SRH Vs PBKS: పంజాబ్‌పై ఘ‌న విజ‌యం.. సెకెండ్ ప్లేస్‌కు ఎస్ఆర్‌హెచ్‌ | IPL 2024: Hyderabad Chase Down 215 Easily, Move To Second Spot In Points Table | Sakshi
Sakshi News home page

IPL 2024 SRH Vs PBKS: పంజాబ్‌పై ఘ‌న విజ‌యం.. సెకెండ్ ప్లేస్‌కు ఎస్ఆర్‌హెచ్‌

Published Sun, May 19 2024 7:42 PM | Last Updated on Mon, May 20 2024 12:22 PM

Hyderabad chase down 215 easily, move to second spot

ఐపీఎల్‌-2024లో త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద‌రగొట్టింది. ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించింది. 

దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్ధానానికి స‌న్‌రైజ‌ర్స్ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 214 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(71) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. రూసో(49), అథర్వ తైదే(46), జితేష్ శ‌ర్మ‌(32) అద‌ర‌గొట్టారు. 

ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో టి న‌ట‌రాజ‌న్ రెండు వికెట్లు, క‌మ్మిన్స్‌, వియస్కాంత్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం 215 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్‌..19.1 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌(66) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో పాటు హెన్రిచ్ క్లాసెన్‌(42), నితీష్ కుమార్ రెడ్డి(37), రాహుల్ త్రిపాఠి(33) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. 

పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement