'నన్ను ఆమె తిట్టలేదు' | IPL: Punjab coach Bangar denies any threat from co-owner Preity Zinta | Sakshi
Sakshi News home page

'నన్ను ఆమె తిట్టలేదు'

Published Thu, May 12 2016 4:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

'నన్ను ఆమె తిట్టలేదు'

'నన్ను ఆమె తిట్టలేదు'

న్యూఢిల్లీ: ప్రీతి జింతా తనను ఏమీ అనలేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. తనను ఆమె దూషించిందని వచ్చిన వార్తలు కల్పితమని కొట్టిపారేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో బంగర్ పై ప్రీతి నోరు పారేసుకుందని, అతడిని కోచ్ పదవికి నుంచి పీకేస్తానని హెచ్చరించిందని ముంబైకి చెందిన దినపత్రిక ప్రచురించింది.

'మ్యాచ్ ముగిసిన తర్వాత కింగ్స్ టీమ్ యాజమానులతో మామూలుగానే మాట్లాడా. దీనికి మీడియా విపరీత అర్థాలు తీసి కల్పిత కథనాలు అల్లింది. అసభ్య, అగౌరవపరిచే మాటలు నన్ను అనలేదు. ఒక్క పరుగుతో మ్యాచ్ ఓడిపోవడం బాధ కలిగించింది. ఓడిపోయినప్పటికీ మా టీమ్ బాగా క్రికెట్ ఆడింది. టోర్నమెంట్ లో చివరి వరకు నిలిచేందుకు పోరాటం కొనసాగిస్తామ'ని బంగర్ తెలిపారు. బంగర్ ను తాను తిట్టినట్టు వచ్చిన వార్తలను ప్రీతి జింతా తీవ్రంగా ఖండించింది. కల్పిత కథనాలు ప్రచురించిన పత్రికలపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement