మళ్లీ రిటైరవుతున్నా అంటారేమో: ధోని | Ball lelo nahi to bolega retirement le rahe hain, Dhoni tells Sanjay Bangar | Sakshi
Sakshi News home page

మళ్లీ రిటైరవుతున్నా అంటారేమో: ధోని

Published Sat, Jan 19 2019 10:27 AM | Last Updated on Sat, Jan 19 2019 10:28 AM

Ball lelo nahi to bolega retirement le rahe hain, Dhoni tells Sanjay Bangar - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో మూడో వన్డే ముగిశాక పెవిలియన్‌కు వస్తూ ఎంఎస్‌ ధోని ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. తన చేతిలో ఉన్న బంతిని బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌కు ఇస్తూ...‘నా దగ్గరి నుంచి బంతి తీసేసుకో. లేదంటే నేను రిటైరవుతున్నానని మళ్లీ అంటారేమో’ అని నవ్వుతూ చెప్పడం టీవీలో రికార్డయింది. ఇంగ్లండ్‌లో వన్డే తర్వాత ధోని అప్పట్లో బంతి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అప్పట్లో  అలా చేయడం క్రికెట్‌ నుంచి ధోని రిటైర్‌ అవుతున్నాడనే వార్తలు హల్‌చేశాయి.

ఇక తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి ధోని మాట్లాడుతూ..  ‘నేను నాలుగో స్థానంలో ఆడినా ఆరో స్థానంలో ఆడినా జట్టు సమతూకం గురించి ఆలోచించాలి. ఆరో స్థానంలో ఆడేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ జట్టు కోసం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమే. పిచ్‌ నెమ్మదిగా ఉండటం వల్ల షాట్లు ఆడటం కష్టంగా మారింది. అందుకే మ్యాచ్‌ చివరి వరకు వెళ్లింది’ అని ధోని అన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement