'అవే టీమిండియాను గాయపరిచాయి' | Dropped catches hurt India, says Sanjay Bangar | Sakshi
Sakshi News home page

'అవే టీమిండియాను గాయపరిచాయి'

Published Thu, Nov 10 2016 1:41 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

'అవే టీమిండియాను గాయపరిచాయి'

'అవే టీమిండియాను గాయపరిచాయి'


రాజ్కోట్:ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కీలక క్యాచ్లను వదిలేయడం జట్టును తీవ్రంగా గాయపరిచిందని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.భారత్ కు అనుకూలంగా కొన్ని పరిస్థితులు చోటు చేసుకున్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం జట్టు సభ్యులు విఫలమయ్యారన్నాడు. ఇదే ఇంగ్లండ్ జట్టు పటిష్టస్థితిలో నిలవడానికి ప్రధాన కారణమన్నాడు.

'తొలుత బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా అది పెద్ద సమస్య కాదు. దురదృష్టం కొద్దీ కొన్ని క్యాచ్లను మా ఆటగాళ్లు వదిలేశారు.  అవతల ప్రత్యర్థి ఇంగ్లండ్ వారికి వచ్చిన అవకాశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. బ్యాటింగ్ అనుకూలించే పిచ్పై ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏ అవకాశాన్ని జార విడుచుకోలేదు. ఆ లెక్కను సరి చేయాలంటే ఈ రోజు ఆట చాలా ముఖ్యం. ఇక్కడ తొలి సెషన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది'అని బంగర్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement