![Mike Hesson Takes Over As RCB Head Coach After Simon Katich Steps Down - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/22/Mike-Hesson.gif.webp?itok=wm7koTZC)
దుబాయ్: ఐపీఎల్-14వ సీజన్ రెండో అంచె పోటీల ప్రారంభానికి ముందు ఆర్‌సీబీ కీలక మార్పులు చేస్తుంది. శనివారం జట్టులోకి ముగ్గురు కొత్త ఆటగాళ్లను తీసుకున్న ఆర్‌సీబీ కోచ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. దాంతో టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెసన్ ఈ సారి హెడ్‌కోచ్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తాడు.
ఇక ఆర్‌సీబీ తన జట్టులో మూడు మార్పులు చేసింది. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్‌కు చెందిన బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ కూడా ఆర్‌సీబీ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. సింగపూర్‌కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సీజన్‌లో ఆర్‌సీబీ మంచి ప్రదర్శనే కనబరిచింది. 7 మ్యాచ్‌లాడిన ఆర్‌సీబీ ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment