"విద్వేష రాజకీయాల్లో టిడిపి ఎటు పోతే జనసేన అటు వైపే. ప్రభుత్వంపై విషం చిమ్మడంలో చంద్రబాబు ఎటు ఉంటే పవన్ కళ్యాణ్ అటు వైపే.కులాలు, మతాల మధ్య చిచ్చు రేపడంలో టిడిపి అడుగుజాడల్లోనే జనసేన నడక. అసత్య ప్రచారం చేయడంలో..కట్టకథలు వ్యాప్తి చేయడంలో బాబెలాగంటే పవన్ అలాగే. రాజకీయాల్లో అన్ని రకాల విలువలకూ తిలోదకాలివ్వడంలో బాబు రూటులోనే పవన్. చివరకు ప్రజలను మభ్యపెట్టేందుకు ఉద్దేశించిన విజన్ ప్రకటనల్లోనూ దొందూ దొందే. 2047కల్లా ఏపీనీ నంబర్ వన్ చేసేస్తామని చంద్రబాబు అనగానే పవన్ కళ్యాణ్ కూడా మీ మాటే మాట అంటూ అదే విజన్ వెలువరించారు. ఇద్దరూ షేమ్ టూ షేమ్ అంటున్నారు రాజకీయ పండితులు."
నారా డైరెక్షన్.. దత్త పుత్రుడి ఓవరాక్షన్
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వంపై బురద జల్లడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ ఆరోపణలు చేస్తారో.. సరిగ్గా అవే ఆరోపణలను జనసేన అధినేవ పవన్ కళ్యాణ్ కూడా చేసేస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించడమే ఆలస్యం..పవన్ కళ్యాన్ ఆ నినాదాన్ని అంది పుచ్చుకున్నారు. హిందువులంటే మీకింత లోకువా? అంటూ పవన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. చిత్రం ఏంటంటే రామతీర్ధంతో సహా కొన్ని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంస ఘటనల్లో టిడిపి కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఉండడమే. అంటే విధ్వంస రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎలా అడుగులు వేస్తే పవన్ కళ్యాణ్ అటే నడుస్తున్నారని స్పష్టమైంది.
అక్కడ స్లోగన్.. ఇక్కడ రీ సౌండ్
చంద్రబాబు నాయుడు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని అక్కడే తమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం వర్ధిల్లాలని నినదించడం ఆలస్యం పవన్ కళ్యాణ్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించారు. అమరావతి ఒక్కటే రాజధాని అన్నారు. 2019 ఎన్నికల్లో ఇదే పవన్ కళ్యాణ్ కర్నూలులో రాజధాని ఉండాలని అన్నారు. అమరావతి ఒక సామాజిక వర్గం రాజధానిగా ఉందని ఆరోపించింది కూడాపవనే. కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు టోన్ బట్టి పవన్ స్టోన్ కూడా మారిపోయింది.
ఉప్పందితే చాలు.. దత్త పుత్రుడు చెలరేగి పోతాడు
ఆంధ్ర ప్రదేశ్ అప్పుల పాలైపోయిందంటూ చంద్రబాబు నాయుడు అండ్ కో అబద్ధపు ప్రచారాన్ని భుజాలకెత్తుకోగానే పవన్ కళ్యాణ్ కూడా ఏపీని అప్పుల్లో ముంచేశారంటూ గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. చంద్రబాబు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదీ తీరాన నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేస్తే చంద్రబాబు అన్యాయం జరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది విధ్వంస రాజకీయం అన్నారు చంద్రబాబు. కొద్ది రోజుల తర్వాత పవన్ కూడా సరిగ్గా అదే మాట అందుకున్నారు. విధ్వంసాలతో పాలన మొదలు పెట్టారంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.
ప్యాకేజీకి ఇంత మహిమ ఉందా?
వాలంటీర్ వ్యవస్థతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న దుగ్ధతో చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై లేనిపోని ఆరోపణలు చేస్తే.. పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి వాలంటీర్లు రాష్ట్రంలో 35 వేల మంది మహిళలను అక్రమంగా రవాణా చేసేశారని వారు దండు పాళ్యం బ్యాచ్ అని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబే దిగజారుడు రాజకీయం చేస్తే పవన్ మరింత లోతుకు దిగజారి ఇలాంటి వ్యాఖ్య చేశారు. విశాఖలో రుషికొండపై ప్రభుత్వం భవనాలు నిర్మిస్తోంటే చంద్రబాబు నాయుడు పర్యావరణానికి తూట్లు పొడిచేశారని గగ్గోలు పెట్టారు. చంద్రబాబు అన్న కొద్ది రోజులకే ఆ స్క్రిప్ట్ సహజంగానే పవన్ కళ్యాణ్ జేబులోకి వచ్చేసింది. రుషికొండను నాశనం చేసేశారని.. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నారని చంద్రబాబు లాగే పవన్ కూడా అడ్డగోలు ఆరోపణలు చేసేశారు. తాము చేసిన ఆరోపణలు విని నలుగురూ నవ్విపోతారేమోనన్న జంకు కూడా లేకుండా బాబును అలా ఇమిటేట్ చేశారు పవన్ కళ్యాణ్.
ఇద్దరికీ ఒకే సారి కలలోకి వచ్చిన 2047
తాజాగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో చంద్రబాబు ఓ షో ఏర్పాటు చేసి తనది విజన్ 2047 అన్నారు. 2047 కల్లా ఏపీని నంబర్ వన్ గా చేస్తానన్నారు. గతంలో విజన్ 2020 అన్న చంద్రబాబు ఏం చేశారో జనం చూసిన తర్వాతనే ఆయన్ను ఇంటికి పంపారు. ఇపుడు మరో 24 దూరానికి ఓ విజన్ పెట్టారు చంద్రబాబు. అప్పటికి చంద్రబాబు నాయుడికి 97 ఏళ్లు వస్తాయి. మరి అప్పటి వరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారా? అసలు ఆయన ముఖ్యమంత్రి కావడమే గగనం అయితే 2047లో ఏపీని ఏం చేస్తారో ఆయనెలా చెబుతారని విశ్లేషకులు నిలదీస్తున్నారు.
సయామీ ట్విన్స్ కూడా సిగ్గుపడేలా..
చంద్రబాబు విజన్ 2047 అనగానే పవన్ కళ్యాణ్ కూడా సయామీ ట్విన్స్ లో సెకండ్ పార్ట్ లా తనది కూడా విజన్ 2047 అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడి ఇంట్లో స్విచ్ వేస్తే పవన్ కళ్యాణ్ ఇంట్లో లైట్ వెలుగుతోంది. చంద్రబాబు నాయుడి ఇంట్లో స్క్రిప్ట్ తయారైతే అది క్షణాల్లో పవన్ కళ్యాణ్ చేతికి వచ్చేస్తోంది. అందుకే చంద్రబాబు పవన్ ఏం చేసినా ఏం మాట్లాడినా ఒక్కలాగే ఉంటోంది. దశ దిశ లేకుండా దిక్కుమాలిన అజెండాలతో రాజకీయాలు చేయడంలో ఇపుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ షేమ్ టూ షేమ్ అంటున్నారు రాజకీయ పండితులు.
CNS యాజులు, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment