న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్‌లో కింగ్స్ పంజాబ్‌కు కోచ్‌గా వ్యవహరించిన మైక్ హెస్సన్ ఆ పదవికి గుడ్ బై చెప్పేశాడు. ఏడాదిలోపే తన కోచ్ పదవి నుంచి హెస్సెన్ తప్పుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో కింగ్స్ పంజాబ్ ప్రధాన కోచ్‌గా నియమించబడ్డ హెస్సన్ పది నెలలు పాటు మాత్రమే కింగ్స్ పంబాబ్ ఫ్రాంచైజీ కలిసి ఉన్నాడు. తాను కింగ్స్ పంజాబ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్న హెస్సన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
‘ కింగ్స్ పంజాబ్‌తో కలిసి పని చేసినంత కాలం చాలా ఎంజాయ్ చేశాను. గత సీజన్‌లో నాకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినందుకు కింగ్స్ పంజాబ్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ ఏడాది కింగ్స్ పంజాబ్ నిరూత్సాహ పరచడం నిరాశకు గురి చేసింది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. మీరు సక్సెస్ అయ్యే సమయం ఎంతో దూరం లేదు’ అని హెస్సెన్ పేర్కొన్నాడు. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి మైక్ హెస్సెన్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. టామ్ మూడీ, గ్యారీ కిరెస్టన్‌లతో పాటు హెస్సెన్‌కు రేసులో ఉన్నాడు. అయితే పాకిస్తాన్ ప్రధాన కోచ్ పదవి నుంచి మికీ ఆర్థర్‌ను తప్పించడంతో ఆ జట్టు కొత్త కోచ్ అన్వేషణలో పడింది. దాంతో పాకిస్తాన్ ప్రధాన కోచ్ పదవికి సైతం హెస్సన్ దరఖాస్తు చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ టీమిండియా ప్రధాన కోచ్ పదవి రాకపోయినా, పాకిస్తాన్ క్రికెట్ కోచ్‌గానైనా ఎంపిక అవుతాననే నమ్మకంలో హెస్సెన్ ఉన్నాడు. ఆ క్రమంలోనే ముందుగా కింగ్స్ పంజాబ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment