పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. తాజాగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది.
కరాచీ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు షాన్ మసూద్(36) పరుగులతో రాణించాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలర్లలో ఉసమా మీర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ విల్లీ, మహ్మద్ అలీ, క్రిస్ జోర్డాన్, కుష్‌దుల్ షా తలా ఒక్క వికెట్ సాధించారు.
ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీ..
అంతకముందు బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ముల్తాన్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కరాచీ బౌలర్లను ఉస్మాన్ ఖాన్ ఊచకోత కోశాడు.
కేవలం 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ముల్తాన్ సుల్తాన్ ఖారారు చేసుకుంది.
USMAN KHAN, TAKE A BOW! 🙇
— PakistanSuperLeague (@thePSLt20) March 3, 2024
Second HBL PSL 💯 for the Sultans star 👏#HBLPSL9 | #KhulKeKhel | #KKvMS pic.twitter.com/DCP60FJwoD
Comments
Please login to add a commentAdd a comment