Sanjay Bangar provides update after Virat Kohli injures knee ahead of WTC Final - Sakshi
Sakshi News home page

IPL 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌! గాయపడ్డ కోహ్లి.. అయితే!

Published Mon, May 22 2023 12:49 PM | Last Updated on Mon, May 22 2023 1:33 PM

Sanjay Bangar provides update after Virat Kohli injures knee - Sakshi

ఐపీఎల్‌-203లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గాయపడ్డాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా కోహ్లి మోకాలికి గాయమైంది. ఇన్నింగ్స్ 15వ వేసిన విజయకుమార్‌ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌ ఫుల్‌ షాట్‌ ఆడేప్రయత్నం చేశాడు. అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది.

ఈ క్రమంలో కోహ్లి పరిగెత్తుకుంటూ వచ్చి డిప్‌మిడ్‌ వికెట్‌లో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే క్యాచ్‌ను పట్టేక్రమం‍లో విరాట్‌ మెకాలి నేలను బలంగా తాకింది. దీంతో విరాట్‌ మైదానంలో నొప్పితో విలవిల్లాడు. అయితే నొప్పి తీవ్రంగా ఉండడంతో ఫిజియో సాయంతో విరాట్‌ మైదానాన్ని వీడడాడు.

15 ఓ‍వర్‌ అనంతరం కోహ్లి తిరిగి మరి ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే కీలకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు ముందు కోహ్లి గాయపడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కోహ్లి గాయంకు సంబంధించిన అప్‌డేట్‌ను ఆర్సీబీ హెడ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ఇచ్చాడు. విరాట్‌ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, అతడి గాయం అంత తీవ్రమైనది కాదని బంగర్‌ తెలిపాడు.

"విరాట్‌ మోకాలిలో కొంచెం నొప్పి ఉంది. కానీ అది తీవ్రమైనది కాదు. కోహ్లి వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. విరాట్‌ కేవలం బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లో తనవంతు సహకారం అందిచాలని కోరుకుంటాడు. అతడు బాగా అలసిపోయాడు. ఎందుకంటే ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో దాదాపు 18 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేశాడు.

అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా 20 ఓవర్ల పాటు ఉన్నాడు. ఈ రోజు మళ్లీ దాదాపు 35 ఓవర్ల పాటు మైదానంలో ఉన్నాడు. విరాట్‌ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది" అని మ్యాచ్‌ అనంతరం ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో బంగర్‌ వెల్లడించాడు.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అతడొక అద్భుతం! కొత్తగా కనిపించాడు: హార్దిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement