
Courtesy BCCI
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేపటి నుంచి (మార్చి 22) ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది.
అత్యధిక బౌండరీలు
ఈ సీజన్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సీజన్‌లో కోహ్లి మరో 64 బౌండరీలు బాదితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ ఖాతాలో 768 బౌండరీలు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 705 బౌండరీలు ఉన్నాయి.
అత్యధిక హాఫ్ సెంచరీలు
ఈ సీజన్‌లో విరాట్ మరో నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే.. ఐపీఎల్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (హాఫ్ సెంచరీ ప్లస్ సెంచరీలు) చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఖాతాలో 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 63 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉన్నాయి.
తొలి భారతీయుడిగా రికార్డు
ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ మరో 114 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్‌లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12886 పరుగులు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ ప్రపంచవాప్తంగా అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562), అలెక్స్ హేల్స్ (13610), షోయబ్ మాలిక్ (13537), కీరన్ పోలార్డ్ (13537), డేవిడ్ వార్నర్ (12913) టాప్-5లో ఉన్నారు.
తొలి ప్లేయర్‌గా..!
ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ మరో 24 పరుగులు చేస్తే ఆసియా ఖండంలో 11000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.విరాట్ ఆసియాలో ఇప్పటివరకు 10976 పరుగులు స్కోర్ చేశాడు.
ఓపెనర్‌గా 5000 పరుగులు
ఈ ఐపీఎల్‌లో విరాట్ మరో 97 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్ల జాబితాలో చేరతాడు.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు..
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్
ఐపీఎల్ 2025లో కేకేఆర్ జట్టు..
అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్‌నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్
Comments
Please login to add a commentAdd a comment