భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తాడని బంగర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుపై టెస్టుల్లో రాణించేందుకు హిట్‌మ్యాన్ ఆసక్తిగా ఉన్నాడని బంగర్ తెలిపాడు.
కాగా రోహిత్ శర్మకు ఈ టెస్టు సిరీస్ చాలా కీలకం. ఎందుకంటే కెప్టెన్‌గా రోహిత్ బాధ్యతలు చేపట్టాక పూర్తి స్థాయి టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు.
"రోహిత్ శర్మకు ఈ సిరీస్ చాలా కీలకం. అతడు గాయం కారణంగా 2015 నుంచి 2018 వరకు చాలా టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. 2018లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్న దశలో రోహిత్.. వ్యక్తిగత కారణాల వల్ల కుటుంబంతో కలిసి స్వదేశానికి రావాల్సి వచ్చింది.
ఇక ఆసీస్‌తో సిరీస్ కోసం రోహిత్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు. రోహిత్ ఇప్పటికే టెస్టుల్లో ఇంగ్లండ్ వంటి విదేశీ పిచ్‌లపై ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. అదే విధంగా భారత్‌లో కూడా హిట్‌మ్యాన్ టెస్టుల్లో ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి అతడు ఆస్ట్రేలియాపై కూడా మెరుగ్గా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. అదే విధంగా కెప్టెన్‌గా కూడా జట్టుకు సిరీస్‌ను అందిస్తాడని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగర్ పేర్కొన్నాడు.
చదవండి: BGT 2023: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్‌కు గుడ్ న్యూస్! యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment