IPL Governing Council
-
IPL: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా చాముండేశ్వరనాథ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఆంధ్ర మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరనాథ్ ఎంపికయ్యారు. ఈ కౌన్సిల్లో అరుణ్ ధుమాల్, అవిషేక్ దాల్మియా ఇతర సభ్యులు కాగా... ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) తరఫున చాముండి ప్రాతినిధ్యం వహిస్తారు. 65 ఏళ్ల చాముండి ఆంధ్ర జట్టు 44 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2023–24 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన పద్దులతో పాటు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు కూడా ఈ ఏజీఎంలో ఆమోదముద్ర వేశారు. మరో వైపు వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేసిన కొత్త ప్రతిపాదనలను కూడా బోర్డు ఆమోదించింది. -
పంజాబ్ కింగ్స్ ఓనర్‌తో షారుక్ ఖాన్ తీవ్ర వాగ్వాదం.. కారణమిదే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్లు చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచాలని, కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ప్రాంఛైలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని బుధవారం( జులై 31) జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో ఆయా ప్రాంఛైజీల ఓనర్లు ప్రస్తావించారు. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా ముగ్గురు ఆన్ క్యాప్డడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఒకట్రెండు ఫ్రాంచైజీల ఓనర్ల మినహా దాదాపు అందరూ అంగీకరించినట్లు వినికిడి. అయితే ఇదే విషయంపై కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, పంజాబ్ కింగ్స్ సహ-యజమాని నెస్ వాడియా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. షారుక్ ఖాన్ కచ్చితంగా రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని పట్టు పట్టినట్లు సమాచారం. కానీ నెస్ వాడియా మాత్రం ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే వీలు కల్పించవద్దని, మెగా వేలం వైపు మెగ్గు చూపినట్లు క్రిక్ బజ్ పేర్కొంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్- నెస్ వాడియా మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రూల్ ప్రకారం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకునే అవకాశముంది. -
ఐపీఎల్లో కొత్త రూల్.. ఇక బ్యాటర్లకు చుక్కలే!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్‌కు ముందు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సీజన్ నుంచి బ్యాటర్ల దూకుడును కట్టడి చేసేందుకు ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లలను అనుమతించనున్నట్లు ఈఎస్సీఎన్ క్రిక్ ఈన్‌ఫో తమ నివేదికలో పేర్కొంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఐపీఎల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఈ రూల్‌ను ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బీసీసీఐ అమలు చేసింది. కాగా ఈ నిబంధన బౌలర్లకు సహకరిస్తుందని టీమిండియా వెటరన్ జయదేవ్ ఉనద్కట్ ఈఎస్సీఎన్తో చెప్పుకొచ్చాడు. ఈ చిన్న మార్పు గెలుపోటములను ఎంతగానో ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది. ఈ కొత్త రూల్‌ను దృష్టిలో పెట్టుకుని వేలంలో ఆయా ఫ్రాంచైజీలు పాల్గోనే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వరల్డ్‌క్లాస్ పేసర్లు మిచిల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, దక్షిణాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కోట్జీపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. చదవండి: WI vs ENG: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడికి బిగ్ షాక్.. -
IPL 2023: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2023 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్ నిర్హహకాకులు ఆయా ఫ్రాంచైజీలకు సమాచారం కూడా అందించినట్లు తెలస్తోంది. కాగా ఈ మినీ వేలం దాదాపు డిసెంబర్ 16న జరిగే అవకాశం ఉంది. అయితే వేలంకు సంబంధించి వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కాగా ఐపీఎల్ 16వ సీజన్ వచ్చే ఏడాది మార్చి అఖరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లను హోమ్, అవే పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అదే విదంగా ఈ మినీ వేలంలో ప్రతీ ప్రాంఛైజీ పర్స్ బ్యాలెన్స్‌ను 5 కోట్లు పెంచి 95 కోట్లుగా నిర్ణయించారు. ఒక వేళ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వదిలివేయడం లేదా ఇతర జట్ల నుంచి తీసుకుంటే పర్స్ బ్యాలెన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంది. అరంగేట్ర సీజన్లోనే హార్దిక్ పాండ్యా నేతత్వంలోని గుజరాత్ అదరగొట్టింది. ఆహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌ను ఓడించి గుజరాత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చదవండి: T20 WC 2022: పంత్‌కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్ దిగ్గజం -
ఎస్ఆర్హెచ్ నిరసన గళం.. బీసీసీఐ వద్దకు చేరిన కేన్ మామ పంచాయతీ..!
ఐపీఎల్ 2022 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గత కొన్ని సీజన్లుగా ఏదీ కలిసిరావడం లేదు. మెగా వేలం 2022లో ఆటగాళ్ల ఎంపిక దగ్గరి నుంచి తొలి మ్యాచ్‌లో తుది జట్టు కూర్పు వరకు ఎస్ఆర్హెచ్ తీసుకున్న ప్రతి నిర్ణయం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ వివాదస్పద క్యాచ్ నిర్ణయం తాజాగా ఎస్ఆర్హెచ్ శిబిరంలో కలకలం రేపుతోంది. ఈ మ్యాచ్‌లో కేన్ మామను ఔట్‌గా ప్రకటించిన తీరుపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బీసీసీఐ వద్ద పంచాయతీ పెట్టాలని డిసైడ్ చేసింది. Poor showcase of third umpiring.. Baised decision from third umpire @JimmyNeesh#KaneWilliamson #poorumpiring #IPL #srhvsrr pic.twitter.com/bq67OVBk0L — Rahul Kumar (@rahul98891) March 29, 2022 ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాసి, తమ అభ్యంతరాన్ని గట్టిగా తెలియజేసింది. వీడియో క్లిప్స్, వివిధ కోణాల్లో నుంచి తీసిన ఫొటోలను లేఖకు జత చేస్తూ.. తమ కెప్టెన్ ఔట్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని లేఖలో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, బాధ్యుడైన అంపైర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వీళైతే ఇలాంటి వివాదాస్పద క్యాచ్‌ల విషయంలో రూల్స్‌ను కూడా సవరించాలని కోరింది. కాగా, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ క్యాచ్ ఔటైనట్లు థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే ఫీల్డర్ (దేవ్‌దత్ పడిక్కల్) క్యాచ్ అందుకునే ముందు బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనబడుతున్నా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో వివాదానికి తెరలేసింది. వన్ స్టెప్ క్యాచ్‌లను కూడా ఔట్‌గా ప్రకటిస్తారా అంటూ ఎస్ఆర్హెచ్ అభిమానులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఆర్ఆర్తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. చదవండి: ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే వార్త.. ఏప్రిల్ 6 నుంచి..! -
మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 షురూ..
ఐపీఎల్–2020 సీజన్ మొత్తం మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 26 నుంచి మే 29 వరకు కేవలం నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించారు. ముంబైలోని వాంఖెడే, బ్రాబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు పుణే మైదానంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి 40 శాతం ప్రేక్షకుల్ని అనుమతిస్తామని లీగ్ వర్గాలు వెల్లడించాయి. -
ఐపీఎల్ వేలానికి సంబంధించి కీలక ఆప్డేట్ .. తొలి రోజు వార్నర్, ధావన్, అయ్యర్‌తో సహా!
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడింది. వేలానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో వేలానికి సంబంధించి ఓ కీలక ఆప్డేట్ బయటకు వచ్చింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేలం మొదటి రోజు(శనివారం) 590 మంది ఆటగాళ్లలో 161 మందిని మాత్రమే వేలం వేయాలని నిర్ణయించింది. కాగా శ్రేయస్ అయ్యర్,డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కగిసో రబాడతో సహా మరో 6 మంది స్టార్ ఆటగాళ్లు తొలిరోజు వేలంలో పాల్గోనబోతున్నారు. మొదటి రోజు వేలం 10 మంది ఆటగాళ్లతో కూడిన మర్క్యూ సెట్‌తో ప్రారంభమవుతుంది. ఈ సెట్లో మోస్ట్ వాంటెడ్ ఆటగాళ్లు ఉండనున్నారు. మర్క్యూ సెట్: అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, పాట్ కమిన్స్ , క్వింటన్ డి కాక్, శిఖర్ ధావన్, ఫాఫ్ డుప్లెసిస్, శ్రేయస్ అయ్యర్, కగిసో రబడ, మహ్మద్ షమీ, డేవిడ్ వార్నర్ పేర్లు ఉన్నట్లు సమాచారం. వేలం ప్రక్రియ విధానం.. ►10 మంది ఆటగాళ్లతో కూడిన మార్క్యూ సెట్‌తో వేలం ప్రారంభమవుతుంది ►మార్క్యూ సెట్ కాకుండా ఆటగాళ్లను వారి ప్రత్యేకత ఆధారంగా వివిధ సెట్లుగా విభజించారు ►మార్క్యూ సెట్‌తో కలిపి మొత్తం 62 సెట్లు ఉన్నాయి. ►బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు వారి ప్రత్యేకత ఆధారంగా మార్క్యూ సెట్ తయారు చేశారు. ► అన్క్యాప్డ్ ప్లేయర్లు ఆక్షన్ సీక్వెన్స్‌లో చివరి సెట్ ఆటగాళ్లుగా ఉంటారు. ►2018లో జరిగిన మెగా వేలం మాదిరిగా కాకుండా, ఈసారి రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఉండకూడదని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. -
ఈ ఏడాది ఐపీఎల్ ఆ రెండు రాష్ట్రాల్లోనే..!
IPL 2022 Venues: కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2022 మ్యాచ్‌ల నిర్వహణను కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందులో భాగంగా వేదికలను సైతం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అన్నీ సజావుగా సాగి భారత్‌లో కోవిడ్ కేసులు అదుపులోకి వస్తే ఏప్రిల్ 2 నుంచి జూన్ 3 మధ్య తేదీల్లో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో లీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. లీగ్ దశ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో, ప్లే ఆఫ్స్‌ను గుజరాత్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సైతం ఇదివరకే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. లీగ్ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్, పూణే స్టేడియాలు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించాలన్నది బీసీసీఐ ప్రణాళికగా తెలుస్తోంది. ఈ విషయమై ఐపీఎల్ పాలక మండలితో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కాగా, దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేవలం రెండు రాష్ట్రాల్లో లీగ్‌ను నిర్వహించడం శ్రేయస్కరమని బోర్డు పెద్దలు నిర్ణయించినట్లు బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే, స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలా.. వద్దా.. అనే విషయం కూడా కొలిక్కి వచ్చినట్లు సదరు అధికారి వెల్లడించారు. లీగ్ ప్రారంభమయ్యే నాటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే కనీసం 25 శాతం సామర్థ్యంతో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, కరోనా కారణంగా గత రెండు ఐపీఎల్ సీజన్లు ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: ఎస్ఆర్హెచ్లో ధోని పెట్టుబడులు.. ఈ ఏడాది నుంచే షురూ..! -
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకున్న వివో
-
ఇకపై 'వివో' కాదు 'టాటా' ఐపీఎల్.. ఐపీఎల్ 2022లో కీలక మార్పు
Tata IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా మొబైల్ సంస్థ ‘వీవో’ తప్పుకుంది. 2018 నుంచి టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న వీవో.. మరో రెండేళ్ల గడువు ఉండగానే నాటకీయ పరిమాణాల మధ్య వైదొలగడంతో దేశీయ వ్యాపార దిగ్గజం 'టాటా' టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు 2023 సీజన్‌కు కూడా టాటానే టైటిల్ స్పాన్సర్ చేయనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. కాగా, భారత్-చైనాల మధ్య వివాదాల కారణంగా 2020 సీజన్లో వీవో టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పించబడిన సంగతి తెలిసిందే. అప్పుడు వీవో స్థానంలో ‘డ్రీమ్ 11’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. చదవండి: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక సమావేశం.. ఖరారు కానున్న షెడ్యూల్! -
IPL 2022: భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!
భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది ఐపీఎల్‌ను స్వదేశంలో జరపాలని బీసీసీఐ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కరోనా ఉధృతి కారణంగా వేదిక తరలింపు తప్పేలా లేదని తెలుస్తుంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమై.. రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతుంది. మహమ్మారి విజృంభణ కారణంగానే మెగా వేలం, ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటనలోనూ జాప్యం జరుగుతుందని బీసీసీఐ అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి ఏప్రిల్, మే నెలల్లో తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఐపీఎల్ 2022ను విదేశాలకు తరలించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై భారత క్రికెట్ బోర్డు పరోక్ష సంకేతాలు కూడా పంపింది. కాగా, ఐపీఎల్ 15వ ఎడిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా కరోనా పరిస్థితుల కారణంగా లీగ్‌ను గతేడాది లాగే దుబాయ్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మెగా వేలం నిర్వహణ విషయంలోనూ బీసీసీఐలో సందిగ్ధత నెలకొంది. ముందుగా మెగా వేలాన్ని డిసెంబర్లోనే పూర్తి చేయాలని భావించినప్పటికీ పలు కారణాలతో ఈ తంతు వాయిదా పడింది. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో వేలం కార్యక్రమాన్ని నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. చదవండి: IPL 2022: ఆ ముగ్గురు ఎవరో జనవరి 31లోగా తేల్చుకోండి..! -
IPL 2022 Auction: మెగా వేలానికి తేదీలు ఖరారు చేసిన గవర్నింగ్ కౌన్సిల్
IPL 2022 Mega Auction Date And Venue: క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్ మెగా వేలం నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) ఆదివారం నాటి సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ముందుగా ఊహించినట్లుగానే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఈ కార్యక్రమం జరుగనుంది. అదే విధంగా ఈ సమావేశంలో భాగంగా లీగ్‌లో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ ఎంట్రీకి సంబంధించి బీసీసీఐ నియమించిన కమిటీ అందించిన నివేదికను పాలక మండలి పరిశీలించినట్లు తెలుస్తోంది. రిపోర్టును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత పదో జట్టుగా సీవీసీ క్యాపిటల్‌కు చెందిన అహ్మదాబాద్ లీగ్‌లో చేరేందుకు జీసీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా ఇప్పటికే 8 ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ ప్లేయర్ల లిస్టు సమర్పించగా.. రానున్న సీజన్లో ఎంట్రీ ఇవ్వనున్న కొత్త జట్లు ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు డిసెంబరు 25ను తుది గడువుగా నిర్ణయించారు. చదవండి: IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి గుడ్‌న్యూస్.. ఆ సమస్యలన్నీ తొలగినట్లే.. ఇక! అయితే, అహ్మదాబాద్‌కు సంబంధించిన చట్టపరమైన చిక్కులు వీడిపోనున్న నేపథ్యంలో తాజాగా కొత్త డేట్లను జీసీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా మీడియా రైట్ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. అంతేగాక కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్లాన్ బిని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. చదవండి: Virat Kohli Dismissal: 94 బంతులు.. 35 పరుగులు.. మరీ అలా అవుట్ అవడం ఏంటి!.. ఫ్రస్ట్రేషన్‌తో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో! -
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..!
IPL 2022 Auction: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వేలం ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తి అయినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఇందుకు వేదిక సైతం ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి వేలాన్ని ముంబైలో కాకుండా దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌లలో నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ డిసైడ్ చేసినట్లు సమాచారం. తొలుత ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని జనవరి మొదటి వారంలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం కాకపోవడంతో అది కుదరలేదు. ఇదిలా ఉంటే, మొత్తం పది జట్లతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే ప్రక్రియ కూడా పూర్తైంది. మరోవైపు కొత్త జట్లకు(అహ్మదాబాద్, లక్నో) సంబంధించి ఆటగాళ్ల ఎంపికకు డెడ్‌లైన్‌ను కూడా బీసీసీఐ పొడిగించింది. చదవండి: Ashes 2nd Test: రిచర్డ్సన్ పాంచ్ పటాకా.. ఇంగ్లండ్ ఘోర పరాజయం -
ఐపీఎల్ షెడ్యూల్ ఇదేనా!
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి మ్యాచ్ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 9న మొదలై.. మే 30 వరకు జరగనుంది. కాగా 52 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ మే 30వ తేదీన జరగనుంది.అయితే దీనిపై గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి సంబంధించి వచ్చేవారం ఐపీఎల్ గవర్నింగ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌తో పాటు వేదికలను కూడా ఖరారు చేయనున్నారు. అయితే తొలుత ఒకే వేదికపై ఐపీఎల్‌ను నిర్వహించాలనుకున్నారు.. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆరు వేదికలను ఖరారు చేసినట్లు తెలిసింది. అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూ ఢిల్లీ, కోల్‌కత, ముంబైలు ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న వేళ ముంబైలో మ్యాచ్‌లు జరగడం కష్టమే. అయితే మ్యాచ్ వేదికలపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకునే నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ధోని నేతృత్వంలోని సీఎస్కే జట్టు చెన్నై చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే. చదవండి: తలైవా.. వెల్కమ్ టూ చెన్నై 'ఆ వ్యాఖ్యలు చేసుంటే నన్ను క్షమించండి' -
రేపే ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభానికి ఇంకా 14 రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి షెడ్యూల్ విడుదల కాలేదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లీగ్‌కు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని.. శుక్రవారం (సెప్టెంబర్ 4న) తుది షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించాడు. కానీ నిన్న ఐపీఎల్‌కు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదు. దీంతో అసలు ఐపీఎల్ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ తాజాగా ఐపీఎల్ 2020కి సంబంధించి పూర్తి షెడ్యూల్ రేపు (సెప్టెంబర్ 6, ఆదివారం) అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. శనివారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో బ్రిజేష్ స్వయంగా వెల్లడించారు. దీంతో ఐపీఎల్ షెడ్యూల్‌కు సంబంధించిన నిరీక్షణకు తెరపడినట్లయింది. ముంబైతో జరగబోయే ఓపెనింగ్ మ్యచ్‌కు చెన్నై కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే తెలిపింది. (చదవండి : భజ్జీ దృష్టిలో డబ్బు అనేది చివరి ఆప్షన్) బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ.. 'సెప్టెంబర్ 19 నుంచే ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. లీగ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐపీఎల్లో పాల్గొనబోయే అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రాక్టీస్‌ను ఆరంభించాయి. రేపు అధికారికంగా ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేయబోతున్నాం. షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి' అంటూ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2020ని భారత్ నుంచి యూఏఈకి మార్చారు. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. కాగా అందరికంటే చివరిగా చెన్నై జట్టు శుక్రవారం తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. దుబాయ్‌కు రాగానే సీఎస్కే జట్టులో 13 మంది కరోనా బారీన పడినట్లు బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. వారెవరనేది బయటకు చెప్పకపోయినా.. అందులో ఇద్దరు ఆటగాళ్లు, మిగతావారు సీఎస్కే సిబ్బంది అని తేలింది. అయితే ఇప్పటికే ఆ 13 మందికి మూడోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రావడంతో చెన్నై జట్టు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈసారి ఐపీఎల్ 2020 స్పాన్సర్షిప్ హక్కులను డ్రీమ్ 11 ఏడాది కాలానికి గానూ దాదాపు రూ.250 కోట్లతో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : ‘సచిన్ ప్రేరణ కలిగించలేదు’) -
‘మార్చి 28న వద్దే వద్దు’
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13 ప్రారంభ తేదీపై గందరగోళం ఏర్పడింది. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 28 నుంచి ఐపీఎల్-2020 ప్రారంభించాలని గవర్నింగ్ కౌన్సిల్ భావించింది. అయితే దీనిపై ఎనిమిది ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నాయంట. అంతేకాకుండా ప్రారంభ తేదీని ఏప్రిల్ 1కి మార్చాలని ప్రాంఛైజీలు డిమాండ్ చేస్తున్నాయని సమాచారం. దీంతో గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రారంభ తేది మార్పుపై అన్ని ఫ్రాంచైజీలు పట్టుపట్టడానికి అనేక కారణాలు ఉన్నాయని ఓ ఫ్రాంచైజీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ‘ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్ మార్చి 29న, అదేవిధంగా ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ మార్చి 31న ముగియనున్నాయి. దీంతో ఈ నాలుగు జట్లకు సంబంధించిన క్రికెటర్లు ఏప్రిల్ 1వరకు ఐపీఎల్ జట్లతో చేరరు. అంతేకాకుండా వచ్చిన వెంటనే ధనాధన్ ఆట ఆడాలంటే వారిపై అధిక శ్రమ భారం పడుతుంది. దీంతో కొన్ని మ్యాచ్‌లను లేక కొన్ని రోజులైన వారికి విశ్రాంతి నివ్వాలి. అనుకున్న తేదీ ప్రకారమే మ్యాచ్‌లు ప్రారంభమైతే ఈ నాలుగు దేశాల క్రికెటర్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లు ఆడలేరు. దీంతో మాకు ఆట పరంగా, అంచనాల పరంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా ఈ నష్టం తమకే కాకుండా ఐపీఎల్ కళ దెబ్బతింటుంది. ఎందుకంటే ఐపీఎల్లో ఆ నాలుగు దేశాలకు చెందిన క్రికెటర్లే అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక అదే ఏప్రిల్ 1 నుంచి ఐపీఎల్ ప్రారంభమైతే కేవలం తొలి మ్యాచ్‌కు మాత్రమే వారు దూరమవుతారు. దీంతో పెద్దగా నష్టం జరగదు. ఇదే విషయాన్ని గవర్నింగ్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాం. అయితే ఈ అంశంపై త్వరలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు’అని ఆ సీనియర్ అధికారి పేర్కొన్నారు. -
జట్టులో ఆడే అవకాశం రాకుంటే ఇతర జట్లలోకి వెళ్లొచ్చా.?
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్(ఈపీఎల్)లా ఆటగాళ్లు జట్టును మార్చుకునే ‘మిడ్ డే టోర్నమెంట్ ప్లేయర్ ట్రాన్స్ఫర్’ నిబంధనను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈపీఎల్ నిబంధనల ప్రకారం జట్టులోని ఆటగాడికి సీజన్లో జరిగే తొలి ఏడు మ్యాచుల్లో అవకాశం ఇవ్వకుంటే నిరభ్యంతరంగా ఇతర జట్లలోకి వెళ్లవచ్చు. అయితే ఇతర జట్టు అవకాశం కల్పించినపుడే ఇది సాధ్యమవుతుంది. ఇదే నిబంధన ఐపీఎల్-11 సీజన్లో అమలు చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ యోచిస్తున్నట్లు ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది. మంగళవారం జరిగిన బీసీసీఐ- ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు ఆ పత్రిక ప్రచురించింది. ఈ నిర్ణయానికి ప్రాంచైజీ యజమానులు అంగీకరించారని కూడా పేర్కొంది. -
బీసీసీఐ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అక్రమాలకు పాల్పడ్డాయంటూ చెన్సై, రాజస్థాన్ జట్లతోపాటు ఆయా యజమానులపైనా నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ తీర్పు వెలువరించిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలను బీసీసీఐ వెల్లడించింది. జస్టిస్ లోథా తీర్పు అనంతర పరిణామాలు, ఆటపై వాటి ప్రభావం, చేపట్టాల్సిన మార్పులు తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఓ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరిని సభ్యులుగా నియమించాలనే నిర్ణయాన్ని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాకు వదిలేసింది. సదరు కమిటీ పని ప్రారంభించిన ఆరువారాలలోగా తన నివేదికను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు సమర్పించాల్సి ఉంటుంది. బీసీసీఐ వెల్లడించిన నిర్ణయాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. జస్టిస్ లోథా కమిషన్ తీర్పును బీసీసీఐ సంపూర్ణంగా గౌరవిస్తున్నది. కమిషన్ నిర్దేశించిన అంశాలను ఆచరిస్తుంది. క్రికెట్ ఉన్నతిని కాపాడాల్సిన అవసరాన్ని బీసీసీఐ గుర్తించింది. అందుకే కార్యాచరణ కమిటీ ఏర్పాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా.. కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తారు. లోథా కమిషన్ తీర్పును అధ్యయనం చేయడంతోపాటు ఐపీఎల్ లో చేపట్టవలసిన మార్పులపై ఈ కమిటీ సూచనలు చేస్తుంది. ఐపీఎల్ సలహా మండలితోనూ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. ఆటకు సంబంధించి ఎవరుకూడా నష్టపోవద్దన్నదే మా అభిమతం ఈ బృందం ఆరు వారాల్లోగ తన నివేదికను రూపొందించాలి. నివేదిక పరిశీలన అనంతరం బీసీసీఐ వర్కింగ్ కమిటీ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. -
ఎంసీఏ లేఖపై నేడు నిర్ణయం
ముంబై: ఐపీఎల్-7 ఫైనల్ మ్యాచ్ వేదికను వాంఖడే స్టేడియం నుంచి తరలించ డాన్ని నిరసిస్తూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) రాసిన లేఖపై లీగ్ పాలక మండలి నేడు (మంగళవారం) నిర్ణయం తీసుకోనుంది. ‘సోమవారం మా మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఫైనల్ వేదికను బెంగళూరుకు మార్చడాన్ని సభ్యులు వ్యతిరేకించారు. ఈ విషయంపై బీసీసీఐతో పాటు ఐపీఎల్ పాలకమండలితో టచ్‌లో ఉన్నాం. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ కూడా మా లేఖపై చర్చించి తుది విషయం నేడు చెబుతామని అన్నారు. ఎంసీఏకు అనుకూలంగానే అంతా జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని కమిటీకి అధ్యక్షత వహించిన ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు. జూన్ 1న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌ను ఎలాంటి కారణాలు చూపకుండానే ముంబై నుంచి బెంగళూరుకు తరలిస్తూ శనివారం ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.