ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడింది. వేలానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో వేలానికి సంబంధించి ఓ కీలక ఆప్‌డేట్ బయటకు వచ్చింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేలం మొదటి రోజు(శనివారం) 590 మంది ఆటగాళ్లలో 161 మందిని మాత్రమే వేలం వేయాలని నిర్ణయించింది.
కాగా శ్రేయస్ అయ్యర్,డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కగిసో రబాడతో సహా మరో 6 మంది స్టార్ ఆటగాళ్లు తొలిరోజు వేలంలో పాల్గోనబోతున్నారు. మొదటి రోజు వేలం 10 మంది ఆటగాళ్లతో కూడిన మర్క్యూ సెట్‌తో ప్రారంభమవుతుంది. ఈ సెట్‌లో మోస్ట్ వాంటెడ్ ఆటగాళ్లు ఉండనున్నారు.
మర్క్యూ సెట్: అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, పాట్ కమిన్స్ , క్వింటన్ డి కాక్, శిఖర్ ధావన్, ఫాఫ్ డుప్లెసిస్, శ్రేయస్ అయ్యర్, కగిసో రబడ, మహ్మద్ షమీ, డేవిడ్ వార్నర్ పేర్లు ఉన్నట్లు సమాచారం.
వేలం ప్రక్రియ విధానం..
►10 మంది ఆటగాళ్లతో కూడిన మార్క్యూ సెట్‌తో వేలం ప్రారంభమవుతుంది
►మార్క్యూ సెట్ కాకుండా ఆటగాళ్లను వారి ప్రత్యేకత ఆధారంగా వివిధ సెట్‌లుగా విభజించారు
►మార్క్యూ సెట్‌తో కలిపి మొత్తం 62 సెట్‌లు ఉన్నాయి.
►బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు వారి ప్రత్యేకత ఆధారంగా మార్క్యూ సెట్ తయారు చేశారు.
► అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఆక్షన్ సీక్వెన్స్‌లో చివరి సెట్ ఆటగాళ్లుగా ఉంటారు.
►2018లో జరిగిన మెగా వేలం మాదిరిగా కాకుండా, ఈసారి రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఉండకూడదని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment