![Rohit Sharma should spend some time alone, figure out what his habits were: Sanjay bangar](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Rohit-sharma.jpg.webp?itok=6Xk6xqC7)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ ఆటతీరు పేలవంగా మారిపోయింది. టెస్టులు, వన్డేల్లో హిట్‌మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదే తీరును కనబరుస్తున్నాడు.
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు ఔట్ అవుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ తన ఫామ్‌ను అందుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌కు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మ తన రిథమ్‌ను తిరిగి పొందడానికి గతంలో తను ఆడిన వీడియోలు చూడాలని బంగర్ అభిప్రాయపడ్డాడు.
"రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్‌లో పరుగులు చేయని దశను అనుభవిస్తున్నాడు. అయితే అతడు తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి ఎక్కువగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అతడు ఒంటరిగా ఉండి బ్యాటర్‌గా తన గత విజయాలను గుర్తు చేసుకోవాలి.
గతంలో తన బ్యాటింగ్ చేసిన వీడియోలను చూడాలి. ప్రస్తుతం ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకోవాలి. కొన్ని సార్లు ఇలా చేయడం ఫలితాన్ని ఇస్తోంది. ఒక్కసారి రిథమ్‌ను అందుకొంటే చాలు. అంతేకానీ ఎక్కువగా ఆలోచించి నిరాశలో కూరుకుపోకూడదు" అని బంగర్ పేర్కొన్నాడు. కాగా కటక్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ తన బ్యాట్‌కు పనిచేబుతాడో లేదో చూడాలి.
కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనున్నాడు. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన కోహ్లి.. ఇప్పుడు తన ఫిట్‌నెస్‌ను తిరిగిపొందాడు . ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ధ్రువీకరించాడు. కింగ్ ఎంట్రీతో యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది.
రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: SL vs AUS: సూపర్ మేన్ స్మిత్.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment