ఐపీఎల్-2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ ముగిసింది. ఈ ఏడాది సీజన్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది.
ఇక ఇది ఇలా ఉండగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా టీమిండియా స్టార్, ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి నిలవగా.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో హర్షల్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్‌ను అవార్డును సొంతం చేసుకున్న మూడో క్రికెటర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ జాబితాలో హర్షల్ పటేల్ భువనేశ్వర్ కుమార్, డ్వేన్ బ్రావో ఉన్నారు.
భువనేశ్వర్ (2016, 2017), బ్రావో (2013, 2015) సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ అవార్డును గెలుచుకున్నారు. హర్షల్ పటేల్ అంతకుముందు 2021 సీజన్‌లో ఆర్సీబీ తరపున పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు.
అదే విధంగా మరో రికార్డును కూడా పటేల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లు తరపున పర్పుల్ క్యాప్ గెలిచిన తొలి ఆటగాడిగా హర్షల్ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment