ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బాధ్యతలనుంచి సైమన్ కటిచ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కటిచ్ స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ హెల్మోట్‌ను ఆ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా సన్ రైజర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. సైమన్ హెల్మోట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక అయినట్లు సమాచారం. కాగా 2012 నుంచి 2019 వరకు సన్‌రైజర్స్ కోచింగ్ స్టాప్‌లో సైమన్ హెల్మోట్ బాగమై ఉన్నాడు. అదే విధంగా బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు కోచ్‌గా కూడా హెల్మోట్ పనిచేశాడు.
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీతో కలిసి హెల్మోట్ పని చేయనున్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టుకు హెడ్‌కోచ్‌గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్, ఫీల్డింగ్ కోచ్, స్కౌట్‌గా హేమంగ్ బదాని వ్యవహరించనున్నారు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే సైమన్ కటిచ్ రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment