బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేస్‌ర్ మహ్మద్ సిరాజ్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. తొలి సెషన్‌లో సిరాజ్ కాస్త పర్వాలేదన్పించినప్పటికి.. రెండో సెషన్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.
ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్మిత్‌లు సిరాజ్‌ను ఓ ఆట ఆడేసికుంటున్నారు. ఇప్పటివరకు 18.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 69 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన బౌలింగ్ రిథమ్‌ను కోల్పోయినట్లు కన్పిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో సిరాజ్‌పై ఆసీస్ మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ విమర్శలు గుప్పించాడు. సిరాజ్ తన బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యాడని కటిచ్ మండిపడ్డాడు. కాగా ఆసీస్ ఇన్నింగ్స్ 60 ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతిని షార్ట్ డెలివరీగా సంధించాడు.
అయితే ఆ బంతిని హెడ్ ర్యాంప్ షాట్ ఆడి థర్డ్‌మ్యాన్ దిశగా బౌండరీగా మలిచాడు. అయితే ఆ ఓవర్ ముందువరకు థర్డ్-మ్యాన్‌లో ఫీల్డర్ ఉండేవాడు. కానీ సిరాజ్ సూచన మెరకు తన ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ థర్డ్‌మ్యాన్ ఫీల్డర్‌ను తొలిగించాడు. ఈ క్రమంలో సిరాజ్ నిర్ణయాన్ని కటిచ్ తప్పు బట్టాడు.
"మహ్మద్ సిరాజ్ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆ ఓవర్‌కు ముందు థర్డ్-మ్యాన్ స్ధానంలో ఓ ఫీల్డర్ ఉన్నాడు. సిరాజ్ బౌలింగ్ వేసేందుకు వచ్చినప్పుడు థర్డ్-మ్యాన్‌లో ఫీల్డర్‌ను తొలిగించమని సూచించాడు. ఇది నిజంగా తెలివితక్కువ నిర్ణయం.
థర్డ్ మ్యాన్‌లో ఫీల్డర్ లేనిప్పుడు షార్డ్ డెలివరీని ఎందుకు వేయాలి. సిరాజ్ సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయలేదు. హెడ్‌కు వ్యతిరేకంగా లెగ్ సైడ్‌లో ఇద్దరు ఫీల్డర్లను, డీప్ పాయింట్‌లో ఓ ఫీల్డర్‌ను ఉంచారు. కానీ థర్డ్‌మ్యాన్‌లో మాత్రం ఫీల్డర్‌ను తీసేశారు. హెడ్ ఆ షాట్ ఆడాక మళ్లీ తిరిగి థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డర్‌ను తీసుకొచ్చారు" అని గబ్బా టెస్టు కామెంటరీలో భాగంగా కటిచ్ పేర్కొన్నాడు.
రెండో రోజు ఆసీస్‌దే..
ఇక ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(45), మిచెల్ స్టార్క్(7) పరుగులతో ఉన్నారు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(152), స్మిత్(101) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో మెరిశాడు.
Comments
Please login to add a commentAdd a comment