RCB Vs RR: నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరుతో రాజస్తాన్‌ ‘ఢీ’ | IPL 2024 RCB Vs RR: Today Rajasthan Will Face Bangalore In The Eliminator Match, See Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs RR: నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరుతో రాజస్తాన్‌ ‘ఢీ’

Published Wed, May 22 2024 4:18 AM

Today Rajasthan will face Bangalore in the eliminator match

ఐపీఎల్‌ టైటిల్‌ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో... నేడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్‌లో రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్‌ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. 

ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరుతో రాజస్తాన్‌ ‘ఢీ’ మిస్తుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేత జట్టు క్వాలిఫయర్‌–1లో ఓడిపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో ఫైనల్‌ బెర్త్‌ కోసం పోటీపడుతుంది. 

తాజా సీజన్‌లో బెంగళూరు లీగ్‌ దశలోనే నిష్క్రమించే దశ నుంచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి అబ్బురపరిచింది. డు ప్లెసిస్‌ నాయకత్వంలోని బెంగళూరు జట్టు తమ చివరి 6 లీగ్‌ మ్యాచ్‌ల్లో నెగ్గి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు సంజూ సామ్సన్‌ సారథ్యంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, ఐదో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.   

Advertisement
 
Advertisement
 
Advertisement