పాకిస్తాన్ సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో అక్టోబరు 7 నుంచి మూడు టెస్టులు ఆడనుంది. కాగా గత కొన్నాళ్లుగా టెస్టుల్లో పాకిస్తాన్‌కు విజయమన్నదే కరువైంది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ ఘోర పరాభవం పాలైంది.
షాన్ మసూద్ బృందంపై విమర్శలు
తొలిసారిగా బంగ్లా చేతిలో టెస్టులో ఓడటమే గాకుండా సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో షాన్ మసూద్ బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ సిరీస్‌తో పాక్ టెస్టు జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పికి కూడా చేదు అనుభవం ఎదురైంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ జట్టుతో పాటు గిల్లెస్పికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో అతడు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా.. సులువుగా పరుగులు రాబట్టడానికి వీలుగా ఉండే ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాక్ బ్యాటర్ల అభ్యర్థనను నిరభ్యంతరంగా కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.
అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండి
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘‘పాక్ టెస్టు జట్టు లోపల ఏం జరిగిందో చెప్తాను. ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాకిస్తాన్ ఆటగాళ్ల నోళ్లను అతడు మూయించేశాడు. గ్రౌండ్స్‌మెన్ తయారు చేసిన పిచ్‌ను అచ్చంగా అలాగే కొనసాగించాలని నిర్ణయించాడు.
ఎక్కువ కష్టపడకుండా సులువుగా పరుగులు రాబట్టాలనే వారి రిక్వెస్ట్‌ను కొట్టిపారేశాడు. పిచ్ క్యూరేటర్, గిల్లెస్పి ఆట రసవత్తరంగా సాగేలా పిచ్‌ను తయారు చేసేందుకే మొగ్గుచూపారు. గ్రాసీ పిచ్‌పై మ్యాచ్ జరిగి మా బౌలర్లు వికెట్లు తీస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు’’ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.
అప్పుడు 3-0తో చిత్తు
కాగా అక్టోబరు 7న పాకిస్తాన్ -ఇంగ్లంఢ్ మధ్య ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు మొదలుకానుంది. ఇరుజట్ల మధ్య 2022లో పాకిస్తాన్ వేదికగా జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. మరోసారి క్లీన్‌స్వీపే లక్ష్యంగా పాక్ గడ్డపై అడుగుపెట్టింది.
చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment