IPL 2022 Mega Auction Date And Venue Details: IPL Auction To Take Place In February Says Reports - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! 

Published Mon, Dec 20 2021 8:38 PM | Last Updated on Tue, Dec 21 2021 8:32 AM

IPL 2022 Mega Auction To Take Place In February Says Reports - Sakshi

IPL 2022 Auction: క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వేలం ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తి అయినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఇందుకు వేదిక సైతం ఫైనలైజ్‌ అయినట్లు తెలుస్తోంది. ఈసారి వేలాన్ని ముంబైలో కాకుండా దక్షిణాది నగరాలైన  బెంగళూరు, హైదరాబాద్‌లలో నిర్వహించాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ డిసైడ్‌ చేసినట్లు సమాచారం.

తొలుత ఐపీఎల్‌ 2022 మెగా వేలాన్ని జనవరి మొదటి వారంలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం కాకపోవడంతో అది కుదరలేదు. ఇదిలా ఉంటే, మొత్తం పది జట్లతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆటగాళ్లను రిటైన్‌ చేసుకునే ప్రక్రియ కూడా పూర్తైంది. మరోవైపు కొత్త జట్లకు(అహ్మదాబాద్‌, లక్నో) సంబంధించి ఆటగాళ్ల ఎంపికకు డెడ్‌లైన్‌ను కూడా బీసీసీఐ పొడిగించింది. 
చదవండి: Ashes 2nd Test: రిచర్డ్‌సన్ పాంచ్‌ పటాకా.. ఇంగ్లండ్ ఘోర పరాజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement