IPL: ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా చాముండేశ్వరనాథ్‌ | IPL Governing Council Arun Dhumal Avishek Dalmiya Re Elected V Chamundeswaranath In | Sakshi
Sakshi News home page

IPL: ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా చాముండేశ్వరనాథ్‌

Published Mon, Sep 30 2024 4:24 PM | Last Updated on Mon, Sep 30 2024 4:34 PM

IPL Governing Council Arun Dhumal Avishek Dalmiya Re Elected V Chamundeswaranath In

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఆంధ్ర మాజీ క్రికెటర్‌ వి.చాముండేశ్వరనాథ్‌ ఎంపికయ్యారు. ఈ కౌన్సిల్‌లో అరుణ్‌ ధుమాల్, అవిషేక్‌ దాల్మియా ఇతర సభ్యులు కాగా... ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) తరఫున చాముండి ప్రాతినిధ్యం వహిస్తారు. 65 ఏళ్ల చాముండి ఆంధ్ర జట్టు 44 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు. ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కాగా 2023–24 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన పద్దులతో పాటు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు కూడా ఈ ఏజీఎంలో ఆమోదముద్ర వేశారు. మరో వైపు వచ్చే సీజన్‌ కోసం ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చేసిన కొత్త ప్రతిపాదనలను కూడా బోర్డు ఆమోదించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement