల అమలు కోసం ఏడు మిషన్లను ఏర్పాటు చేస్తామని, ప్రతి మిషన్‌కు ఛైర్ పర్సన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని తెలిపారు. అన్ని గ్రామాలనూ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని, నెల్లూరు జిల్లాలో స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తామని యనమల చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకికాడలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలోని అన్ని గ్రామాలను గిగాబిట్‌తో అనుసంధానం చేస్తామని అన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికైనా డిజిటల్ అక్షరాస్యత ఉండాలని, రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.