ఆక్లాండ్: భారత్-న్యూజిలాండ్‌ల మధ్య రసవసత్తర పోరు ఖాయమని అంటున్నాడు రాయల్ చాలెంజర్స్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్. గతంలో న్యూజిలాండ్ క్రికెట్ కోచ్‌గా పనిచేసిన హెస్సన్.. భారత్‌తో పోరు హోరాహోరీగా సాగుతుందుని జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్‌ను వారి దేశంలో ఓడించడం అంత ఈజీ కాదని అంటున్నాడు. భారత్‌లో భారత్ ఎంత పటిష్టంగా ఉంటుందో న్యూజిలాండ్‌లో కివీస్ కూడా అదే బలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కాకపోతే ప్రస్తుతం కివీస్‌ను వారి దేశంలో ఓడించాలంటే టీమిండియానే ప్రధాన ప్రత్యర్థి అని అన్నాడు. కాగా, న్యూజిలాండ్ సీమర్లను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఆసక్తిగా ఉందన్నాడు. ఈ ద్వైపాక్షిక సిరీస్ కోహ్లికి అతి పెద్ద చాలెంజ్ అని హెస్సన్ అన్నాడు. వారి దేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ కచ్చితంగా కోహ్లి అండ్ గ్యాంగ్‌కు పరీక్షేనని అన్నాడు. (ఇక్కడ చదవండి: ఆరుగురు బౌలర్ల వ్యూహం.. శాంసన్, పంత్ డౌటే? )
పేసర్ల నుంచి కోహ్లికి ఎదురయ్యే తొలి 10 నుంచి 20 బంతులు అత్యంత క్లిష్టమని తెలిపిన హెస్సన్.. ఒకవేళ అతన్ని ఆదిలో ఔట్ చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నాడు. ఒకసారి కోహ్లి గాడిలో పడ్డాడంటే ఏ పిచ్‌లోనైనా చెలరేగిపోతాడని హెస్సన్ అభిప్రాయపడ్డాడు. మరొకవైపు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ల మధ్య పోరు కూడా బాగుంటుందన్నాడు. ప్రధానంగా వన్డేల్లో బౌల్ట్ వర్సెస్ రోహిత్ శర్మ అన్న చందంగా పోరు ఉంటుందని జోస్యం చెప్పాడు. (ఇక్కడ చదవండి: అతనొక స్మార్ట్ క్రికెటర్: విరాట్ కోహ్లి)
Comments
Please login to add a commentAdd a comment