mike hesson
-
ఆర్సీబీతో బంధానికి ముగింపు.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో.. హెడ్‌కోచ్‌గా
Mike Hesson- Pakistan Super League: న్యూజిలాండ్ మాజీ హెడ్‌కోచ్ మైక్ హసన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగం కానున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అతడు హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బంధం తెంచుకున్న తర్వాత ఈ మేరకు కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందించిన మైక్ హసన్‌కు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ మైక్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి పూర్తిగా బయటికొచ్చిన ఈ న్యూజిలాండ్ స్టార్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు. కాగా గత ఐదు సీజన్లలో ఇస్లామాబాద్ జట్టు నాలుగుసార్లూ నాకౌట్ దశకు చేరుకున్నా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో కోచ్ అజర్ మహ్మూద్పై వేటు వేసిన యాజమాన్యం ఆ స్థానాన్ని మైక్ హసన్‌తో భర్తీ చేసింది. సంతోషంగా ఉంది ఇక తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన మైక్ హసన్.. ‘‘ఇస్లామాబాద్ యునైటెడ్‌లో భాగం కావం సంతోషంగా ఉంది. ఎక్స్‌లెన్స్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్.. ఇలా నాలుగు E-లను ప్రధాన లక్షణాలుగా చేసుకుని ముందుకు సాగుతున్న జట్టుతో చేరడం గొప్ప విషయం. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిగి ఉన్న ఈ టీమ్‌తో ప్రయాణం సాగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీతో దాదాపు ఐదేళ్లు కాగా గతంలో న్యూజిలాండ్‌తో పాటు అర్జెంటీనా, కెన్యా జట్లకు మైక్ హసన్ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా 2019-2023 వరకు ఆర్సీబీ డైరెక్టర్‌గా ఉన్నాడు. అతడి మార్గదర్శనంలో ఆర్సీబీ 2020- 2022 వరకు వరుసగా మూడుసార్లు ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. చదవండి: WC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్‌కు షాక్ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే! -
IPL 2024: ఆర్సీబీని వీడటం చాలా బాధగా ఉంది.. అందరికీ థాంక్స్
Disappointed to be leaving RCB: ‘‘గత నాలుగు సీజన్లలో మూడుసార్లు మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌నకు చేరుకున్నాం. కానీ.. అభిమానులు, ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు నేనూ.. మేమంతా కోరుకున్నట్లుగా.. ట్రోఫీ గెలవలేకపోయాం. ఆర్సీబీని వీడటం నిరాశకు గురిచేసినా.. ఇక్కడ నేనెన్నో మధురజ్ఞాపకాలు మూటగట్టుకోగలిగాను. గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఆర్సీబీకి, జట్టు కొత్త కోచింగ్ సిబ్బందికి ఆల్ ది బెస్ట్. ఇక అద్భుతమైన ఆర్సీబీ అభిమానుల గురించి చెప్పేదేముంది? మీ అందరి అంతులేని ఆదరాభిమానాలకు, ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు.. సొంత ఇంట్లో ఉన్న భావన కల్పించినందుకు ధన్యవాదాలు’’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేసిన మైక్ హసన్ భావోద్వేగానికి లోనయ్యాడు. బాధగా ఉంది.. ఆర్సీబీని వీడటం బాధగా ఉందని.. శాయశక్తులా కృషి చేసినా ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకోయామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా కొత్త సిబ్బంది మార్గదర్శనంలో ఆర్సీబీ మరింత ముందుకు వెళ్లాలని మైక్ హసన్ ఆకాంక్షించాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్సీబీ కీలక నిర్ణయాలు మైక్ హసన్‌ను ఉద్వాసన పలకడంతో పాటు హెడ్‌కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు వేసింది. కొత్త కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ కప్ విన్నింగ్ కోచ్ ఫ్లవర్‌కు స్వాగతం పలుకుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో బంధం ముగిసిన నేపథ్యంలో.. న్యూజిలాండ్‌కు చెందిన 48 ఏళ్ల మైక్ హసన్ సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరిత పోస్ట్ షేర్ చేశాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ మాత్రం చేరుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో పదహారో ఎడిషన్‌ను ముగించింది. చదవండి: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు View this post on Instagram A post shared by Mike Hesson (@hesson_mike) We thank 𝐌𝐢𝐤𝐞 𝐇𝐞𝐬𝐬𝐨𝐧 and 𝐒𝐚𝐧𝐣𝐚𝐲 𝐁𝐚𝐧𝐠𝐚𝐫 for their commendable work during the stints as 𝗗𝗶𝗿𝗲𝗰𝘁𝗼𝗿 𝗼𝗳 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 and 𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 of RCB. 🙌#PlayBold #ನಮ್ಮRCB @CoachHesson pic.twitter.com/Np2fLuRdC0 — Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023 -
IPL 2024: ఆర్సీబీలో కీలక మార్పులు..! వాళ్లతో తెగదెంపులు!
2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అయితే బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫ్ఫిత్ను మాత్రం కొనసాగించేందుకు ఆర్సీబీ మేనేజ్మెంట్ సుముఖంగా ఉందని తెలుస్తోంది. కాగా, బాంగర్, హెస్సన్‌లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్‌గా నియమించుకుంది. కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచి సన్నాహకాలు మొదలుపెట్టాయి. లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఏకంగా తన హెడ్ కోచ్‌ను మార్చేసింది. ఆ జట్టు ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ కూడా లక్నో బాటలోనే నడవాలని భావిస్తుంది. ఇదిలా ఉంటే, విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్, జట్టు నిండా స్టార్లతో నిండిన ఆర్సీబీ ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ సాధించింది లేదు. 2009, 2011 సీజన్లలో మాత్రం ఆ జట్టు కొందరు స్టార్ల పుణ్యమా అని రన్నరప్‌గా నిలిచింది. ఇటీవలే ముగిసిన 2023 సీజన్లో అయితే, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలోనే యాజమాన్యం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని తెలుస్తుంది. -
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్.. ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చేరిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం (ఏప్రిల్ 5) వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు మాక్స్వెల్ దూరంగా ఉండనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మార్గదర్శకాల ప్రకారం.. బోర్డు కాంట్రాక్ట్ పొందిన ఏ ఆసీస్ ఆటగాడు ఏప్రిల్ 6 లోపు ఐపీఎల్లో పాల్గొనకూడదు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు గ్లెన్ మాక్స్వెల్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ ధృవీకరించాడు. “క్రికెట్ ఆస్ట్రేలియా గైడ్‌లైన్స్ ప్రకారం.. ఏప్రిల్ 6వ తేదీ లోపు కాంట్రాక్టు పొందిన ఆసీస్ ఆటగాళ్లు ఎవరూ అందుబాటులో ఉండరు. కాబట్టి గ్లెన్ మాక్స్వెల్ జట్టుతో చేరినప్పటికి అతడు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతడు ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు" అని మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. తన వివాహం కారణంగా మాక్స్వెల్ ఐపీఎల్-2022 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. చదవండి: IPL 2022 SRH Vs LSG: ఐపీఎల్ కప్ కావాలా? లేదంటే ఆరెంజ్ క్యాప్ కావాలా? Our Tom and Jerry forever! 😍🤩@Gmaxi_32 @yuzi_chahal #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/sHDkjMWj4g — Royal Challengers Bangalore (@RCBTweets) April 4, 2022 -
'సిరాజ్ చాలా దురదృష్టవంతుడు.. అతనికి అవకాశాలు ఇవ్వండి'
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ మైక్ హెస్సన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. సిరాజ్ ఎప్పడూ చాలా ఉత్సాహంగా ఉండే క్రికెటర్ అని హెస్సన్ తెలిపాడు. సాదారణంగా ఆటగాళ్లు అద్భతమైన ఫామ్‌లో ఉన్నప్పడు ఉత్సహంగా కనిపిస్తారు. సిరాజ్ మాత్రం అతడు ఫామ్‌లో ఉన్న లేక పోయినా ఎప్పడూ ఒకేలా ఉంటాడు. "సిరాజ్ ఆర్సీబీ జట్టులో తొలుత అంతగా రాణించలేదు. కానీ అతడు తన పట్టుదలతో జట్టులో ఒక్కసారిగా స్టార్ బౌలర్‌గా మారిపోయాడు. ఇక భారత తరుపున అద్భుతమైన బౌలర్లలో సిరాజ్ ఒకడు. అయినప్పటకీ దురదృష్టవంతుడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారత తరుపున అంతగా అవకాశాలు అతడికి రావడం లేదు. ఎక్కువగా సిరాజ్ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ వంటి వారికి ఇంకా అవకాశాలు ఇస్తున్నారు. అయితే కొంతమంది భారత పేసర్లు తమ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నారు. అనంతరం సిరాజ్ భారత పేస్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తాడని" హెస్సన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు సిరాజ్‌ను రూ. 7 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోలకతా నైట్రైడెర్స్ తలపడనుంది. చదవండి: IPL 2022 -Lucknow Super Giants : లక్నో సూపర్‌జెయింట్స్‌కు వరుస షాకులు.. మరో ప్లేయర్ దూరం! -
ఆర్సీబీ కీలక నిర్ణయం.. ప్రధాన కోచ్‌గా మైక్ హెసన్
దుబాయ్: ఐపీఎల్-14వ సీజన్ రెండో అంచె పోటీల ప్రారంభానికి ముందు ఆర్సీబీ కీలక మార్పులు చేస్తుంది. శనివారం జట్టులోకి ముగ్గురు కొత్త ఆటగాళ్లను తీసుకున్న ఆర్సీబీ కోచ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. దాంతో టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెసన్ ఈ సారి హెడ్‌కోచ్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక ఆర్సీబీ తన జట్టులో మూడు మార్పులు చేసింది. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్‌కు చెందిన బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ కూడా ఆర్సీబీ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. సింగపూర్‌కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శనే కనబరిచింది. 7 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. చదవండి: MS Dhoni: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్! -
8 వారాల తర్వాత.. హెసన్ భావోద్వేగం
ఆక్లాండ్ : న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ కోచ్ మైక్ హెసన్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో మనసును కదిలించేలా ఉంది. లాక్డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన హెసన్.. దాదాపు 8 వారాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ సందర్భంగా తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ డైరెక్టర్‌గా ఉన్న హెసన్ భారత్‌లో లాక్డౌన్ విధించే సమయంలో బెంగళూరులో ఉండిపోయాడు. ఆ తర్వాత భారత్‌లో లాక్‌డౌన్‌ను రెండు సార్లు పొడిగించారు. (చదవండి : మరోసారి వార్తల్లో శుభ్‌మన్, సారా టెండూల్కర్) అయితే న్యూజిలాండ్‌లో ఏప్రిల్ చివరివారంలో లాక్డౌన్ సడలింపులు ప్రకటించడంతో.. హెసన్ తన స్వదేశానికి బయలు దేరాడు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ముంబై చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడ 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉన్న తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా తన చిన్న కుమార్తెను హగ్ చేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన హెసన్.. భావోద్వేగానికి గురయ్యాడు. లాక్డౌన్లో 8 వారాల తర్వాత తన కుమార్తెను హగ్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని హెసన్ పేర్కొన్నారు. అంతకుముందు లాక్డౌన్ సమయంలో తన ప్రయాణానికి అనుమతించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్లకు హెసన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గత నెలలో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన పాత ఫొటోను షేర్ చేసిన హెసన్.. వారిని మిస్ అవుతున్నట్టు పేర్కొన్నారు. తను కరోనా సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. So good to finally give my youngest a big hug after 8 weeks in lockdown........🤗🤗🤗 . .#bangalore to #dunedin 🏨 ➡️🚌 ➡️✈️ ➡️🏨 ➡️ ✈️ ➡️🏡 .#rcb #ipl #lockdown #lockdown2020 #thankyou #thankful #dunners #bengaluru #bangalore #dadofgirls #goodvibes #thankyourcb pic.twitter.com/GlVtNVKeie — Mike Hesson ONZM (@CoachHesson) May 13, 2020 -
కోహ్లి.. అంత ఈజీ కాదు!
ఆక్లాండ్: భారత్-న్యూజిలాండ్‌ల మధ్య రసవసత్తర పోరు ఖాయమని అంటున్నాడు రాయల్ చాలెంజర్స్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్. గతంలో న్యూజిలాండ్ క్రికెట్ కోచ్‌గా పనిచేసిన హెస్సన్.. భారత్‌తో పోరు హోరాహోరీగా సాగుతుందుని జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్‌ను వారి దేశంలో ఓడించడం అంత ఈజీ కాదని అంటున్నాడు. భారత్‌లో భారత్ ఎంత పటిష్టంగా ఉంటుందో న్యూజిలాండ్‌లో కివీస్ కూడా అదే బలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కాకపోతే ప్రస్తుతం కివీస్‌ను వారి దేశంలో ఓడించాలంటే టీమిండియానే ప్రధాన ప్రత్యర్థి అని అన్నాడు. కాగా, న్యూజిలాండ్ సీమర్లను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఆసక్తిగా ఉందన్నాడు. ఈ ద్వైపాక్షిక సిరీస్ కోహ్లికి అతి పెద్ద చాలెంజ్ అని హెస్సన్ అన్నాడు. వారి దేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ కచ్చితంగా కోహ్లి అండ్ గ్యాంగ్‌కు పరీక్షేనని అన్నాడు. (ఇక్కడ చదవండి: ఆరుగురు బౌలర్ల వ్యూహం.. శాంసన్, పంత్ డౌటే? ) పేసర్ల నుంచి కోహ్లికి ఎదురయ్యే తొలి 10 నుంచి 20 బంతులు అత్యంత క్లిష్టమని తెలిపిన హెస్సన్.. ఒకవేళ అతన్ని ఆదిలో ఔట్ చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నాడు. ఒకసారి కోహ్లి గాడిలో పడ్డాడంటే ఏ పిచ్‌లోనైనా చెలరేగిపోతాడని హెస్సన్ అభిప్రాయపడ్డాడు. మరొకవైపు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ల మధ్య పోరు కూడా బాగుంటుందన్నాడు. ప్రధానంగా వన్డేల్లో బౌల్ట్ వర్సెస్ రోహిత్ శర్మ అన్న చందంగా పోరు ఉంటుందని జోస్యం చెప్పాడు. (ఇక్కడ చదవండి: అతనొక స్మార్ట్ క్రికెటర్: విరాట్ కోహ్లి) -
అక్కడ ఉంది నేను.. గెలవడం పక్కా!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13కు సంబంధించి జరిగిన ఆటగాళ్ల వేళంలో దక్షిణాఫ్రికా వెటరన్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. కనీస ధర రూ. 2కోట్లకు స్టెయిన్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ జట్టులో తిరిగి చేరడంపై స్టెయిన్ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు స్టెయిన్ తన దైన స్టైల్లో సమాధానాలిచ్చాడు. ఈ సారైనా ఆర్సీబీ ఐపీఎల్-2020 ట్రోఫీ గెలుస్తుందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా..‘తప్పక గెలుస్తుంది. ఎందుకుంటే అక్కడ ఉంది నేను’అంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా ‘ఈసారి వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలి. వికెట్లతో పాటు ట్రోఫీ సాధించి తీరాలి’అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. ‘ఆనందంతో పాటు బాధ్యత పెరిగింది’అంటూ ఫ్యాన్స్ అడిగిన దానికి బదులిచ్చాడు ఈ స్పీడ్‌గన్. ఇక స్టెయిన్ ఐపీఎల్ అరంగేట్రం చేసింది ఆర్సీబీ జట్టులో అయినప్పటికీ.. ఆ జట్టుకు తొమ్మిదేళ్ల దూరంగా ఉన్నాడు. తిరిగి ఐపీఎల్-2019లో బెంగళూరు జట్టులో చేరినప్పటికీ రెండు మ్యాచ్‌ల అనంతరం గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. అయితే తాజా వేలానికి ముందు స్టెయిన్‌ను ఆర్సీబీ వదులుకుంది. కానీ వేలంలో అనూహ్యంగా తిరిగి చేజిక్కించుకుంది. స్టెయిన్‌తో పాటు రిచర్డ్సన్, మోరిస్, ఉదానలతో ఆర్సీబీ బౌలింగ్ దుర్బేద్యంగా ఉంది. ఇప్పటికే బ్యాటింగ్‌లో దుమ్ములేపే కోహ్లి జట్టు బౌలింగ్ బలం పెరగడంతో వచ్చే సీజన్లో హాజ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. కోహ్లితో చర్చించే తీసుకున్నాం: మైక్ హెసన్ ‘వేలం ప్రారంభానికి ముందే అనుకున్నాం స్టెయిన్ అవసరం ఆర్సీబీకి ఉందని, అయితే అతడు కనీసం రూ. 3నుంచి 4 కోట్లు పలుకుతాడని భావించాం. కానీ మేము ఊహించింది జరగలేదు. లక్కీగా స్టెయిన్‌ను వేలంలో చేజిక్కించుకున్నాం. బౌలర్ల ఎంపిక విషయంలో సారథి కోహ్లితో పదేపదే చర్చించాం. మిడిల్ ఓవర్లలో మంచి బౌలర్ కావాలని అతడు కోరాడు. అందుకోసం ఉదాన సరైన వ్యక్తిగా భావించాం. దీంతో స్టెయిన్, ఉదానలను ఎంపిక చేశాం’అని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ పేర్కొన్నాడు. -
మైక్ హెసన్‌కు కీలక పదవి
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీల్లో ఒకటైన కింగ్స్ పంజాబ్ ప్రధాన కోచ్ పదవికి ఇటీవల గుడ్ బై చెప్పిన మైక్ హెసన్.. ఇక నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి సేవలందించనున్నాడు. వచ్చే ఐపీఎల్‌కు సంబంధించి ముందుగానే ప్రక్షాళన చేపట్టిన ఆర్సీబీ.. మైక్ హెసన్‌ను డైరక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా ఎంపిక చేసింది. టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం పోటీపడ్డ హెసన్‌కు నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. మరోసారి రవిశాస్త్రినే కోచ్‌గా కొనసాగించేందుకు మొగ్గుచూపడంతో హెసన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరొకవైపు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసినా అక్కడ కూడా హెసన్‌కు చుక్కెదురైంది. కాగా, ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఆర్సీబీ.. హెసన్‌పై భారీ ఆశలు పెట్టుకుని తమ క్రికెట్ ఆపరేషన్స్ డైరక్టర్‌గా నియమించింది. అదే సమయంలో ఆర్సీబీ ప్రధాన కోచ్‌గా ఆసీస్‌కు చెందిన సైమన్ కాటిచ్‌ను ఎంపిక చేసింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన కాటిచ్‌ను ఆర్సీబీ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. టీ20 ఫార్మాట్లో అనేక జట్లతో పని చేసిన అనుభవం ఉన్న కాటిచ్‌కే పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్ స్థానంలో కాటిచ్‌ను ఎంపిక చేస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. -
మైక్ హెసన్‌కు మళ్లీ నిరాశే..
ఢాకా: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం రవిశాస్త్రితో పోటీపడి రెండో స్థానంలో నిలిచిన మైక్ హెసన్‌కు మరోసారి చుక్కెదురైంది. బంగ్లాదేశ్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం పోటీ పడ్డ హెసన్ అక్కడి కూడా నిరాశే ఎదురైంది. బంగ్లాదేశ్ కుదించిన హెడ్ కోచ్‌ల జాబితాలో హెసన్ ఉన్నప్పటికీ కోచ్‌గా మాత్రం ఎంపిక కాలేదు. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ కోచ్ రసెల్ డొమినిగో ఎంపికయ్యాడు. అనుభవం దృష్ట్యా దక్షిడొమినిగోకే తొలి ప్రాధాన్యత ఇవ్వగా, హెసన్ మాత్రం షార్ట్ లిస్ట్ వరకే పరిమితమయ్యాడు. బంగ్లాదేశ్ ప్రధాని కోచ్ పదవి కోసం పోటీ పడిన వారిలో పాకిస్తాన్ మాజీ కోచ్ మికీ ఆర్థర్ కూడా ఉన్నారు. తన పదవీ కాలాన్ని పీసీబీ పొడిగించకపోవడంతో బంగ్లాదేశ్ కోచ్ పదవి కోసం ఆర్థర్ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తమ జట్టుకు ఎవరైతే ఎక్కువ అందుబాటులో ఉంటారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న బీసీబీ.. దానికి డొమినిగో ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందింది. తనకు ఎటువంటి సెలవులు అవసరం లేదని, జట్టుతో పాటే ఉంటానని డొమినిగో తెలపడంతో అతని ఎంపికకే మొగ్గుచూపింది. ఈ విషయాన్ని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్లా హసన్ స్సష్టం చేశారు. పలు కోణాలు పరిశీలించిన తర్వాత డొమినిగో తొలి స్థానంలో నిలిచాడని నజ్ముల్లా తెలిపారు. ఆగస్టు 21వ తేదీ నుంచి బంగ్లాదేశ్ జట్టుతో డొమినిగో క్రికెట్ ప్రయాణం ఆరంభం కానుంది. -
అయ్యో బీసీసీఐ.. ఇలా అయితే ఎలా?
ముంబై: ‘కోచ్‌గా రవి భాయ్‌ను కొనసాగిస్తే సంతోషం’... వెస్టిండీస్ పర్యటనకు వెళ్తూవెళ్తూ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. వీటిని బట్టి చూసినా, వన్డే ప్రపంచ కప్‌తోనే గడువు ముగిశాక 45 రోజుల పొడిగింపు ఇవ్వడాన్ని బట్టి లెక్కగట్టినా వాస్తవానికి కాబోయే కోచ్ ఎవరో అప్పుడే స్పష్టమైపోయింది. కానీ, ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నట్లు చెప్పుకొనేందుకు బీసీసీఐ... టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఓ గడువు పెట్టి వాటిని వడపోసింది. మరీ విడ్డూరంగా కపిల్ స్థాయి వ్యక్తితో సలహా కమిటీని వేసింది. దాని నియామకంపై భిన్నాభిప్రాయాలతో పాటు మధ్యలో క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) జోక్యం సరేసరి. తీరా అంతా అయ్యాక చూస్తే రవిశాస్త్రికే అవకాశం ఇచ్చింది. ఇంతోటిదానికి హెసన్ రెండో స్థానంలో, మూడీ మూడో స్థానంలో నిలిచారని ప్రకటించి నవ్వు తెప్పించింది. ఇది వచ్చేది కాదు పోయేది కాదని అర్ధమై ఇంటర్వ్యూకు ముందు సిమన్స్ తప్పుకోగా రాబిన్‌సింగ్, రాజ్‌పుత్ హాజరు వేయించుకుని వెళ్లినట్లైంది.పైగా బోర్డు అధికారిక ప్రకటనలో హెసన్ పేరు కూడా తప్పుగా రాశారంటే దీనిని ఏమాత్రం సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతుంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘కోచ్ పదవి కోసం పోటీపడ్డ అభ్యర్థి పేరును కూడా సరిగా రాయకపోవడమే, ఎంపిక అనేది ఎంత పారదర్శంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చని ఒక అభిమాని విమర్శించగా, ‘కనీసం హెసన్ స్పెల్లింగ్‌ను గూగుల్‌లో వెతకాల్సింది’ అని మరొకరు చురకలంటిచారు. ఇలా సోషల్ మీడియాలో కోచ్ ఎంపికపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. మరొకవైపు భారత క్రికెట్లో కోహ్లి అంతకంత బలవంతుడయ్యాడని...! కెప్టెన్ మాటను జవదాటి పోలేని స్థితికి బోర్డు చేరిందనే విషయం అర్థమవుతోంది. (ఇక్కడ చదవండి: రవిశాస్త్రినే రైట్) -
కింగ్స్ పంజాబ్‌కు హెస్సన్ గుడ్ బై
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్లో కింగ్స్ పంజాబ్‌కు కోచ్‌గా వ్యవహరించిన మైక్ హెస్సన్ ఆ పదవికి గుడ్ బై చెప్పేశాడు. ఏడాదిలోపే తన కోచ్ పదవి నుంచి హెస్సెన్ తప్పుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో కింగ్స్ పంజాబ్ ప్రధాన కోచ్‌గా నియమించబడ్డ హెస్సన్ పది నెలలు పాటు మాత్రమే కింగ్స్ పంబాబ్ ఫ్రాంచైజీ కలిసి ఉన్నాడు. తాను కింగ్స్ పంజాబ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్న హెస్సన్ ట్విటర్లో పేర్కొన్నాడు. ‘ కింగ్స్ పంజాబ్‌తో కలిసి పని చేసినంత కాలం చాలా ఎంజాయ్ చేశాను. గత సీజన్లో నాకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినందుకు కింగ్స్ పంజాబ్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ ఏడాది కింగ్స్ పంజాబ్ నిరూత్సాహ పరచడం నిరాశకు గురి చేసింది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. మీరు సక్సెస్ అయ్యే సమయం ఎంతో దూరం లేదు’ అని హెస్సెన్ పేర్కొన్నాడు. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి మైక్ హెస్సెన్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. టామ్ మూడీ, గ్యారీ కిరెస్టన్‌లతో పాటు హెస్సెన్‌కు రేసులో ఉన్నాడు. అయితే పాకిస్తాన్ ప్రధాన కోచ్ పదవి నుంచి మికీ ఆర్థర్‌ను తప్పించడంతో ఆ జట్టు కొత్త కోచ్ అన్వేషణలో పడింది. దాంతో పాకిస్తాన్ ప్రధాన కోచ్ పదవికి సైతం హెస్సన్ దరఖాస్తు చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ టీమిండియా ప్రధాన కోచ్ పదవి రాకపోయినా, పాకిస్తాన్ క్రికెట్ కోచ్‌గానైనా ఎంపిక అవుతాననే నమ్మకంలో హెస్సెన్ ఉన్నాడు. ఆ క్రమంలోనే ముందుగా కింగ్స్ పంజాబ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. -
టీమిండియా కోచ్ రేసులో అతడు కూడా..
ముంబై : టీమిండియా ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ల పదవీకాలం ప్రపంచకప్‌తో ముగియడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. దీంతో ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే, సీనియర్ కోచ్‌లు టామ్ మూడీ, గ్యారీ కిరిస్టెన్‌లు ప్రదాన కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు అనధికారిక సమాచారం. అయితే ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి దరఖాస్తు చేయకుండానే నేరుగా ఇంటర్వ్యూకు వచ్చే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. దీంతో ఇప్పటివరకు ఈ నలుగురు కోచ్ రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం. అయితే మరో దిగ్గజ కోచ్ టీమిండియా ప్రధాన కోచ్‌పై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ కూడా భారత్ ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. రెండుమూడు రోజుల్లోనే ఆయన బీసీసీఐకి దరఖాస్తు పంపించే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరేళ్లుగా కివీస్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్‌కు సేవలందించాడు. దీంతో భారత్‌లోని పరిస్థితుల, ఆటగాళ్ల గురించి అవగాహన ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన కోచింగ్‌లోనే కివీస్ 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. దీంతో అనుభవం, ప్రతిభ దృష్ట్యా హెస్సన్ కూడా టీమిండియా కోచ్‌గా అన్ని విధాల అర్హుడు అంటూ క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో టీమిండియా ప్రధాన కోచ్ నియామక ప్రక్రియ బాధ్యతను చేపట్టిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) కోచ్‌గా ఎవరిని నియమిస్తుందా అని అందరిలోనూ అసక్తి రేకెత్తిస్తోంది. -
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్‌గా హెసన్
మొహాలి: వచ్చే ఏడాది ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొత్త కోచ్‌తో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు హెడ్ కోచ్‌గా ఉన్న బ్రాడ్ హాడ్జ్ (ఆస్ట్రేలియా)ను తప్పించి అతని స్థానంలో న్యూజిలాండ్ జట్టు మాజీ కోచ్ మైక్ హెసన్‌ను నియమించింది. ఈ మేరకు అతనితో రెండేళ్లపాటు ఒప్పందం చేసుకున్నామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సీఈఓ సతీశ్ మీనన్ తెలిపారు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టును ఫైనల్‌కు చేర్చిన హెసన్ ఈ ఏడాది జూన్‌లో తన పదవికి రాజీనామా చేశారు. -
ఏడాది ఉండగానే క్రికెట్ కోచ్ పదవికి గుడ్ బై..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి మైక్ హెస్సెన్ ఉన్నపళంగా తప్పుకున్నాడు. దాదాపు ఆరేళ్లుగా కివీస్ క్రికెట్‌కు సేవలందిస్తున్న హెస్సన్.. ఇంకా ఏడాదిపాటు కాంట్రాక్ట్ ఉండగానే కోచ్ పదవికి గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు కోచ్ పదవికి వీడ్కోలు చెబుతున్నట్లు హెస్సన్ గురువారం ప్రకటించాడు. కాగా, వచ్చే నెల చివరి వరకూ జట్టుతో కొనసాగుతానని స్పష్టం చేశాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే కోచ్ పదవి నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు హెస్సెన్ తెలిపాడు. ఆకస్మికంగా హెస్సెన్ తీసుకున్న నిర్ణయం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును కలవరపాటుకు గురిచేసింది. ఇంకా వన్డే వరల్డ్‌కప్‌కు ఏడాది మాత్రమే సమయం ఉన్న తరుణంలో హెస్సెన్ వైదొలగడం కివీస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. సుదీర్ఘ కాలంగా కివీస్ క్రికెట్ జట్టుతో పని చేస్తున్న హెస్సెన్ ఇలా షాకివ్వడం పట్ల న్యూజిలాండ్ క్రికెట్ పెద్దలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఇటీవల క్రికెట్ బోర్డులో పెద్దలతో చోటు చేసుకున్న విభేదాల కారణంగా హెస్సెన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. -
సఫారీతో హోరాహోరీ తప్పదు: కివీస్ కోచ్ హెస్సన్
ఆక్లాండ్: ప్రపంచంలో బెస్ట్ అనుకున్న నాలుగు జట్లే వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరుకున్నాయని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సన్ అన్నారు. ఇందులో చర్చించడానికి ఏమీ లేదన్నారు. వన్డేల్లో దిగ్గజ జట్ల సరసన చోటు సాధించే సత్తా తమకు ఉందన్నారు. ‘సెమీస్‌కు చేరిన నాలుగు జట్లు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉన్నాయి. దీన్ని కొంత మంది అంగీకరించకపోయినా ఫర్వాలేదు’ అని హెస్సన్ పేర్కొన్నారు. మరోవైపు విండీస్‌పై ఘనవిజయం సాధించిన కివీస్‌ను స్థానిక మీడియా ఆకాశానికెత్తేసింది. వచ్చే మంగళవారం దేశం మొత్తానికి హాలీడే అని ఓ రేడియో స్టేషన్ వ్యాఖ్యానించింది. తమ జట్టు సెమీస్‌కు చేరుకున్నందుకు విశేషంగా సంబరాలు చేసుకుంటున్న అభిమానులు ఫైనల్ వరకు ఇదే జైత్రయాత్రను కొనసాగాలని కోరుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో సెమీస్ గురించి కోచ్ మాట్లాడుతూ... ‘తనదైన రోజున సఫారీలు అద్భుతంగా ఆడతారు. అయితే వాళ్లను ఒత్తిడిలో ఉంచాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. రెండు జట్లూ మంచి క్రికెట్ ఆడుతున్నాయి. కాబట్టి హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. ప్రస్తుతం కివీస్ మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లో గప్టిల్ ఇన్నింగ్స్ అద్భుతమైనది. అతను ఆడిన తీరు అమోఘం. టైమింగ్, షాట్ల ఎంపిక, పరిస్థితులను అన్వయించుకోవడం సూపర్బ్. బౌల్ట్ కూడా చక్కగా బౌలింగ్ వేశాడు. ఇక వెటోరి క్యాచ్‌ను వర్ణించలేం. 36 ఏళ్ల వయసులో అతను అంతపైకి ఎగురుతాడని ఊహించలేదు’ అని హెస్సన్ వివరించారు.