ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌లు చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని, కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ప్రాంఛైలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదే విషయాన్ని బుధవారం( జులై 31) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో ఆయా ప్రాంఛైజీల ఓనర్లు ప్రస్తావించారు. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా ముగ్గురు ఆన్ క్యాప్డడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు సమాచారం.
అయితే ఈ నిర్ణయాన్ని ఒకట్రెండు ఫ్రాంచైజీల ఓనర్ల మినహా దాదాపు అందరూ అంగీకరించినట్లు వినికిడి. అయితే ఇదే విషయంపై కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ సహ-యజమాని నెస్ వాడియా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. షారుక్ ఖాన్ కచ్చితంగా రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని పట్టు పట్టినట్లు సమాచారం. కానీ నెస్ వాడియా మాత్రం ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే వీలు కల్పించవద్దని, మెగా వేలం వైపు మెగ్గు చూపినట్లు క్రిక్ బజ్ పేర్కొంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్- నెస్ వాడియా మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రూల్ ప్రకారం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకునే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment