ఇషాన్ కిషన్- కేఎల్ రాహుల్ (PC: BCCI)
Asia Cup 2023: ఆసియా కప్-2023లో టీమిండియా వికెట్ కీపర్ ఎంపిక గురించి మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గాయంతో సతమతమవుతున్న ఆటగాడికి బదులు ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో కేఎల్ రాహుల్‌ను పక్కనపెడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని అభిప్రాయపడ్డాడు.
వాళ్లిద్దరి రీఎంట్రీ.. అయితే
పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్ ఈవెంట్ ఆగష్టు 30న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టులో గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు చోటు దక్కింది.
ఈ వన్డే టోర్నీతో ఇద్దరూ పునరాగమనం చేయనున్నారు. అయితే, రాహుల్‌ను గాయం వెంటాడుతున్న కారణంగా అతడు తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
సగం సగం ఫిట్‌నెస్ ఉన్నవాళ్లెందుకు?
ఈ క్రమంలో వికెట్ కీపర్‌గా లెఫ్టాండర్ ఇషాన్ కిషన్‌కు ప్రధాన జట్టులో చోటివ్వడంతో పాటు బ్యాకప్‌గా మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘రెగ్యులర్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ రాణిస్తున్నాడు. తనలో ఎలాంటి ప్రయత్నలోపం లేదు. సగం సగం ఫిట్‌నెస్‌తో.. అసలు ఆడతాడా లేడా అన్న సందేహంలో ముంచేసే ఆటగాడి కంటే.. పూర్తి ఫిట్‌గా ఉన్నవాళ్లకే మొదటి వికెట్ కీపర్‌గా ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇషాన్ కిషన్ బెస్ట్ ఆప్షన్
నాకు తెలిసి కేఎల్ రాహుల్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులోకి వస్తాడు. స్పెషలిస్టు బ్యాటర్ మాత్రం కాదు. టాప్-5లో వికెట్ కీపర్ కూడా ఉండాలనుకుంటే.. ఆరు బౌలింగ్ ఆప్షన్లు కూడా దొరుకుతాయి.
జట్టు సమతూకంగా ఉంటుంది’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సంజయ్ బంగర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రాహుల్ బదులు ఫిట్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌నే వికెట్ కీపర్ బ్యాటర్‌గా తుదిజట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.
విండీస్‌లో యువ బ్యాటర్ మెరుపులు
కాగా ఇటీవల వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇషాన్ కిషన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లలోవరుసగా 52, 55, 77 పరుగులతో రాణించాడు. కరేబియన్ దీవిలో వరుస హాఫ్ సెంచరీలతో ఆకట్టుకుని రికార్డులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ ఈ మేరకు జట్టు కూర్పు విషయంలో తనకైతే ఇషాన్ ఫస్ట్ ఛాయిస్ అని పేర్కొన్నాడు.
చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్
Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
నిద్రలేని రాత్రులు కూడా సంతోషాన్నిస్తాయి.. గుడ్‌న్యూస్ చెప్పిన యువీ!
Comments
Please login to add a commentAdd a comment