Simon Katich
-
మాజీలు సైమన్ కటిచ్, హషీమ్ ఆమ్లాలకు కీలక పదవులు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్‌ను కీలక పదవి వరించింది. సౌతాఫ్రికా టి20 లీగ్‌లో భాగంగా ముంబై కేప్‌టౌన్‌ను.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబై కేప్‌టౌన్‌కు కొత్త కోచ్‌లను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆసీస్ మాజీ ఆటగాడు సైమన్ కటిచ్ ముంబై కేప్‌టౌన్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లాను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఇక ఫీల్డింగ్ కోచ్‌గా జేమ్స్ పామెంట్‌ను.. అలాగే జట్టు జనరల్ మేనేజర్‌గా రాబిన్ పీటర్సన్‌ను ఎంపిక చేస్తూ ముంబై కేప్‌టౌన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. కాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం సైమన్ కటిచ్‌కు ట్విటర్ వేదికగా వెల్కమ్ చెప్పింది. ''సైమన్ కటిచ్ ముంబై కేప్‌టౌన్ కోచ్‌గా ఎంపికవ్వడం మాకు ఎంతో ఉత్సాహానిస్తుంది. ముంబై కేప్‌టౌన్ హెడ్‌కోచ్‌గా మీకు మా ఫ్యామిలీలోకి స్వాగతం'' అంటూ పేర్కొంది. ఇక సైమన్ కటిచ్ స్పందింస్తూ.. ''ముంబై కేప్‌టౌన్‌కు ప్రధాన కోచ్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకముంచి ఒక కొత్త జట్టుకు కోచ్‌గా పనిచేయాలని బాధ్యత అప్పగించారు. జట్టులో ఆటగాళ్ల నైపుణ్యతను, సమతుల్యతను పెంచేలా పనిచేస్తాను. లోకల్ ఆటగాళ్ల నైపుణ్యతను బయటికి తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు'' అంటూ తెలిపాడు. ఇక జనవరిలో జరగనున్న ఆరంభ ఎడిషన్‌కు అంతా సిద్ధమవుతుంది. ఎంఐ కేప్‌టౌన్ వెల్లడించిన ఫస్ట్ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కగిసో రబడ, డెవాల్డ్ బ్రెవిస్(అన్క్యాప్డ్)తో పాటు ఫారిన్ ప్లేయర్లు రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), సామ్ కరన్(ఇంగ్లండ్), లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్) ఉన్నారు. కాగా ఈ టీ20 లీగ్ వేలానికి ముందే నిబంధనల ప్రకారం ఐదుగురు ఆటగాళ్లతో ఎంఐ కేప్‌టౌన్ ఒప్పందం చేసుకుంది. WELCOME, COACH KATICH! 🙌 We are eXXcited to announce that Simon Katich has joined the #OneFamily and will be the Head Coach of MI Cape Town! 💙 Read more here: https://t.co/36VSv8n7F0 #OneFamily #MICapeTown #SA20 @SA20_League pic.twitter.com/BFBigOjVvv — MI Cape Town (@MICapeTown) September 15, 2022 చదవండి: లియాండర్ పేస్ గురువు కన్నుమూత ప్రారంభానికి ముందే టి20 ప్రపంచకప్ 2022 కొత్త చరిత్ర -
సన్‌రైజర్స్‌కు కొత్త కోచ్ వచ్చేశాడు.. ఎవరీ హెల్మోట్!
ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బాధ్యతలనుంచి సైమన్ కటిచ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కటిచ్ స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ హెల్మోట్ను ఆ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా సన్ రైజర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. సైమన్ హెల్మోట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక అయినట్లు సమాచారం. కాగా 2012 నుంచి 2019 వరకు సన్‌రైజర్స్ కోచింగ్ స్టాప్‌లో సైమన్ హెల్మోట్ బాగమై ఉన్నాడు. అదే విధంగా బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు కోచ్‌గా కూడా హెల్మోట్ పనిచేశాడు. ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీతో కలిసి హెల్మోట్ పని చేయనున్నాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ జట్టుకు హెడ్‌కోచ్‌గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్, ఫీల్డింగ్ కోచ్, స్కౌట్‌గా హేమంగ్ బదాని వ్యవహరించనున్నారు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే సైమన్ కటిచ్ రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఇక భారత జట్టులోకి కష్టమే.. తీరు మారని పుజారా! -
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలో కలకలం..సైమన్ కటిచ్ రాజీనామా!?
-
IPL 2022- SRH: మొన్ననే సంతోషంగా ఉందన్నాడు.. ఇంతలోనే ఏమైందో!
IPL 2022 SRH- Simon Katich:- సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-2021 సీజన్లో దారుణ ప్రదర్శన... 2016లో జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు ఉద్వాసన.. తుది జట్టులో కూడా చోటు కల్పించలేదు... మెగా వేలం నేపథ్యంలో వార్నర్ సహా స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకోలేదు.. ఇక కోచ్‌ల విషయానికొస్తే... అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరున్న ట్రెవర్ బేలిస్... అసిస్టెంట్ కోచ్ పనిచేసిన బ్రాడ్ హాడిన్ సైతం గత సీజన్లో తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. పేలవ ప్రదర్శనకు తోడు వార్నర్, రషీద్ లాంటి స్టార్ ప్లేయర్లను వదులుకున్న క్రమంలో ఐపీఎల్-2022 సీజన్ నేపథ్యంలో సన్‌రైజర్స్ కొత్త సిబ్బందితో ముందుకు వచ్చింది. టామ్ మూడీ తిరిగి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు హెడ్ కోచ్‌గా పనిచేసిన సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ఇక విండీస్ దిగ్గజం బ్రియన్ లారా, డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, హేమంగ్ బదానీని తమ సిబ్బందిలో చేర్చుకుంది. అయితే, ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా రచించిన ప్రణాళికలను అమలు చేయకుండా భిన్నంగా వ్యవహరించారంటూ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ రాజీనామా చేశారన్న వార్త సంచలనంగా మారింది. సన్‌రైజర్స్ యాజమాన్యం తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలతో ఆయన పదవి నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. వేలం నేపథ్యంలో సన్‌రైజర్స్ విడుదల చేసిన సైమన్ కటిచ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కటిచ్.. దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఎయిడెన్ మార్కరమ్, మార్కో జాన్సెన్ను ఎంపిక చేయడం వెనుక కారణాలు వివరించాడు. ‘‘గత సీజన్లో పంజాబ్‌కు ఆడిన ఎయిడెన్ మార్కరమ్.. రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. అందుకే అతడిని తీసుకున్నాం. తను మంచి ఆల్‌రౌండ్ ఆప్షన్. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అదే విధంగా మార్కో జాన్సెన్.. గతంలో ముంబైకి ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన ప్రదర్శన బాగుంది. వీళ్లిద్దరినీ జట్టులోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఇలా ఫ్రాంఛైజీని వీడుతున్నట్లు వార్తలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో... ‘‘కొత్త తెలుగు ఆటగాడు కూడా లేడు. పైగా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా నామ్ కే వాస్తే అన్నట్లుగానే ఆడేవాళ్లు... అసలు ఓపెనింగ్ జోడీ ఎలా సెట్ చేస్తారో తెలియదు. బహుశా కావ్య సెలక్షన్ నచ్చలేదేమో! అందుకే కటిచ్ రాజీనామా చేసి ఉంటాడు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన సైమన్ కటిచ్ దేశం తరఫున 56 టెస్టులు, 45 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. It's time for South Africa. 🇿🇦 Listen to Simon Katich speak about what Aiden Markram and Marco Jansen bring to the table. 🗣️#OrangeArmy #ReadyToRise #IPLAuction pic.twitter.com/Ob6pEjVvx4 — SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022 ఎస్ఆర్హెచ్- మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) -
IPL 2022- SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్... కోచ్ రాజీనామా!
IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. బెంగళూరు వేదికగా సాగిన ఐపీఎల్ మెగా వేలం-2022లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ది ఆస్ట్రేలియన్ కథనం వెలువరించింది. కాగా గత సీజన్లో సన్‌రైజర్స్ దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 14 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం మూడింట మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తొలగించడం సహా తుది జట్టులో కూడా చోటుకల్పించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ ఆరంభానికి ముందు కొత్త సిబ్బందిని నియమించింది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఎంచుకుంది. హెడ్‌కోచ్‌గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్, ఫీల్డింగ్ కోచ్, స్కౌట్‌గా హేమంగ్ బదాని వ్యవహరించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ తీరుపై కూడా అభిమానులు పెదవి విరుస్తున్న క్రమంలో కటిచ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. చదవండి: IPL 2022: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..! IPL 2022: కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ.. -
ఆర్సీబీ కీలక నిర్ణయం.. ప్రధాన కోచ్‌గా మైక్ హెసన్
దుబాయ్: ఐపీఎల్-14వ సీజన్ రెండో అంచె పోటీల ప్రారంభానికి ముందు ఆర్సీబీ కీలక మార్పులు చేస్తుంది. శనివారం జట్టులోకి ముగ్గురు కొత్త ఆటగాళ్లను తీసుకున్న ఆర్సీబీ కోచ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. దాంతో టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెసన్ ఈ సారి హెడ్‌కోచ్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక ఆర్సీబీ తన జట్టులో మూడు మార్పులు చేసింది. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్‌కు చెందిన బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ కూడా ఆర్సీబీ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. సింగపూర్‌కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శనే కనబరిచింది. 7 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. చదవండి: MS Dhoni: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్! -
ఆ ఇద్దరికి కోచ్ అవసరం లేదు
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్‌ను ఆర్సీబీ ఘనంగానే ఆరంభించింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని భావిస్తున్న ఆర్సీబీ అంతే కసిగా ఆడుతుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి మినహా మిగతా అన్నింటిని గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న నేపథ్యంలో ఆర్సీబీ హెడ్‌కోచ్ సైమన్ కటిచ్ స్పోర్ట్స్కీడ్స్కు ఇంటర్య్వూ ఇచ్చాడు. విరాట్ కోహ్లి, డివిలియర్స్‌తో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపించిందని కటిచ్‌ను అడగ్గా.. అతను ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ''కోహ్లి, డివిలియర్స్‌లకు కోచ్ అవసరం ఉండదు. వారికి సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఇవ్వరు.. ఎందుకంటే ఇప్పటికే గొప్ప క్రికెటర్లలో లిస్టులో స్థానం సంపాధించారు. వారిద్దరు చాలా క్రికెట్ ఆడేశారు.వారి అనుభవమే వారికి ఆటను నేర్పుతుంది.. అదే వారికి సలహాలను ఇస్తుంది. ఇక ఆటగాడు బ్యాటింగ్ విషయంలో తప్పు చేస్తున్నాడంటే కోచ్ ఏదైనా సలహాలు ఇవ్వగలడు. కానీ వారు బ్యాటింగ్‌లో లెజెండ్స్.. వారికి నా సలహాలు ఇవ్వలేను.. ఒక్కమాటలో చెప్పాలంటే వారిద్దరికి కోచ్ అవసరం లేదు. Courtesy : IPL Twitter ఇక ఫిట్నెస్ విషయంలో కోహ్లికున్న కచ్చితత్వం బహుశా వేరే వాళ్లకు ఉండదేమో. ఏ టైంలో ఏ ఆహారం తీసుకోవాలి.. ఫిట్నెస్ మెరుగుపరుచుకోవాలంటే ఏం కసరత్తులు చేయాలి.. ఒత్తిడి నుంచి బయటకు వచ్చేందుకు ఏం ఫాలో కావాలి అన్న విషయాల్లో కోహ్లి ది బెస్ట్ అని నేను చెబుతా. ముఖ్యంగా కోహ్లిలో ఉన్న నాయకత్వ లక్షణాలు నన్ను బాగా ఆకట్టుకుంటాయి. గత కొన్నేళ్లుగా అతను ఆర్సీబీకీ నాయకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడు టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న విఫమవుతూ వస్తుంది. కోహ్లి నాయకత్వంపై నాకు నమ్మకముంది.. ఈసారి మాత్రం ఆర్సీబీదే టైటిల్.. అంటూ ముగించాడు. చదవండి: ఎన్నిరోజులైందో ఇలా కలిసి మాట్లాడుకొని.. IPL 2021: ఆర్సీబీకి భారీ షాక్.. వారిద్దరూ ఔట్! -
స్మిత్ ప్లాన్ మిస్ ఫైర్; అతను గ్రేట్
దుబాయ్: రాజస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన అనంతరం బెంగుళూరు జట్టు కోచ్ సైమన్ కటిచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం రాజస్తాన్‌నే వరించాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వరకు విజయవకాశాలన్నీ రాజస్తాన్ వైపే ఉన్నాయని పేర్కొన్నాడు. 12 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో ఏబీ డివిలియర్స్ రెచ్చిపోయి ఆడటంతో తమ జట్టు గెలుపు ముంగిట నిలిచిందని చెప్పాడు. ‘28 పరుగులు చేసేందుకు 16 బంతులెదుర్కొన్న ఏబీడీ మరో 6 బంతుల్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. జయదేవ్ ఉనాద్కత్ వేసిన 19 ఓవర్లో వరసగా తొలి మూడు బంతులను ఏబీడీ మిడ్ వికెట్, లాంగాన్, స్క్వేర్ లెగ్‌లో సిక్సర్లుగా మలిచగా.. ఐదో బంతికి గురుకీరత్ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో అత్యధికంగా 25 పరుగులు వచ్చాయి. (చదవండి: హ్యాపీ మూమెంట్స్ ఫ్రమ్ మై ఫస్ట్ మ్యాచ్: ధనశ్రీ) అప్పటివరకు లెగ్‌సైడ్ బంతులతో తక్కువ పరుగులే ఇచ్చిన ఉనాద్కత్ని రంగంలోకి దించి ఫలితం రాబడుదామనుకున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 10 పరుగులే అవసరమవడంతో ఏబీడీ పని సులువైంది. చివరి ఓవర్ నాలుగో బంతికి మరో సిక్సర్ కొట్టిన డివిలియర్స్ ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించాడు. ఏబీడీ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్’ అని కటిచ్ ప్రశంసలు కురిపించాడు. ఇక కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జోఫ్రా 19 వ ఓవర్ వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. ‘అంతకు ముందు చక్కగా బౌలింగ్ చేసిన ఉనాద్కత్ ఆ ఓవర్ కూడా కాపాడుతాడని అనుకున్నా. అయితే, క్రీజులో ఉన్నది మోస్ట్ పవర్ఫుల్ ఏబీడీ. అందుకే ఆ ఓవర్ మా అవకాశాలను మార్చేసింది. అతనిలాగా మరే ఆటగాడు బంతిని స్టేడియం అన్ని వైపులా పరుగులెత్తించలేడు. అంత ఒత్తిడిలోనూ మెరుగైన బ్యాటింగ్‌తో ఏబీడీ మ్యాచ్‌ని మానుంచి లాగేసుకున్నాడు’అని స్మిత్ పేర్కొన్నాడు. కాగా, శనివారం రాత్రి రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు 7 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏబీ డివిలియర్స్ (22 బంతుల్లో 55 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు)కి దక్కింది. (చదవండి: బాల్ కోసం వెయిట్ చేస్తూ ప్రాణాలతో చెలగాటం) -
‘ఈ ఏడాది వరల్డ్‌కప్ కష్టమే’
మెల్బోర్న్: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌పై కూడా ఆశలు వదులుకోవాల్సిందేనని ఆసీస్ మాజీ క్రికెటర్, ఆర్సీబీ హెడ్ కోచ్ సైమన్ కాటిచ్ అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో ముందుస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్‌లో ఆరంభం కావాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్ జరిగే అవకాశాలు దాదాపు లేవన్నాడు. 2021 ఫిబ్రవరిలో మహిళల టీ20 వరల్డ్‌కప్ జరగనుందని, పురుషుల టీ20 వరల్డ్‌కప్ కూడా అప్పుడు నిర్వహించడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్నాడు. (అది చాలా వింతగా ఉంటుంది: అలెక్స్ క్యారీ) ఇప్పటివరకూ టీ20 వరల్డ్‌కప్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా.. లేదా అనే దానిపై ఐసీసీ స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ, వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ముందుగానే సన్నద్ధం అయితే మంచిదన్నాడు. ఫ్యూచర్ టోర్నమెంట్స్ ప్రొగ్రామ్స్(ఎఫ్టీపీ) గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి వింటుంటే అది ఎంతవరకూ సాధ్యపడుతుందనే అనుమానం వస్తుందన్నాడు. ఇందుకు కరోనా వైరస్ ప్రభావం క్రమేపీ పెరగడమే భవిష్య క్రికెట్ టోర్నమెంట్లపై అనేక సందేహాలకు తావిస్తుందన్నాడు. ఇదిలా ఉంచితే, టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను మార్చాలనే ఇప్పటివరకూ ఎవరూ డిమాండ్ తేలేదని విషయాన్ని ఐసీసీ ధృవీకరించింది. ఐసీసీ నిర్వహించే బోర్డు మీటింగ్‌ల్లో ఈ ప్రస్తావన రాలేదు. వరల్డ్‌కప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నందునే ఎవరూ కూడా పెదవి విప్పడం లేదు. ఇక టోర్నీకి ఆతిథ్యమిచ్చే ఆస్ట్రేలియా కూడా ఇప్పట్నుంచే షెడ్యూల్ గురించి మాట్లాడటం అనవరసం అనే ధోరణిలో ఉంది. మార్చి 27వ తేదీన టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ నిర్వహించిన సమావేశంలో కరోనా మహమ్మారిపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ఈవెంట్లపై కరోనా తీవ్రతపై మాట్లాడారు. కానీ టీ20 వరల్డ్‌కప్ వాయిదా వేయలానే డిమాండ్ మాత్రం వినిపించలేదు. (అప్పటివరకూ ఐపీఎల్ వాయిదా..!) -
మైక్ హెసన్‌కు కీలక పదవి
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీల్లో ఒకటైన కింగ్స్ పంజాబ్ ప్రధాన కోచ్ పదవికి ఇటీవల గుడ్ బై చెప్పిన మైక్ హెసన్.. ఇక నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి సేవలందించనున్నాడు. వచ్చే ఐపీఎల్‌కు సంబంధించి ముందుగానే ప్రక్షాళన చేపట్టిన ఆర్సీబీ.. మైక్ హెసన్‌ను డైరక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా ఎంపిక చేసింది. టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం పోటీపడ్డ హెసన్‌కు నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. మరోసారి రవిశాస్త్రినే కోచ్‌గా కొనసాగించేందుకు మొగ్గుచూపడంతో హెసన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరొకవైపు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసినా అక్కడ కూడా హెసన్‌కు చుక్కెదురైంది. కాగా, ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఆర్సీబీ.. హెసన్‌పై భారీ ఆశలు పెట్టుకుని తమ క్రికెట్ ఆపరేషన్స్ డైరక్టర్‌గా నియమించింది. అదే సమయంలో ఆర్సీబీ ప్రధాన కోచ్‌గా ఆసీస్‌కు చెందిన సైమన్ కాటిచ్‌ను ఎంపిక చేసింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన కాటిచ్‌ను ఆర్సీబీ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. టీ20 ఫార్మాట్లో అనేక జట్లతో పని చేసిన అనుభవం ఉన్న కాటిచ్‌కే పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్ స్థానంలో కాటిచ్‌ను ఎంపిక చేస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. -
‘మా కేకేఆర్ క్యాంప్‌లో సఖ్యత లేదు’
ముంబై: తాజా ఐపీఎల్ సీజన్లో తమ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరకపోవడానికి విభేదాలు కూడా ఒక కారణమని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) అసిస్టెంట్ కోచ్ సైమన్ కాటిచ్ స్సష్టం చేశాడు. కేకేఆర్ శిబిరంలో ఆటగాళ్ల మధ్య అంతగా సఖ్యత లేకపోవడమే వరుస ఓటములకు కారణమన్నాడు. నిన్న ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కాటిచ్..‘ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి చెందడం మా ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసింది. ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పాలి. మా జట్టులో విభేదాలు ఉన్న మాట వాస్తవమే. దీన్ని దాయాలన్నా దాగదు. ఐపీఎల్ వంటి మెగా లీగ్‌కు సిద్ధమయ్యేటప్పుడు జట్టులో సమైక్యత అనేది చాలా ముఖ్యం. కేకేఆర్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా జట్టు విజయాలు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సీజన్లో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆటగాళ్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇది మంచిది కాదు’ అని కాటిచ్ పేర్కొన్నాడు. ఇటీవల కేకేఆర్ స్టార్ ఆటగాడు ఆండ్రీ రసెల్ బహిరంగంగానే ఆ జట్టు నాయకత్వాన్ని ప్రశ్నించాడు. జట్టులో ఎవర్ని ఎలా ఉపయోగించుకోవాలో తమ కెప్టెన్ దినేశ్ కార్తీక్ తెలియడం లేదంటూ చురకలు అంటించాడు. దాంతో కేకేఆర్ క్యాంపులో విభేదాలు ఉన్న విషయం బయటపడింది. (ఇక్కడ చదవండి: దినేశ్ కార్తీక్ ఆగ్రహం.. జట్టు సభ్యులకు వార్నింగ్!) -
‘వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్ ఆడతాడు’
సిడ్నీ: టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ వరల్డ్‌కప్‌కు ఎంపికవుతాడని కోల్‌కతా నైట్‌రైడర్స్ సహాయ కోచ్ సైమన్ కటిచ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న దినేశ్ కార్తీక్ ఒక మంచి ఫినిషర్‌గా పేరుతెచ్చుకోవడం అతనికి కలిసి వస్తుందన్నాడు. అతనికి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. ఇటీవల కాలంలో భారత జట్టు తరఫున అతడు మ్యాచ్‌లు ముగించిన తీరు అతన్ని వరల్డ్‌కప్ రేసులో నిలుపుతుందన్నాడు. ‘దినేశ్ అనుభవం ఉపయోగపడుతుంది. అతడు ప్రపంచకప్ జట్టులో ఉంటాడు. ప్రతిభావంతులు చాలా మంది ఉండటంతో భారత సెలక్టర్లకు జట్టును ఎంపిక చేయడం కష్టమవుతుంది. దినేశ్ ఒక మంచి ఫినిషర్. దాంతో అతని ఎంపిక దాదాపు ఖాయమే’ అని కటిచ్ పేర్కొన్నాడు. -
అవకాశం ఇచ్చిన వారిద్దరికీ థ్యాంక్స్
బెంగళూరు: చాలా రోజుల తర్వాత విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్.. టీమ్ హెడ్ కోచ్ జాక్వెస్ కలిస్, అసిస్టెంట్ కోచ్ సిమోన్ కటిచ్లకు ధన్యవాదాలు చెబుతున్నాడు. తనపై విశ్వాసం ఉంచి, మధ్య ఓవర్లలో ఆడే అవకాశం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించడంలో యూసుఫ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. యూసుఫ్ 29 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలవడంతో కోల్‌కతా మరో ఐదు బంతులు మిగిలుండగా ఐదు వికెట్లతో గెలుపొందింది. ఈ విజయం గురించి యూసుఫ్ మాట్లాడుతూ.. 'ఇన్నింగ్స్‌లో మరో రెండు లేదా మూడు ఓవర్లు మిగిలివున్నపుడు వెళ్లి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ప్రతి బంతికి భారీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. నిలకడగా ఆడే పరిస్థితి ఉండదు. బెంగళూరుతో మ్యాచ్‌లో ఇంకా పది ఓవర్లు ఉన్నప్పుడు నన్ను బ్యాటింగ్‌కు పంపారు. నాపై నమ్మకం ఉంచి, అవకాశం ఇచ్చిన కలిస్, కటిచ్లకు కృతజ్ఞతలు' అని చెప్పాడు. కోల్‌కతా కెప్టెన్ గంభీర్ గురించి మాట్లాడుతూ.. అతను మంచి కెప్టెన్ అంటూ కితాబిచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గంభీర్ ఆటగాళ్లకు అండగా ఉంటూ, ప్రోత్సహిస్తాడని చెప్పాడు.