ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్‌గా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ నియమించింది. కాగా పంజాబ్ ఫ్రాంచైజీతో బంగర్ జతకట్టడం ఇదేమి మొదటి సారి కాదు. 2014 సీజన్‌లో పంజాబ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా, 2015, 2016 సీజన్లలో హెడ్‌కోచ్‌గాను బంగర్ పనిచేశాడు.
వచ్చే ఏడాది సీజన్‌లో ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్‌తో కలిసి బంగర్ పనిచేయనున్నాడు. పంజాబ్ డెవలప్‌మెంట్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల బంగర్ సంతోషం వ్యక్తం చేశాడు. "మరోసారి పంజాబ్ ఫ్రాంచైజీతో మరోసారి జతకట్టడం చాలా సంతోషంగా ఉంది.
మేము ఏడాది తక్కువ మంది ప్లేయర్స్‌ను విడుదల చేశాము. మా జట్టులో ప్రస్తుతం అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అన్ని విభాగాల్లొ మా జట్టు పటిష్టంగా ఉంది. రాబోయే సీజన్‌లో విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" బంగర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఐపీఎల్- 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది.
చదవండి: అందుకే సడన్‌గా రిటైర్మెంట్ ఇచ్చా.. నా చిన్న కొడుకు వల్ల: డివిలియర్స్
Comments
Please login to add a commentAdd a comment