కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ హెడ్‌ కోచ్‌గా హెసన్‌  | Mike Hesson appointed Kings XI Punjab coach | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ హెడ్‌ కోచ్‌గా హెసన్‌ 

Published Tue, Oct 30 2018 12:56 AM | Last Updated on Tue, Oct 30 2018 12:56 AM

 Mike Hesson appointed Kings XI Punjab coach - Sakshi

మొహాలి: వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కొత్త కోచ్‌తో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు హెడ్‌ కోచ్‌గా ఉన్న బ్రాడ్‌ హాడ్జ్‌ (ఆస్ట్రేలియా)ను తప్పించి అతని స్థానంలో న్యూజిలాండ్‌ జట్టు మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ను నియమించింది.

ఈ మేరకు అతనితో రెండేళ్లపాటు ఒప్పందం చేసుకున్నామని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సీఈఓ సతీశ్‌ మీనన్‌ తెలిపారు. 2015 వన్డే వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌ జట్టును ఫైనల్‌కు చేర్చిన హెసన్‌ ఈ ఏడాది జూన్‌లో తన పదవికి రాజీనామా చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement