
సెహ్వాగ్ లో ఆ సత్తా ఉంది: బంగర్
న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటాడని పంజాబ్ ఎలెవన్ కింగ్స్ కోచ్ సంజయ్ బంగర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. టీమిండియాలో స్థానం సంపాదించే సత్తా ఇప్పటికీ సెహ్వాగ్ ఉందని అభిప్రాయపడ్డాడు. 36 ఏళ్ల సెహ్వాగ్ ఫిట్ నెస్ కాపాడుకునేందుకు అతడు చాలా కష్టపడుతున్నాడని బంగర్ వెల్లడించాడు. దేశీయ క్రికెట్ లోనూ రాణించాడని తెలిపాడు.
పుణెలో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ టీమ్ ప్రాక్టీస్ లో సెహ్వాగ్ ను గమినించిన తర్వాత బంగర్ ఈ అభిప్రాయం వెలిబుచ్చాడు. సెహ్వాగ్ ఎలా ఆడతాడో మనకందరికీ తెలుసునని, మునుపటిలా ఆడగల సత్తా అతడిలో ఉందని తెలిపాడు. ఐపీఎల్-8లో మురళీ విజయ్ తో కలిసి సెహ్వాగ్ ఓపెనర్ గా వచ్చే అవకాశముంది.