కోచ్‌ను నోటికొచ్చినట్టు తిట్టిన ప్రీతి జింటా! | Furious Preity Zinta abuses KXIP coach Sanjay Bangar in team | Sakshi
Sakshi News home page

కోచ్‌ను నోటికొచ్చినట్టు తిట్టిన ప్రీతి జింటా!

Published Thu, May 12 2016 3:06 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

కోచ్‌ను నోటికొచ్చినట్టు తిట్టిన ప్రీతి జింటా!

కోచ్‌ను నోటికొచ్చినట్టు తిట్టిన ప్రీతి జింటా!

సొట్టబుగ్గల హీరోయిన్ ప్రితీ జింతా యాజమానిగా ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుకు ఈ ఐపీఎల్‌ కూడా ఏమాత్రం కలిసిరాలేదు. ఆడిన పది మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడి.. మూడింటిని మాత్రమే గెలిచి.. గత ఐపీఎల్‌ మాదిరిగానే పంజాబ్‌ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున మగ్గుతోంది. ఇక, ఫ్లే ఆఫ్‌ ఆ జట్టుకు దాదాపు అవకాశాలు లేనట్టే.

ఈ నేపథ్యంలో సోమవారం మొహాలిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌- పంజాబ్‌ మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా జట్టు కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో పంజాబ్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే.  సంజయ్‌ బంగార్‌ తన ఇష్టానుసారం బ్యాటింగ్ ఆర్డర్‌ మార్చడం.. అక్సర్‌ పటేల్‌ కన్నా ముందే ఫర్మాన్ బెహర్దీన్‌తో పంపించడం ప్రీతికి కోపం తెప్పించిందట. దీంతో జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముందే బంగార్‌ను కోపంలో ప్రీతి అనరాని మాటలు అన్నదని, తిట్టిపోసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు మీడియా కథనాలు వచ్చాయి.

అయితే, ఈ కథనాలపై బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా వివరణ ఇచ్చింది. ఈ కథనాలు రుజువైతే తాను దీనికైనా సిద్ధమేనని, ఒకవేళ రుజువు కాలేదని తేలితే ఈ కథనాలు రాసిన జర్నలిస్టులు ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. తాను కోచ్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వచ్చిన కథనాలను ఆమె ఖండించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement