
సిడ్నీ: టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ వరల్డ్‌కప్‌కు ఎంపికవుతాడని కోల్‌కతా నైట్‌రైడర్స్ సహాయ కోచ్ సైమన్ కటిచ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న దినేశ్ కార్తీక్ ఒక మంచి ఫినిషర్‌గా పేరుతెచ్చుకోవడం అతనికి కలిసి వస్తుందన్నాడు. అతనికి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. ఇటీవల కాలంలో భారత జట్టు తరఫున అతడు మ్యాచ్‌లు ముగించిన తీరు అతన్ని వరల్డ్‌కప్ రేసులో నిలుపుతుందన్నాడు.
‘దినేశ్ అనుభవం ఉపయోగపడుతుంది. అతడు ప్రపంచకప్ జట్టులో ఉంటాడు. ప్రతిభావంతులు చాలా మంది ఉండటంతో భారత సెలక్టర్లకు జట్టును ఎంపిక చేయడం కష్టమవుతుంది. దినేశ్ ఒక మంచి ఫినిషర్. దాంతో అతని ఎంపిక దాదాపు ఖాయమే’ అని కటిచ్ పేర్కొన్నాడు.