ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తమ తుదిజట్టును ప్రకటించింది. ముల్తాన్ మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లను ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు దూరమైన స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు షాహిన్ ఆఫ్రిది ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. అమీర్ జమాల్ సైతం పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ఆసీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఆమీర్
బంగ్లాదేశ్‌తో ఇటీవలి టెస్టులకు ఎంపికైనప్పటికీ ఆమీర్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అతడు ఫిట్‌గా ఉండటం సానుకూలాంశంగా మారనుంది. కాగా దాదాపు ఏడాది క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా ఆమీర్ జమాల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 28 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఆ సిరీస్‌లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఆ ముగ్గురూ అవుట్
అంతేకాదు.. సిడ్నీ టెస్టులో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి 82 పరుగులు కూడా సాధించాడు. ఇక పేస్ దళంలో షాహిన్, ఆమీర్‌తో పాటు నసీం షా కూడా చోటు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భాగమైన ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ, మీర్ హంజాలను ఈసారి యాజమాన్యం పక్కనపెట్టింది.
వారి విషయంలో ఎలాంటి మార్పులు లేవు
ఇక యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కూడా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తుదిజట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడిన టాప్-7 బ్యాటర్ల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సైతం ఇప్పటికే పాక్‌తో తొలి టెస్టుకు తమ తుదిజట్టును ప్రకటించిది. కెప్టెన్ బెన్ స్టోక్స్ తొడకండరాల నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కాగా పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య అక్టోబరు 7ను ముల్తాన్ వేదికగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. రెండో టెస్టుకు కూడా ముల్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఆఖరి మ్యాచ్ రావల్పిండిలో జరుగనుంది.
ఇక ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎనిమిది, ఇంగ్లండ్ నాలుగో స్థానాల్లో ఉన్నాయి. టాప్‌లో టీమిండియా కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా రెండు, శ్రీలంక మూడో స్థానంలో ఉన్నాయి.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లు
పాకిస్తాన్
సయీమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా, అమీర్ జమాల్, షాహిన్ షా అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్.
ఇంగ్లండ్
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్.
చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment