Shan Masood
-
విండీస్‌తో టెస్టులకు పాక్ జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటు
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను శనివారం వెల్లడించింది. ఇటీవల సౌతాఫ్రికాలో పర్యటించిన టెస్టు జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసి.. ట్విస్ట్ ఇచ్చింది. ఇమామ్-ఉల్- హక్(Imam-ul-Haq) రీఎంట్రీతో పాటు మరెన్నో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంది.అబ్దుల్లా షఫీక్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. ఇమామ్‌కు పిలుపునిచ్చారు. కాగా ఇమామ్ ఇటీవల దేశవాళీ క్రికెట్లో అదరగొట్టాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 635 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ సెంచరీలు(184, 160) ఉన్నాయి. దీంతో సూపర్ ఫామ్‌లో ఉన్న ఇమామ్ ఉల్ హక్కు సెలక్టర్లు పిలుపునివ్వడం గమనార్హం.విండీస్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరంఇదిలా ఉంటే.. మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్(Abrar Ahmed) కూడా తిరిగి రాగా.. షాహిన్ ఆఫ్రి(Shaheen Afridi)ది మాత్రం ఈ జట్టులో లేడు. పని భారాన్ని తగ్గించే క్రమంలో మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.అదే విధంగా.. నసీం షా, ఆమిర్ జమాల్, మీర్ హంజాలను కూడా సెలక్టర్లు రెస్ట్ పేరిట పక్కనపెట్టినట్లు సమాచారం. ఇక ఫామ్‌లో ఉన్న సయీమ్ ఆయుబ్ సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు విండీస్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటుఈ నేపథ్యంలో ఖుర్రం షాజాద్‌తో పాటు మహ్మద్ అలీ, అన్క్యాప్డ్ ప్లేయర్ కశిఫ్ అలీ పేస్‌దళ విభాగంలో చోటు దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో తమ చివరి సిరీస్‌లో పాకిస్తాన్ సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడుతోంది. ముల్తాన్ వేదికగా జనవరి 17-21 మధ్య తొలి టెస్టు, జనవరి 25-29 మధ్య రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అనంతరం న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో స్వదేశంలో పాకిస్తాన్ త్రైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే.. ప్రధాన పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షాలకు టెస్టు జట్టు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.సౌతాఫ్రికాలో పరాభవంఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సెంచూరియన్, కేప్‌టౌన్ టెస్టుల్లో ఓడి 2-0తో క్వీన్‌స్వీప్‌నకు గురైంది. అంతకు ముందు టీ20 సిరీస్‌ను ప్రొటిస్ జట్టుకు చేజార్చుకున్న పాక్.. వన్డే సిరీస్‌ను మాత్రం 3-0తో వైట్‌వాష్ చేసింది. తద్వారా సౌతాఫ్రికా జట్టును తమ సొంతగడ్డపై వన్డేల్లో ఈ మేర క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, కాశిఫ్ అలీ, ఖుర్రం షాజాద్, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్ బ్యాటర్), నొమన్ అలీ, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్ బ్యాటర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా.చదవండి: సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే! -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. 122 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. పాకిస్తాన్ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఛేదించింది.దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 194 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. ఫాలో ఆన్(రెండో ఇన్నింగ్స్)లో మాత్రం అద్బుతమైన పోరాటం కనబరిచింది.421 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన పాకిస్తాన్ 478 పరుగుల భారీ స్కోర్ సాధించింది. షాన్ మసూద్ (145) సెంచరీ చేయగా.. బాబర్ ఆజాం (81) హాఫ్ సెంచరీతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడంతో పాక్ జట్టు సఫారీల ముందు మెరుగైన టార్గెట్‌ను ఉంచలేకపోయింది.దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 615 పరుగులు చేసింది. ప్రోటీస్ తొలి ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ (259) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా (106), కైల్ వెర్రెన్న్ (100) శతకాలతో మెరిశారు. పాక్ బౌలర్లు అబ్బాస్, సల్మాన్ అఘా మూడేసి వికెట్లు పడగొట్టారు.చరిత్ర సృష్టించిన పాక్..కాగా ఫాలో ఆన్‌లో ధీటుగా ఆడిన పాకిస్తాన్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఫాల్ ఆన్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1902లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడి 372/7 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో 122 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియా (372/7) తర్వాత వెస్టిండీస్ (348/10), న్యూజిలాండ్ (342/10), శ్రీలంక (342/10) జట్లు ఉన్నాయి.చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లలోనైనా ఆడిస్తారా? -
ఘోర పరాభవాన్ని తప్పించుకున్న పాకిస్తాన్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఇన్నింగ్స్ పరాజయాన్ని అధిగమించింది. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలిన పాక్ ఫాలో ఆన్ ఆడుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయడంతో పాక్ లీడ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సౌతాఫ్రికా ముందు కనీసం 250 పరుగుల లక్ష్యాన్ని అయినా ఉంచాల్సి ఉంది. అయితే పరిస్థితులు అలా కనిపించడం లేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ చేతిలో మరో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 50 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కీలక బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరారు. నాలుగో రోజు ఆటలో మూడో సెషన్ కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే రేపు (ఐదో) తొలి సెషన్ వరకు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సౌతాఫ్రికా ముందు ఫైటింగ్ టార్గెట్‌ను ఉంచగలుగుతుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా అతి భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీ (259) చేసి సౌతాఫ్రికాను కమాండింగ్ పొజిషన్లో ఉంచాడు. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) కూడా సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 17, ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, బెడింగ్హమ్ 5, మఫాకా 0, రబాడ 6 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా తలో మూడు వికెట్లు తీయగా.. మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాన్ మసూద్ 2, కమ్రాన్ గులామ్ 12, సౌద్ షకీల్ 0, సల్మాన్ అఘా 19, ఆమెర్ జమాల్ 15, ఖుర్రమ్ షెహజాద్ 14, మీర్ హమ్జా 13, మొహమ్మద్ అబ్బాస్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో పాక్ 10 మంది ఆటగాళ్లతోనే బ్యాటింగ్‌ను కొనసాగించాల్సి వచ్చింది. యువ ఓపెనర్ సైమ్ అయూబ్ సౌతాఫ్రికా బ్యాటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. సైమ్ కాలు మడతపడటంతో ఉన్నపళంగా మైదానం నుంచి వైదొలిగాడు. అతను ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. అందుకే అతను బ్యాటింగ్‌కు దిగలేదు.ఫాలో ఆన్ ఆడుతన్న పాక్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 471 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 50 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ చేశాడు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (81) రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఖుర్రమ్ షెహజాద్ (18), కమ్రాన్ గులామ్ (28), సౌద్ షకీల్ (23) కొద్ది సేపు నిలదొక్కుకున్నట్లు కనిపించినా ఆతర్వాత పెవిలియన్ బాట పట్టారు. మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆమెర్ జమాల్ (34 నాటౌట్), మీర్ హమ్జా (16 నాటౌట్) పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, మార్కో జన్సెన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మఫాకా ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
సౌతాఫ్రికా టూర్‌కు పాక్ జట్టు ప్రకటన: బాబర్ రీ ఎంట్రీ! అతడికి నో ఛాన్స్
సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మూడు టీమ్‌లలోనూ చోటు దక్కించుకోగా.. టెస్టు జట్టులో ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిది పేరు మాత్రం లేదు.కాగా మూడు వన్డే, మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. డిసెంబరు 10న తొలి టీ20తో ఈ టూర్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పీసీబీ బుధవారం ఈ సిరీస్‌లకు సంబంధించి మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది.టెస్టులలో బాబర్ పునరాగమనం.. అతడికి మాత్రం చోటు లేదుటెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మూడు జట్లలో స్థానం సంపాదించాడు. కాగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై తొలి టెస్టులో విఫలమైన తర్వాత.. మిగిలిన రెండు టెస్టులు ఆడకుండా బాబర్‌పై వేటు పడింది. అతడితో పాటు షాహిన్నూ తప్పించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. యువ పేసర్ నసీం షా కేవలం టెస్టు, వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది టీ20, వన్డేలు మాత్రమే ఆడి.. టెస్టులకు దూరంగా ఉండనున్నాడు.తప్పించారా? రెస్ట్ ఇచ్చారా?వచ్చే ఏడాది సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షాహిన్‌కు పీసీబీ ఈ మేర పనిభారం తగ్గించి.. విశ్రాంతినివ్వాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల క్వైద్-ఇ-ఆజం ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 31 వికెట్లతో సత్తా చాటిన రైటార్మ్ సీమర్ మహ్మద్ అబ్బాస్ దాదాపు మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.తొలిసారి వన్డే జట్టుకు సూఫియాన్ ఎంపికఅదే విధంగా.. ఖుర్రం షెహజాద్, మీర్ హంజా కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. షాజిద్ ఖాన్ మాత్రం మిస్సయ్యాడు. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌గా నొమన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక లెగ్ స్పిన్నర్ సూఫియాన్ మోకీం తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య డిసెంబరు 10, 13, 14 తేదీల్లో టీ20... డిసెంబరు 17, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అదే విధంగా.. డిసెంబరు 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికాతో టెస్టులకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, నొమన్ అలీ, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.సౌతాఫ్రికాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సుఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).సౌతాఫ్రికాతో టీ20లకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సూఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్..
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో 11 మ్యాచ్‌ల తర్వాత పాక్ జట్టు తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా పాక్‌కు తమ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత దక్కిన తొలి విజయమిది. చివరగా పాక్ జట్టు తమ స్వదేశంలో 2021 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై టెస్టు విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ మ్యాచ్ ముందు వరకు ఒక్క టెస్టు విజయం కూడా పాక్ నమోదు చేయలేకపోయింది.తిప్పేసిన నమాన్..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పాక్ స్పిన్నర్ నోమన్ అలీ చుక్కలు చూపించాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకున్న పర్యాటక జట్టు కేవలం 144 పరుగులకే కుప్పకూలింది. నోమన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ సాజిద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఉంచింది. అయితే ఆ టార్గెట్‌ను చేధించడంలో ఇంగ్లీష్ జట్టు చతకిల పడింది.ఏడేసిన సాజిద్..ఈ మ్యాచ్‌లో మరో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(119) సెంచరీతో మెరిశాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అదే విధంగా పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసింది. కాగా సాజిద్, నోమన్ అలీ కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇక ఇరు జట్ల మూడో టెస్టు ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. -
ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. పాక్ కెప్టెన్‌పై వేటు?
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరుస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమి చవిచూసింది.తొలి ఇన్నింగ్స్‌లో 550కు పైగా పరుగులు చేసి ఆ మ్యాచ్‌లో ఓడిపోయిన మొదటి జట్టు పాకిస్తాన్ చెత్త రికార్డును మూటకట్టుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసిన పాక్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 220 పరుగులకే కుప్పకూలింది. అటు ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 823 పరుగుల భారీ స్కోర్ చేసింది.మసూద్‌పై వేటు..కాగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది.ఈ క్రమంలో కెప్టెన్ షాన్ మసూద్‌పై వేటు వేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత అతడిని తమ జట్టు పగ్గాలను తప్పించాలని పాక్ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు పాక్ వెళ్లనుంది.ఈ టూర్‌కు ముందు పాక్‌కు కొత్త టెస్టు కెప్టెన్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ ఆఘా సల్మాన్ లేదా వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకున్నాడు. ఇక ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
పాకిస్తాన్‌కు మరో షాక్.. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగులతో పాక్‌ను ఇంగ్లీష్ జట్టు చిత్తు చేసింది. 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. దీంతో మసూద్ సేన ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బ్రూక్, రూట్ విధ్వంసం..అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌ను ఇంగ్లీష్ జట్టు 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్, జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో మెరిశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 454 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్(151), సల్మాన్(104), షఫీక్(102) సెంచరీలతో చెలరేగారు. ఏదమైనప్పటకి పాక్ ఓటమి పాల్వడంతో వారి సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్ -
Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పూర్తిగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా అతడి ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. హై వే రోడ్డు మీద సైతం బ్యాటింగ్ చేయడం చేతకాదంటూ సోషల్ మీడియాలో రిజ్వాన్ బ్యాటింగ్‌పై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.ఓపెనర్ల సెంచరీలుకాగా బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్... ఇంగ్లండ్‌తో సిరీస్‌ను మెరుగ్గా ఆరంభించింది. ముల్తాన్ వేదికగా సోమవారం మొదలైన మ్యాచ్‌లో కెప్టెన్ షాన్ మసూద్ (177 బంతుల్లో 151; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (184 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లండ్ అనుభవజ్ఞులైన బౌలర్లు ఈ పర్యటనకు దూరంగా ఉండటం పాకిస్తాన్‌కు కలిసివచ్చింది. దీంతో తొలిరోజు పూర్తిగా ఆతిథ్య జట్టు పైచేయి సాధించి.. భారీస్కోరుకు బాటలు వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. నసీం షా సైతం 33 పరుగులతోఈ క్రమంలో మంగళవారం రెండో రోజు ఆటలో సౌద్ షకీల్ అర్ధ శతకం(177 బంతుల్లో 82 రన్స్) పూర్తి చేసుకోగా.. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పేసర్ నసీం షా సైతం 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, అనూహ్యంగా ఏడో స్థానంలో వచ్చిన స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం నిరాశపరిచాడు.రిజ్వాన్ మాత్రం డకౌట్ఈ వికెట్ కీపర్ 12 బంతులు ఎదుర్కొన్నా ఖాతా తెరవలేకపోయాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు రిజ్వాన్ ఆట తీరుపై జోకులు పేలుస్తున్నారు. ‘‘ముల్తాన్ పిచ్‌ను హై వే రోడ్డులా మార్చేసినా.. నువ్వు పరుగులు చేయలేవు. బౌలర్లు కూడా బంతిని బాదుతున్నారు. నువ్వు మాత్రం చెత్తగా ఆడుతున్నావు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టుల్లో రిజ్వాన్ రాణించలేకపోతున్నాడు. 2022-23లో జరిగిన సిరీస్‌లోనూ రిజ్వాన్ వరుసగా 29, 46, 10, 30, 19, 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మధ్యాహ్నం టీ బ్రేక్ సమయానికి పాకిస్తాన్ 138 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 515 పరుగులు చేసింది.చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భారీ స్కోర్ దిశగా పాకిస్తాన్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సౌద్ షకీల్(35), నసీం షా(0) ఉన్నారు.అయితే పాక్ బ్యాటర్లలో కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 253 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మసూద్ 177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 151 పరుగులు చేయగా.. షఫీక్ 184 బంతుల్లో 102 పరుగులు చేశాడు.అయితే ఈ మ్యాచ్‌లో కూడా పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 30 పరుగులు మాత్రమే చేసి ఆజం ఔటయ్యాడు.తొలి రోజు ఆట ముగుస్తుందన్న సమయంలో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా బాబర్ పెవిలియన్‌కు చేరాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ రెండు వికెట్లు పడగొట్టగా.. బషీర్,వోక్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: కోచ్‌గా పనికిరాడన్నారు కదా: మెకల్లమ్ కామెంట్స్ వైరల్ -
పాక్ కెప్టెన్ సూపర్ సెంచరీ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై షాన్ విరుచుకుపడ్డాడు. వన్డే తరహాలో దూకుడుగా ఆడుతున్న మసూద్ కేవలం 102 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 104 పరుగులతో మసూద్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా మసూద్‌కు ఇది ఐదో టెస్టు సెంచరీ. అయితే అతడికి నాలుగేళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. మసూద్ చివరగా 2020లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో శతకం సాధించాడు.అంతేకాకుండా 2022 ఏడాది తర్వాత ఓ పాక్ కెప్టెన్ టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటి సారి. 2022 డిసెంబర్లో పాకిస్తాన్ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజం.. కివీస్‌తో జరిగిన టెస్టులో సెంచరీ చేశాడు. ఇప్పుడు మళ్లీ రెండేళ్ల తర్వాత మసూద్ సెంచరీతో మెరిశాడు. ఇక 39 ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజులో మసూద్‌తో పాటు షఫీక్(72) పరుగులతో ఉన్నాడు.చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు సమం -
Pak vs Eng: ‘అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండి’
పాకిస్తాన్ సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో అక్టోబరు 7 నుంచి మూడు టెస్టులు ఆడనుంది. కాగా గత కొన్నాళ్లుగా టెస్టుల్లో పాకిస్తాన్‌కు విజయమన్నదే కరువైంది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ ఘోర పరాభవం పాలైంది.షాన్ మసూద్ బృందంపై విమర్శలుతొలిసారిగా బంగ్లా చేతిలో టెస్టులో ఓడటమే గాకుండా సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో షాన్ మసూద్ బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ సిరీస్‌తో పాక్ టెస్టు జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పికి కూడా చేదు అనుభవం ఎదురైంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ జట్టుతో పాటు గిల్లెస్పికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో అతడు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా.. సులువుగా పరుగులు రాబట్టడానికి వీలుగా ఉండే ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాక్ బ్యాటర్ల అభ్యర్థనను నిరభ్యంతరంగా కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండిపాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘‘పాక్ టెస్టు జట్టు లోపల ఏం జరిగిందో చెప్తాను. ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాకిస్తాన్ ఆటగాళ్ల నోళ్లను అతడు మూయించేశాడు. గ్రౌండ్స్‌మెన్ తయారు చేసిన పిచ్‌ను అచ్చంగా అలాగే కొనసాగించాలని నిర్ణయించాడు.ఎక్కువ కష్టపడకుండా సులువుగా పరుగులు రాబట్టాలనే వారి రిక్వెస్ట్‌ను కొట్టిపారేశాడు. పిచ్ క్యూరేటర్, గిల్లెస్పి ఆట రసవత్తరంగా సాగేలా పిచ్‌ను తయారు చేసేందుకే మొగ్గుచూపారు. గ్రాసీ పిచ్‌పై మ్యాచ్ జరిగి మా బౌలర్లు వికెట్లు తీస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు’’ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అప్పుడు 3-0తో చిత్తుకాగా అక్టోబరు 7న పాకిస్తాన్ -ఇంగ్లంఢ్ మధ్య ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు మొదలుకానుంది. ఇరుజట్ల మధ్య 2022లో పాకిస్తాన్ వేదికగా జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. మరోసారి క్లీన్‌స్వీపే లక్ష్యంగా పాక్ గడ్డపై అడుగుపెట్టింది. చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. పాక్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీఎంట్రీ?
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభావం పొందిన పాకిస్తాన్.. ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమైంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో పాక్ తలపడనుంది. ఆక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు షాన్ మసూద్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో ఎడమచేతి వాటం స్పిన్నర్ నోమన్ అలీ , ఆల్‌రౌండర్ అమీర్ జమాల్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. నోమన్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. పాక్ తరపున మొత్తం 15 టెస్టులు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు. 37 ఏళ్ల నోమన్ చివరిసారిగా జూలై 2023లో పాక్ తరపున ఆడాడు. అదే విధంగా ఖుర్రం షాజాద్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో జమాల్‌కు చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సెలక్ట్ అయిన పాక్ ఆటగాళ్లు ఛాంపియన్స్ వన్డే కప్‌లో భాగమయ్యారు.అయితే ప్రధాన కోచ్ జాసన్ గిల్లెస్పీ సూచన మేరకు ఛాంపియన్స్ వన్డే కప్ ప్లేఆఫ్‌ల నుంచి తప్పుకున్నారు. ఈ సిరీస్ కోసం షాన్ మసూద్ అండ్ కో సెప్టెంబర్ 30న ముల్తాన్‌లో సమావేశం కానున్నారు. అక్టోబర్ 1 నుంచి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నారు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాక్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, మీర్ హమ్జా, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: కోహ్లితో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! 155 పరుగులతో విధ్వంసం? -
పాక్ క్రికెట్ అంపశయ్య మీద ఉంది: మాజీ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం అంపశయ్య మీద ఉందని.. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు ప్రస్తుతం అత్యవసరమని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. బాబర్ ఆజం కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. బాబర్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అతడి పేలవ ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఏడాది కాలంగా పాక్ జట్టు తీవ్రంగా నిరాశపరుస్తోంది.వరుస పరాభవాలువన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో ఓడిపోవడమే గాకుండా.. సూపర్-8కు కూడా చేరకుండానే ఇంటిబాటపట్టింది.ఐసీయూలో ఉందిఇక ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలిసారిగా టెస్టుల్లో ఓడిపోవమే గాక.. 0-2తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఫలితంగా పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. పరిస్థితిని చక్కదిద్దగల ప్రొఫెషనల్ డాక్టర్ కావాలి. ఆర్థికంగానూ బోర్డు బలపడాల్సిన ఆవశ్యకత ఉంది.సమస్యల సుడిగుండంలో పాక్ జట్టు సరైన కోచ్‌లు కూడా ముఖ్యమే. పాక్ జట్టు సమస్యల సుడిగండంలో కూరుకుపోయింది. మైదానం లోపల.. వెలుపలా పరిస్థితి ఒకేలా ఉంది’’ అని పేర్కొన్నాడు. వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోవడమే ఉత్తమమన్న రషీద్ లతీఫ్.. బ్యాటర్‌గా జట్టుకు అతడి అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా పాకిస్తాన్ తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడనుంది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌కు బాబర్, టెస్టులకు షాన్ మసూద్ ప్రస్తుతం సారథులుగా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు మరో బిగ్‌షాక్!? -
మా ఓటమికి కారణం అదే.. అందుకు నాదే బాధ్యత: పాక్ కెప్టెన్
సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త కెప్టెన్సీ, ఆటగాళ్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం వల్లే ఈ గతి పట్టిందంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు షాన్ మసూద్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి టెస్టులో మొత్తంగా పేసర్లతో దిగడం, రెండో టెస్టులో ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, నసీం షాలను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలను తప్పుపడుతున్నారు.ఓటమికి బాధ్యత నాదేజట్టు ఆట తీరు చూస్తే సరైన ప్రణాళిక, వ్యూహాలు లేకుండానే బరిలోకి దిగినట్లు కనిపించిందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురి కావడంపై కెప్టెన్ షాన్ మసూద్ స్పందిస్తూ.. ‘‘స్వదేశంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరాం. కానీ తీవ్ర నిరాశే మిగిలింది. ఆస్ట్రేలియాలో ఎదురైన పరాభవం నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాం.ఓటమికి బాధ్యత వహిస్తూ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. కానీ టెస్టు క్రికెట్‌ను మరింత పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధంగా లేనట్లు అనిపించింది. ఆటగాళ్లు గెలవాలనే లక్ష్యంతోనే ఆడినా... ఫలితాలు అనుకూలంగా రాలేదు. ఆ అంశాలతో సంబంధం లేదుటెస్టు ఫార్మాట్ ఆడుతున్న బౌలర్లకు తరచూ అవకాశాలు ఇవ్వాలి. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాం. ఇకపై మరింత క్రమశిక్షణతో ముందుకు సాగాలనుకుంటున్నాం. లోపాలను సవరించుకోవడంపై దృష్టి పెడతాం. జట్టు ఎంపిక, డ్రెస్సింగ్ రూమ్ వంటి అంశాలతో ఫలితాలకు సంబంధం లేదు. బంగ్లాదేశ్ జట్టు మా కంటే మెరుగైన ఆటతీరు కనబర్చింది. ఈ విజయానికి వారు అర్హులు’’అని పేర్కొన్నాడు.వాళ్లిద్దరిని తప్పించడం సరైందేఇక రెండో టెస్టు నుంచి షాహిన్ ఆఫ్రిది, నసీం షాలను తప్పించిన తమ నిర్ణయాన్ని షాన్ మసూద్ సమర్థించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఫాస్ట్ బౌలర్లపై పనిభారం ఎక్కువగా మోపడం సరికాదని పేర్కొన్నాడు. అయినా ఎల్లప్పుడూ ఒకరిద్దరు ప్లేయర్లపైనే ఆధారపడకూడదని.. మిగతా వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నాడు. తొలిసారి బంగ్లా గెలుపుకాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాక్ పేస్ త్రయం మీర్ హమ్జా, మొహమ్మద్ అలీ, ఖుర్రం షెహజాద్ వికెట్లు పడగొట్టినా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ పాక్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. పాక్‌పై బంగ్లా టెస్టుల్లో గెలుపొందడం ఇదే తొలిసారి.చదవండి: ఆ దృశ్యాలు నా కుమారుల కంటపడకూడదనుకున్నా: ద్రవిడ్ -
Pak vs Ban: పతనం దిశగా పాక్.. ఈ జట్టుకు ఏమైంది?
అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇంతకన్నా కిందికి దిగజారలేదు అనుకున్న ప్రతీసారి అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ అంతకుమించిన చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఆకీబ్ జావేద్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ పేసర్లు... జహీర్ అబ్బాస్, జావేద్ మియాందాద్, ఇంజమాముల్ హక్, రమీజ్ రాజా, సయీద్ అన్వర్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ వంటి మేటి ఆటగాళ్లతో కళకళలాడిన ఆ జట్టు... ఇప్పుడు రెండున్నరేళ్లుగా స్వదేశంలో టెస్టు మ్యాచ్ గెలవలేక ఇబ్బంది పడుతోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవడం పాకిస్తాన్ జట్టు పతనావస్థను సూచిస్తోంది.రావల్పిండి: సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన బంగ్లాదేశ్ జట్టు... పాకిస్తాన్లో పాకిస్తాన్‌పై రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. గతంలో పాకిస్తాన్‌తో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 12 టెస్టుల్లో ఓడిన బంగ్లాదేశ్... తాజా పర్యటనలో వరుసగా రెండు టెస్టులు నెగ్గి సొంతగడ్డపై పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా ఐదో టెస్టులో పరాజయంబంగ్లాదేశ్కు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం కాగా... వర్షం అంతరాయం మధ్య మూడున్నర రోజులే జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. రాజకీయ అనిశ్చితి కారణంగా దేశంలో అల్లర్లు, నిరసనలు కొనసాగుతున్న సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఇలాంటి విజయం సాధించడం గమనార్హం. మరోవైపు గత కొంతకాలంగా స్వదేశంలోనూ నిలకడగా విజయాలు సాధించలేకపోతున్న పాకిస్తాన్ జట్టు... ఈ ఏడాది వరుసగా ఐదో టెస్టు మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఈ ఐదింట్లోనూ జట్టుకు సారథిగా వ్యవహరించిన షాన్ మసూద్... తొలి ఐదు టెస్టుల్లోనూ ఓటములు ఎదుర్కొన్న తొలి పాకిస్తాన్ కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.ఈ సిరీస్‌లో నమోదైన పలు ఆసక్తికర రికార్డులను పరిశీలిస్తే.. 👉బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. ఇంతకుముందు 2009లో వెస్టిండీస్‌పై, 2021లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లు నెగ్గింది. 👉ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పేస్ బౌలర్లే తీయడం బంగ్లాదేశ్‌కు ఇది తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్, నహీద్ రాణా, తస్కీన్ అహ్మద్ కలిసి పాకిస్తాన్ పది వికెట్లు పడగొట్టారు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి బంగ్లా పేసర్లు 14 వికెట్లు పడగొట్టారు. 👉ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టాప్–6 ప్లేయర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. టెస్టు మ్యాచ్ నెగ్గిన సందర్భంలో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు ఆటగాళ్లు చేసిన రెండో అత్యల్ప పరుగులివే. 1887లో ఆస్ట్రేలియా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత పుంజుకుని మ్యాచ్ నెగ్గింది. 👉సొంతగడ్డపై గత పది మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టు గెలుపు రుచి చూడలేదు. ఇంతకుముందు 1969–1975 మధ్య పాకిస్తాన్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోయింది. 👉షాన్ మసూద్ సారథ్యంలో ఆడిన ఐదు టెస్టుల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. గతంలో ఏడుగురు కెప్టెన్లకు తొలి ఐదు టెస్టుల్లో పరాజయాలు ఎదురయ్యాయి. ఆ జాబితాలో ఖాలెద్ మసూద్ (12 టెస్టులు; బంగ్లాదేశ్), ఖాలెద్ మహమూద్ (9 టెస్టులు; బంగ్లాదేశ్), మొహమ్మద్ అష్రఫుల్ (8 టెస్టులు; బంగ్లాదేశ్), నయీముర్ రహమాన్ (5 టెస్టులు; బంగ్లాదేశ్), గ్రేమ్ క్రీమర్ (6 టెస్టులు; జింబాబ్వే), కేన్ రూథర్‌ఫార్డ్ (5 టెస్టులు, న్యూజిలాండ్), బ్రాత్‌వైట్ (5 టెస్టులు; వెస్టిండీస్) ముందున్నారు. -
Pak Vs Ban: చెలరేగిన బంగ్లా పేసర్లు.. పాక్ 172 ఆలౌట్
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు... అదే జోరులో సిరీస్ చేజిక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అద్వితీయ ఆట తీరుతో రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ చేసింది.చెలరేగిన బంగ్లా పేసర్లుబంగ్లా రైటార్మ్ పేసర్లు హసన్ మహమూద్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నషీద్ రాణా 4 వికెట్లు కూల్చాడు. మరో కుడిచేతి వాటం పేసర్ టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పాక్ బ్యాటర్లలో ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆఘా సల్మాన్ 47 పరుగులతో అజేయంగా ఉండటంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాన్ మసూద్ 28, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో రాణించారు. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు దాటలేక చతికిలపడ్డారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసిన బంగ్లాదేశ్.. టీ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ విజయానికి 148 పరుగుల దూరంలో నిలిచింది.లిటన్ దాస్ వీరోచిత ఇన్నింగ్స్కాగా పాకిస్తాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 78.4 ఓవర్లలో 262 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్. పాకిస్తాన్ పేసర్ల ధాటికి 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను లిటన్ దాస్ ఆదుకున్నాడు. ఎదురుదాడితో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. మెహదీ హసన్ మిరాజ్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. లిటన్ దాస్ 228 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాటిగా పరుగులు రాబట్టాడు. అతడికి ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (124 బతుల్లో 78; 12 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు. ఖుర్రమ్ షెహజాద్‌కు 6 వికెట్లువీరిద్దరూ ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించడంతో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ నజ్ముల్ షాంటో (4), మోమినుల్ హక్ (1), ముష్ఫికర్ రహీమ్ (3), షకీబ్ అల్ హసన్ (2), జాకీర్ హసన్ (1), షాద్మన్ ఇస్లామ్ (10) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6, మీర్ హమ్జా, సల్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (3), నైట్ వాచ్‌మన్ ఖుర్రం షెహజాద్ (0) అవుటయ్యారు. గెలిస్తే సరికొత్త చరిత్రబంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 8 వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో సంపాదించింది. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా బంగ్లాదేశ్.. ఆతిథ్య పాక్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవనీయలేదు. 172 పరుగులకే ఆలౌట్ చేసి మరోసారి షాకిచ్చింది.ఇక వర్షం కారణంగా పాక్-బంగ్లా తొలిరోజు(శుక్రవారం) ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో అనూహ్య రీతిలో తొలి టెస్టులో గెలుపొందిన బంగ్లాదేశ్.. రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.కాగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు స్కోరు చేసింది. -
బంగ్లాతో రెండో టెస్టు.. పాక్ సంచలన స్పిన్నర్ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో మ్యాచ్‌కు ముందు యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులాంను వెనక్కి పిలిపించింది. వీళ్లిద్దరిని తిరిగి జట్టులో చేర్చింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా ఆగష్టు 21-25 మధ్య జరిగిన తొలి టెస్టులో అతి విశ్వాసంతో భారీ మూల్యం చెల్లించింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక కేవలం పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చి.. చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. వారిద్దరు తిరిగి జట్టులోకి బంగ్లాదేశ్ స్పిన్ వలలో చిక్కి 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా బంగ్లా చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన పాక్ తొలి జట్టుగా షాన్ మసూద్ బృందం నిలిచింది. ఈ క్రమంలో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా.. ముందుగా చెప్పినట్లుగా అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాంను తిరిగి జట్టులోకి తీసుకుంది. వీరిలో అబ్రార్‌కు తుదిజట్టులో చోటు దాదాపుగా ఖాయం కాగా.. కమ్రాన్ విషయంలో సందిగ్దం నెలకొంది. నాలుగు వికెట్లతో మెరిసిన అబ్రార్ఇక వీరితో పాటు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని కూడా వెనక్కి పిలిపించింది పాక్ బోర్డు. ఈ మేరకు.. ‘‘ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 3 వరకు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాం తిరిగి జట్టుతో చేరుతున్నారు’’ అని పీసీబీ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా షాహిన్, ఆల్‌రౌండర్ ఆమీర్ జమాల్ కూడా జట్టుతోనే ఉండనున్నట్లు తెలిపింది.కాగా తొలి టెస్టుకు ముందు అబ్రార్‌తో పాటు కమ్రాన్‌ను విడుదల చేయగా.. బంగ్లాదేశ్-ఏ జట్టుతో పాక్ షాహిన్స్ జట్టు తరఫున అనధికారిక టెస్టు ఆడారు. ఈ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ అబ్రార్ నాలుగు వికెట్లతో మెరవగా.. కమ్రాన్ 34 పరుగులు చేయడంతో పాటు.. ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. కాగా అబ్రార్ అహ్మద్ ఇప్పటి వరకు పాక్ తరఫున మొత్తంగా ఆడింది ఆరు టెస్టులే అయినా 38 వికెట్లు తీసి సత్తా చాటాడు.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్ సాధిస్తేనే), అబ్రార్ అహ్మద్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహిన్ షా ఆఫ్రిది.చదవండి: Test Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. టాప్-10లో ముగ్గురు భారత స్టార్లు -
WTC: పాకిస్తాన్‌కు భారీ షాకులిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆరు పాయింట్లను కోల్పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున పాక్ జట్టుకు ఆరు పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.బంగ్లా చేతిలో పాకిస్తాన్ చిత్తుకాగా డబ్ల్యూటీసీలో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య రీతిలో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఓటమిని చేతులారా ఆహ్వానించింది. తద్వారా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఓడిన తొలి పాక్ జట్టుగా షాన్ మసూద్ బృందం చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది.బంగ్లాకు సైతం ఎదురుదెబ్బఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ఇలా బాంబు పేల్చడం గమనార్హం. బంగ్లాతో మొదటి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ.. పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతతో పాటు ఆరు పాయింట్లు కట్ చేసినట్లు ఐసీసీ పేర్కొంది. మరోవైపు.. బంగ్లాదేశ్‌కు కూడా స్లో ఓవర్ రేటు సెగ తగిలింది.ఫలితంగా నజ్ముల్ షాంటో బృందం మూడు డబ్ల్యూటీసీ పాయింట్లతో పాటు 15 శాతం మేర మ్యాచ్ ఫీజు కోల్పోయింది. అంతేగాక.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు పనిష్మెంట్ ఇచ్చింది ఐసీసీ. పాక్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌పైకి బంతిని విసిరినందుకు గానూ.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేసింది. అదే విధంగా.. ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని లెవల్ 1 ప్రకారం.. ఒక డిమెరిట్ పాయింట్( దురుసుగా ప్రవర్తించినందుకుగానూ) ఇచ్చింది.టాప్‌లోనే టీమిండియా.. బంగ్లా, పాక్ ఏ స్థానంలో?ఈ పరిణామాల అనంతరం డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాదేశ్ ఏడు, పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మరోవైపు.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.PC: insidesportపాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
అదే మా కొంప ముంచింది.. బంగ్లా చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్ స్పందన
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం. పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టుగా బంగ్లాదేశ్ రికార్డుల్లోకెక్కింది. పాక్ సొంతగడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలిచి 1294 రోజులు అవుతుంది. 2021లో పాక్ చివరిగా సొంతగడ్డపై సౌతాఫ్రికాను ఓడించింది. పాక్ ఈ మ్యాచ్‌లో మరో పేలవ రికార్డు కూడా మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఓటమిపాలవ్వడం పాక్‌కు ఇది నాలుగో సారి.బంగ్లా చేతిలో ఊహించని పరాభవం అనంతరం ఆ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ స్పందించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ముందుగా డిక్లేర్ చేయడం ఓటమిపై కొంతమేర ప్రభావం చూపించిందని అన్నాడు. మ్యాచ్‌ను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసకున్నామని తెలిపాడు. ఊహించనట్లుగా పిచ్ నుంచి సహకారం లభించలేదని పేర్కొన్నాడు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం పేలవ వ్యూహమని అన్నాడు. మా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం కారణం కాదని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
అంపైర్‌పై పాక్ కెప్టెన్ సీరియస్.. ఇది ఔటా? నాటౌటా? వీడియో
రావల్పిండి వేదికగా బుధవారం (ఆగస్టు21) బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ శాంటో పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు.అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైంది. అంపైర్ తప్పుడు నిర్ణయానికి పాక్ కెప్టెన్ షాన్ మసూద్ బలైపోయాడని నెటిజన్లు అంపైర్‌పై మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే?టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు మంచి ఆరంభం దక్కలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్ అబ్దుల్ షఫీక్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్.. మరో ఓపెనర్ అయూబ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాలని భావించాడు. కానీ మసూద్ అనుకున్నది జరగలేదు. బంగ్లా పేసర్ షోర్ఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో అనూహ్యంగా మసూద్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. పాక్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేసిన షోర్ఫుల్ ఐదో బంతిని బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే మసూద్ మిడ్-ఆఫ్ వైపు డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు దగ్గరగా మిస్స్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే వికెట్ కీపర్ లిట్టన్ దాస్ క్యాచ్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. ఈ క్రమంలో బంగ్లా కెప్టెన్ రివ్యూకు వెళ్లాడు. అయితే ఆల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్‌కు తాకిన సమయంలో స్పైక్ వచ్చినట్లు కన్పించింది. అదే సమయంలో బ్యాట్ కూడా బంతికి దగ్గరగా ఉందని భావించిన థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసిన మసూద్ షాక్‌కు గురయ్యాడు. అంపైర్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ మసూద్ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్స్‌లో షేర్ చేసింది. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి మసూద్ ఔటయ్యాడు. Out or not out❓Shan Masood is dismissed by Shoriful Islam.#PAKvBAN | #TestOnHai pic.twitter.com/8OgkgQKHPa— Pakistan Cricket (@TheRealPCB) August 21, 2024 -
Pak vs Ban: పాక్ తుదిజట్టు ప్రకటన.. యువ పేసర్‌కు చోటు
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. షాన్ మసూద్ సారథ్యంలోని ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏకంగా నలుగురు పేసర్లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ ఆఘా ఒక్కడికే స్థానం ఇచ్చారు సెలక్టర్లు.కాగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ టెస్టు జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు షాన్ మసూద్. అయితే, ఆ టూర్ అతడికి చేదు అనుభవం మిగిల్చింది. అతడి కెప్టెన్సీలో ఆసీస్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఈ సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పుడే సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది.బంగ్లాపై పైచేయి బంగ్లాతో ఇప్పటి వరకు 13 టెస్టుల్లో పన్నెండు గెలిచి ఘనమైన టెస్టు రికార్డు కలిగి ఉన్నా.. పాకిస్తాన్ ఈ సిరీస్‌లో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే బంగ్లాను క్లీన్‌స్వీప్ చేస్తే మరింత వేగంగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ సిరీస్‌తోనే ఆస్ట్రేలియన్ జాసన్ గిల్లెస్పి పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు.యువ సంచలనానికి చోటుఇక ఆగష్టు 21 నుంచి రావల్పిండి వేదికగా మొదలయ్యే తొలి టెస్టు కోసం పాకిస్తాన్ సోమవారమే తమ తుదిజట్టును ప్రకటించింది. ఓపెనర్లుగా అబ్దుల్ షఫీక్, సయీమ్ ఆయుబ్.. వన్‌డౌన్‌లో షాన్ మసూద్ ఆడనున్నారు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన సౌద్ షకీల్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా ఆ తర్వాతి స్థానాల్లో ఆడనున్నారు.ఇక పేస్ విభాగంలో షాహిన్ ఆఫ్రిది, నసీం షా, యువ సంచలనం ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ బరిలోకి దిగనున్నారు. కాగా ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా పాక్ తరఫున అరంగేట్రం చేసిన షెహజాద్ తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో మెరిశాడు. అయితే, ఇప్పుడే మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఇదిలా ఉంటే.. బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన పాక్ బోర్డు.. ఆ తర్వాత 14 మందికి తగ్గించింది. ఆమీర్ జమాల్ వెన్నునొప్పి కారణంగా దూరం కాగా.. లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్‌లను బంగ్లాదేశ్-ఎ జట్టుతో బరిలోకి దించనుంది.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తుదిజట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: చాంపియన్స్ ట్రోఫీ వరకు ఇషాన్‌కు టీమిండియాలో నో ఛాన్స్! -
'పాక్ జట్టులో మ్యాచ్ ఫిక్సర్లు లేరు.. అందరి లక్ష్యం ఒక్కటే'
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్‌కు సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడనుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం పాక్ జట్టు ఇప్పటికే తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది.లహోర్‌లోని హైఫెర్మామెన్స్ సెంటర్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తాజాగా ప్రీ-సిరీస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు చారిత్రత్మక గోల్డ్‌మెడల్ అందించిన అర్షద్ జావెద్‌పై మీ అభిప్రాయమేంటని ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించాడు.అదే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి కదా అని సదరు జర్నలిస్టు మరో ప్రశ్నను సంధించాడు."ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ సెటప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదానికి తావులేదు. జట్టులోని ప్రతీ ఒక్కరూ పాకిస్తాన్‌కు విజయాలు అందించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఏ క్రికెటర్ కూడా తమ దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించారని నేను అనుకుంటున్నాను. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మేము తొలి సిరీస్ ఆడుతున్నాం. ఈ సిరీస్‌లో గెలిచేందుకు మేము శర్వశక్తులా ప్రయత్నిస్తాము. అయితే ఆటలో గెలుపు, ఓటములు సహజం. మేము ఓడిన ప్రతీసారి చాలా నిరాశచెందుతాం. ఇక అర్షద్ నదీమ్ ఒక నేషనల్ హీరో. నదీమ్‌ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని" విలేకరుల సమావేశంలో మసూద్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్ టెస్టులకు పాకిస్థాన్ టెస్టు జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్‌నెస్‌కు లోబడి), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది. -
బంగ్లాతో సిరీస్‌కు పాక్ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. పదిహేడు మంది ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేసినట్లు తెలిపింది. కెప్టెన్‌గా షాన్ మసూద్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరగాల్సి ఉంది.పాక్- బంగ్లా సిరీస్ నిర్వహణపై సందిగ్దంఇందుకోసం బంగ్లాదేశ్ పాక్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీస్ సజావుగా సాగే అవకాశం కనిపించడం లేదు. బంగ్లాదేశ్‌లో పెను రాజకీయ సంక్షోభం నేపథ్యంలో చెలరేగిన అల్లర్లు విధ్వంసకాండకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసి.. దేశం వీడారు షేక్ హసీనా.అయినప్పటికీ జనాగ్రహజ్వాలలు చల్లారలేదు. షేక్ హసీనాతో సత్సంబంధాలు ఉన్న ప్రముఖుల ఇళ్లకు నిప్పుపెట్టడం సహా మరికొంతమందిని కడతేర్చారు. అంతేకాదు.. ఈ అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాక్- బంగ్లా సిరీస్ నిర్వహణపై సందిగ్దం నెలకొంది.ఈ క్రమంలో పాక్ బోర్డు తాము సురక్షితంగా బంగ్లా ఆటగాళ్లను తీసుకువెళ్తామని చెప్పినా.. బంగ్లా బోర్డు నుంచి స్పందన రాలేదని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే, పాకిస్తాన్ మాత్రం బుధవారమే జట్టును ప్రకటించడం విశేషం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మెరుగైన స్థానంలో నిలవాలంటే ఈ సిరీస్ తప్పనిసరికావడంతో పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.కెప్టెన్ అతడేఇక వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టెస్టులకు షాన్ మసూద్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు బాబర్ తిరిగి వన్డే, టీ20 పగ్గాలు చేపట్టడంతో టెస్టుల్లోనూ అతడినే పునర్నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బోర్డు మాత్రం మసూద్‌నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. సౌద్ షకీల్‌ను అతడికి డిప్యూటీగా నియమించింది.బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో దాదాపు 13 నెలల విరామం తర్వాత యువ పేసర్ నసీం షా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా పాక్- బంగ్లా జట్ల మధ్య రావల్పిండిలో తొలి టెస్టు ఆగష్టు 21- 25, కరాచీలో ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్ సాధిస్తేనే), అబ్దుల్లా షఫిక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది. -
బాబర్, రిజ్వాన్, అఫ్రిది వద్దు.. అతడే పాక్ కెప్టెన్ కావాలి: సల్మాన్ బట్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమ జట్టు చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై వేటు వేసిన పీసీబీ.. కెప్టెన్సీ మార్పుపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.టీ20 వరల్డ్‌కప్ ముందు పాక్ జట్టు పగ్గాలను తిరిగి చేపట్టిన బాబర్ ఆజం.. మరోసారి ఐసీసీ టోర్నీల్లో జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో బాబర్‌ను పాక్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి.ఈ జాబితాలోకి తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ చేరాడు. పరిమిత ఓవర్లలో పాక్ కెప్టెన్సీని స్టార్ బ్యాటర్ షాన్ మసూద్‌కు అప్పగించాలని బట్ పీసీబీని సూచించాడు. కాగా మసూద్ ప్రస్తుతం టెస్టుల్లో పాక్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు."ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో కాస్త గందరగోళం నెలకొంది. జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటకి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బాబర్‌కు కెప్టెన్సీ స్కిల్స్ పెద్దగా లేవు.ఫీల్డ్‌లో వ్యూహాలు రచించడంలో విఫలమవుతున్నాడు. పాకిస్తాన్ తిరిగి విన్నింగ్ ట్రాక్‌లో రావాలంటే ఒక్కటే మార్గం. షాన్ మసూద్ అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ అప్పగించాలని"ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భట్ పేర్కొన్నాడు.చదవండి: లంకతో సిరీస్‌తో రీఎంట్రీ!.. ఖరీదైన ఫ్లాట్ కొన్న టీమిండియా స్టార్ -
క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. వీడియో వైరల్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం యార్క్‌షైర్, లాంక్షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఆటగాడు షాన్ మసూద్ ఒకే బంతికి హిట్ వికెట్‌తో పాటు రనౌటయ్యాడు.కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) నిబంధనల కారణంగా మసూద్ ఔటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు.అసలేం జరిగిందంటే?యార్క్‌షైర్ ఇన్నింగ్స్ 15వ వేసిన బ్లాథర్విక్ బౌలింగ్‌లో మూడో బంతిని షాన్ మసూద్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన మసూద్ తన కాలితో స్టంప్స్‌ను తాకాడు. దీంతో బెయిల్స్ కిందపడిపోయాయి. ఈ క్రమంలో తన ఔట్ అని గ్రహించిన మసూద్.. నాన్‌స్ట్రైకర్ జోరూట్ రన్‌కు పరిగెత్తుకుంటూ వచ్చినప్పటకి తను మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే అంతలోనే అంపైర్ నో బాల్‌గా సిగ్నల్ ఇవ్వడంతో మసూద్ కూడా నాన్‌స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. కాగా అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్లు వికెట్లను గిరాటేశారు. దీంతో మసూద్ రనౌటయ్యాని నిరాశచెందాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్టు చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా సిగ్నల్ ఇచ్చి అందరిని గందరగోళానికి గురిచేశాడు. అయితే మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) రూల్స్ ప్రకారమే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.రూల్స్ ఏం చెబుతున్నాయి..?ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. అంపైర్ ఔట్ ఇవ్వకుండా బ్యాటర్ తనంతట తానే ఔట్ అయినట్లు తప్పుగా భావిస్తే అంపైర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నాటౌట్ ఇవ్వవచ్చు. మసూద్ విషయంలో కూడా అదే జరిగింది. తన హిట్‌వికెట్ అయ్యాడని భావించిన మసూద్ రన్‌కు పరిగెత్తి మధ్యలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే రనౌటయ్యాడు. కానీ ఉద్దేశపూర్వకంగా మసూద్ అలా చేయలేదని భావించిన అంపైర్ నౌటౌట్‌గా ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో హిట్‌వికెట్‌ను కూడా అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో మసూద్ తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే Shan Masood steps on his stumps off a no ball, Lancashire take the bails off at the other end - but Masood remained not out under law 31.7 pic.twitter.com/yQG6gP6Rac— Vitality Blast (@VitalityBlast) June 20, 2024 -
వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిన రెండో రోజు ఆట
Australia vs Pakistan, 3rd Test Day 2: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా రెండో రోజు కేవలం 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు షఫీక్ (0), అయూబ్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ షాన్ మసూద్ (35; 3 ఫోర్లు), బాబర్ ఆజమ్ (26; 4 ఫోర్లు) కొద్దిగా పోరాడారు. ఒక దశలో స్కోరు 96/5కి చేరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (88), ఆగా సల్మాన్ (53) సల్మాన్ ఆరో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాక్ ఇక సులువుగానే తలవంచుతుందని ఆసీస్ భావించింది. కానీ పేస్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాటింగ్‌లో వీరోచిత పోరాటం చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 77.1 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్ రెండు, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆట నిలిచే సమయానికి 6/0(2) స్కోరు చేసింది. ఈ క్రమంలో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ 24.3 ఓవర్ వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్(34) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కానీ అర్ధ శతకానికి మూడు పరుగుల దూరంలో ఉన్న ఖవాజా(47)ను ఆమిర్ జమాల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 47వ ఓవర్ ముగిసే సరికి మొదలైన వర్షం తెరిపినివ్వలేదు. దీంతో అక్కడితో ఆటను ముగించేశారు. అప్పటికి లబుషేన్ 23, స్టీవ్ స్మిత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆగా సల్మాన్, ఆమిర్ జమాల్‌కు చెరో వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్ డేవిడ్ వార్నర్ కెరీర్లో చివరి టెస్టు. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
Aus Vs Pak: ఐదు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. పాక్ ఆలౌట్
Australia vs Pakistan, 3rd Test Day 1 Report: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలినా.. మహ్మద్ రిజ్వాన్, ఆగా సల్మాన్, ఆమెర్ జమాల్ అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరి ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ 300 పరుగుల మార్కును అందుకోగలిగింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు టెస్టు సిడ్నీ వేదికగా బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ను మిచెల్ స్టార్క్.. సయీమ్ ఆయుబ్‌ను జోష్ హాజిల్‌వుడ్ డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్ రెండు వికెట్లు కోల్పోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్(35).. బాబర్ ఆజంతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాబర్‌ను 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ జోడీని విడదీశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్‌ను కూడా కమిన్సే అవుట్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 88 పరుగులతో రాణించాడు. అతడి తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆగా సల్మాన్ మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు అవుట్ కాగానే పాక్ సులువుగానే తలవంచుతుందని భావించిన కమిన్స్ బృందానికి ఆల్‌రౌండర్ ఆమెర్ జమాల్ షాకిచ్చాడు. తొమ్మిద స్థానంలో బరిలోకి దిగిన అతడు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ 97 బంతుల్లో 82 పరుగులు రాబట్టాడు. అయితే, నాథన్ లియోన్ అద్బుత బంతితో అతడిని బోల్తా కొట్టించడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి రోజు ఆటలో భాగంగా 77.1 ఓవర్లలో 313 పరుగుల వద్ద పాక్ జట్టు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ రెండు, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా బుధవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు పాకిస్తాన్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం మొదటి రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆసీస్ పాక్ కంటే 307 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ ఆరు, ఉస్మాన్ ఖవాజా సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. -
కమిన్స్ దెబ్బ.. రెండో టెస్టులోనూ పాక్ చిత్తు.. సిరీస్ ఆస్ట్రేలియాదే
Australia vs Pakistan, 2nd Test : పాకిస్తాన్‌తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బాబర్ ఆజం స్థానంలో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన షాన్ మసూద్ సారథ్యంలో పాకిస్తాన్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 14న మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్ ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా గెలిచి నిలవాలని పాక్ భావించింది. బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టును 318 పరుగులకు కట్టడి చేయగలిగింది పాక్. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 264 పరుగులకే షాన్ మసూద్ బృందం ఆలౌట్ కావడంతో.. ఆసీస్‌కు 54 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు పాక్ ఆరంభంలోనే షాకిచ్చింది. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా దెబ్బకు టాపార్డర్ కుప్పకూలిపోయింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇబ్బందుల్లో పడింది. Mitch Marsh hangs on at third man! Whatta catch! #AUSvPAK pic.twitter.com/BFC1LBXjeK — cricket.com.au (@cricketcomau) December 29, 2023 ఇలాంటి క్లిష్ట దశలో మిచెల్ మార్ష్ (96; 13 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించి ఆసీస్‌ను నిలబెట్టారు. ఈ క్రమంలో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 62.3 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 241 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 262 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ బెంబేలెత్తించాడు. ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరో పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తనదైన శైలిలో రాణించడంతో పాకిస్తాన్ 237 పరుగులకే చాపచుట్టేసింది. షాన్ మసూద్ కెప్టెన్ ఇన్నింగ్స్(71 బంతుల్లో 60 పరుగులు), ఆగా సల్మాన్ అర్ధ శతకం(50)తో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 79 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలు కాగా నాలుగో రోజే ఆట ముగిసిపోయింది. ఇక పాక్ రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్ నాలుగు, జోష్ హాజిల్‌వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు ఆఖరి టెస్టు బుధవారం (జనవరి 3) నుంచి ప్రారంభం కానుంది. కాగా ఆస్ట్రేలియాలో పాక్ ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. 1995లో చివరగా కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. తాజా పరాజయంతో 1999 పర్యటన నుంచి ఆ జట్టు వరుసగా 16 టెస్టుల్లో ఓడింది. THE AUSSIES GET IT DONE! 🔥 📺 Watch Day 4 #AUSvPAK on Fox Cricket and Kayo Sports: https://t.co/VNpf5Xojhg ✍ BLOG: https://t.co/physFvdl0W 🔢 MATCH CENTRE: https://t.co/v8I8vaM89H pic.twitter.com/D8dCwItqhb — Fox Cricket (@FoxCricket) December 29, 2023 -
బాబర్ విఫలం.. కమిన్స్ జోరు! రెండో రోజు ఆసీస్‌దే పైచేయి!
Australia vs Pakistan, 2nd Test Day 2: పాకిస్తాన్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. రెండో రోజు ఆట ముగిసే సరికి పర్యాటక జట్టుపై పైచేయి సాధించింది. కాగా మెల్బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాకిస్తాన్ మధ్య బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. టీ విరామానికి 37 నిమిషాల ముందు వర్షం రావడంతో ఆటకు మూడు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. దాంతో తొలి రోజు 66 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖవాజా (42; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. స్టీవ్ స్మిత్ (26; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి లబుషేన్ (44 బ్యాటింగ్; 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (9 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లు హసన్ అలీ, ఆమెర్ జమాల్, ఆగా సల్మాన్ ఒక్కోవికెట్ తీశారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట మొదలుపెట్టిన కంగారూ జట్టును పాక్ బౌలర్లు కట్టడి చేశారు. 187/3 ఓవర్‌నైట్ స్కోరుతో మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను 318 పరుగులకు ఆలౌట్ చేశారు. ఆతిథ్య ఆసీస్ రెండో రోజు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జోష్‌లో బ్యాటింగ్ మొదలుపెట్టిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాకిచ్చాడు ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్. పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను అవుట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ అర్ధ శతకం(62)తో మెరిశాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాన్ మసూద్(54)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ షఫీక్‌ను, లియోన్ మసూద్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లోనూ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. కమిన్స్ అద్భుత బంతితో బాబర్(1)ను బౌల్డ్ చేయగా.. సౌద్ షకీల్‌ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోష్ హాజిల్‌వుడ్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక మరోసారి బంతితో మ్యాజిక్ చేసిన కమిన్స్.. ఆగా సల్మాన్(9)ను అవుట్ చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి మళ్లీ ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా 55 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 194 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 29, ఆమిర్ జమాల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌కు మూడు, నాథన్ లియోన్‌కు రెండు, జోష్ హాజిల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి! -
Aus vs Pak 2nd Test: సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ
Aus vs Pak Boxing Day Test Squads: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విఫలమైన పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పడింది. అతడి స్థానంలో స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌ను తుదిజట్టులోకి తీసుకుంది పాక్ మేనేజ్మెంట్. బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత షాన్ మసూద్ పాకిస్తాన్ టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. వచ్చీరాగానే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో అతడికి కఠిన సవాలు ఎదురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో కంగారూ జట్టు చేతిలో పాక్ ఘోర పరభవాన్ని చవిచూసింది. ఏకంగా 360 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 89 పరుగులకే జట్టు ఆలౌట్ కావడంతో భారీ తేడాతో ఓటమి తప్పలేదు. మిగతా వాళ్లు తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం నిరాశపరిచాడు. మొత్తంగా ఏడు (3,4) పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో రెండో టెస్టుకు సర్ఫరాజ్‌ను తప్పించిన యాజమాన్యం అతడి స్థానాన్ని స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌తో భర్తీ చేసేంది. ఈ విషయం గురించి కెప్టెన్ షాన్ మసూద్ మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం కావాలి. రిజ్వాన్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లను ఒక్కోసారి పక్కనపెట్టాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. నొమన్ అలీ, ఖుర్రం షెహజాద్ గాయపడటంతో జట్టుకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాత్రం తొలి టెస్టు ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనుంది. ఎలాంటి మార్పులు లేకుండానే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పాక్‌తో రెండో టెస్టు ఆడనున్నట్లు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రకటించాడు. ఈ జట్టులో చోటు ఆశించి భంగపడిన వెటరన్ పేసర్ స్కాట్ బోలాండ్కు తగిన సమయంలో అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా కమిన్స్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్. పాకిస్తాన్ జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్, సాజిద్ ఖాన్. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
మూలిగే నక్కమీద తాటిపండు.. పాక్‌కు మరో షాకిచ్చిన ఐసీసీ!
Aus vs Pakistan lose WTC25 Points: ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. పెర్త్ టెస్టులో నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి పాక్ జట్టుకు జరిమానా విధించింది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ పాయింట్లలో రెండు పాయింట్ల మేర కోత విధించింది. భారీ ఓటమి కాగా పాకిస్తాన్‌తో టెస్టులో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదివారం 450 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది పాకిస్తాన్. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 30.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. పాక్ జట్టులో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హఖ్ (10) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్ (3/31), హాజిల్‌వుడ్ (3/13), నాథన్ లియోన్ (2/14) పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బకొట్టారు. ఆసీస్ చేతిలో మరోసారి ఘోర పరాభవం దీంతో కంగారూల చేతిలో షాన్ మసూద్ బృందానికి ఘోర పరాభవం తప్పలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 84/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 233 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక తాజా పరాజయంతో ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్‌కిది వరుసగా 15వ ఓటమి కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలో చివరిసారిగా 1995లో పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ గెలిచింది. అంతేకాదు.. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో పాకిస్తాన్‌కిది రెండో అతిపెద్ద పరాజయం. మూలిగే నక్కమీద తాటిపండు ఇన్ని పరాభవాల మధ్య డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఇప్పటికే టీమిండియాకు కోల్పోయిన పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో తొలి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో పది శాతం మేర కోతపడింది. అంతేకాదు.. రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కూడా కోల్పోయింది. దీంతో టీమిండియా అగ్రపీఠాన్ని మరింత పదిలమైంది. అప్డేట్ అయిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక PC: ICC ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైందని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు డిసెంబరు 26న మొదలుకానుంది. అదే రోజు టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభించనుంది. చదవండి: Ind vs SA: ముఖం మీదే డోర్ వేసేశాడు! పాపం రుతురాజ్.. వీడియో వైరల్ -
పాక్‌తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న మార్ష్.. ఆసీస్ భారీ స్కోర్
పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40), అలెక్స్ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్ (16), మిచెల్ స్టార్క్ (12), కమిన్స్ (9), నాథన్ లయోన్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ ఆమిర్ జమాల్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ 2, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్ స్కోర్‌కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 42, కెప్టెన్ షాన్ మసూద్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 38, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ అనంతరం పాక్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్ట్ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్‌తో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. -
ఆసీస్‌ను పాక్ ఆపతరమా..? తొలి టెస్టుకు సర్వం సిద్దం
పెర్త్: ప్రపంచకప్ గెలిచిన సమరోత్సాహంతో ఉన్న ఆ స్ట్రేలియా, పేలవ ప్రదర్శనతో పరిమిత ఓవర్ల లోనూ తడబడుతున్న పాకిస్తాన్ మధ్య టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే తొలి టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై తిరుగులేని జట్టయిన ఆసీస్ అన్ని రకాలుగా బలంగా కనిపిస్తూ నిస్సందేహంగా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరో వైపు వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత జట్టు, కెప్టెన్ల మార్పులతో పాక్ బరిలోకి దిగుతోంది. 1995లో ఆసీస్ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్ ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. 1999 టూర్‌నుంచి ఆ జట్టు వరుసగా 14 టెస్టుల్లో ఓడింది. కనీసం ‘డ్రా’గా కూడా ముగించలేకపోయింది. టెస్టుకు ముందు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖాజా గాజాలో పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్నట్లుగా తన షూస్‌కు ‘ఆల్ లైవ్స్ ఆర్ ఈక్వల్’ అనే క్యాప్షన్‌తో ప్రాక్టీస్‌తో పాల్గొన్నాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి క్రికెట్ మైదానంలో ప్రదర్శించరాదు. ఖాజాకు తన భావాలను ప్రదర్శించే స్వేచ్ఛ ఉందని ఆసీస్ బోర్డు, కెప్టెన్ కమిన్స్ అండగా నిలిచినా... అతను ఆ వ్యాఖ్యలు ఉన్న షూస్‌తో టెస్టు బరిలోకి దిగరాదని నిర్ణయించుకున్నాడు. తనది రాజకీయ ప్రకటన కాదని, మానవత్వం మాత్రమేనని ఖాజా అన్నాడు. -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. పాక్ జట్టు ప్రకటన.. ఇద్దరు కొత్త ఆటగాళ్ల ఎంట్రీ
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ అరంగ్రేటం చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ తమ తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నారని పీసీబీ పేర్కొంది. జమాల్ గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పాక్‌కు తొలిసారి ప్రాతినిథ్యం వహించగా.. ఖుర్రమ్ షెహజాద్ ఏ ఫార్మాట్లో అయిన జాతీయ జట్టుకు ఆడటం ఇదే తొలిసారి. మరోవైపు ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఏడాది తర్వాత తిరిగి పాక్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోగా.. పాక్ తమ ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్‌గా మొహమ్మద్ రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్ అహ్మద్వైపే మొగ్గు చూపింది. ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్లా షఫీక్‌లను కొనసాగించిన పాక్ మేనేజ్మెంట్.. వన్ డౌన్లో నయా కెప్టెన్ షాన్ మసూద్, ఆతర్వాతి స్థానంలో తాజా మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్ బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. 🚨 Playing XI for first Test 🚨 Aamir Jamal and Khurram Shahzad are set to make their Test debut 👏#AUSvPAK pic.twitter.com/4GqRRKZC6J — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2023 ఐదో స్థానంలో సౌద్ షకీల్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. పేస్ అటాక్‌ను షాహీన్ అఫ్రిది లీడ్ చేయనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గాయపడటంతో సల్మాన్ అలీ అఘా ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్ రేపటి నుంచి పెర్త్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. వరల్డ్‌కప్ వైఫల్యాల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో షాన్ మసూద్ పాక్ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా మసూద్‌కు ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం. ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్. -
PAK Tour Of AUS: డబుల్ సెంచరీతో చెలరేగిన పాక్ కొత్త కెప్టెన్
నూతనంగా ఎంపిక చేయబడిన పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ డబుల్ సెంచరీతో (201) చెలరేగాడు. మూడు టెస్ట్ మ్యాచ్‌ల ఆసీస్ పర్యటనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో నిన్న (డిసెంబర్ 6) మొదలైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో మసూద్ కెప్టెన్స్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మసూద్‌తో పాటు అబ్దుల్లా షఫీక్ (38), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (40), సర్ఫరాజ్ అహ్మద్ (41) ఓ మోస్తరుగా రాణించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (9), సౌద్ షకీల్ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ బౌలర్లలో జోర్డన్ బకింగ్హమ్ 5 వికెట్లతో విజృంభించగా.. స్టీకిటీ, మెక్ ఆండ్రూ, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ అనంతరం డిసెంబర్ 14 నుంచి 18 వరకు పెర్త్‌లో తొలి టెస్ట్ జరుగుతుంది. డిసెంబర్ 26-30 వరకు మెల్బోర్న్లో రెండో టెస్ట్.. వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అనంతర పరిణామాల్లో టెస్ట్ జట్టుకు షాన్ మసూద్, టీ20 జట్టుకు షాహీన్ అఫ్రిది కెప్టెన్లుగా ఎన్నికయ్యారు. పాక్ క్రికెట్ బోర్డు టీ20లకు కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది. -
PAK Tour Of AUS: కొత్త కెప్టెన్.. వచ్చీ రాగానే సెంచరీతో ఇరగదీశాడు..!
పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఇటీవలే నియమితుడైన షాన్ మసూద్.. కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో ఇవాళ (డిసెంబర్ 6) మొదలైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో మసూద్ కెప్టెన్స్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్.. 78 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. మసూద్ 136 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్ అహ్మద్ (24) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (38), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఇమామ్ ఉల్ హాక్ (9), సౌద్ షకీల్ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరి నిరాశపర్చారు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ బౌలర్లలో జోర్డన్ బకింగ్హమ్ 2, టాడ్ మర్ఫీ, మార్క్ స్కీకిటీ తలో వికెట్ పడగొట్టారు. పాక్ జట్టు ప్రస్తుత ఆసీస్ పర్యటనలో మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు పెర్త్‌లో తొలి టెస్ట్ జరుగనుండగా.. డిసెంబర్ 26-30 వరకు మెల్బోర్న్లో రెండో టెస్ట్.. వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అనంతర పరిణామాల్లో టెస్ట్ జట్టుకు షాన్ మసూద్, టీ20 జట్టుకు షాహీన్ అఫ్రిది కెప్టెన్లుగా ఎన్నికయ్యారు. పాక్ క్రికెట్ బోర్డు టీ20లకు కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది. -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ
వన్డే ప్రపంచకప్-2023లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్.. ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడనుంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్ బ్యాటర్ షాన్ మసూద్ సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్‌తో పాకిస్తాన్ టెస్టు కెప్టెన్‌గా మసూద్ ప్రయాణం ప్రారంభం కానుంది. బాబర్ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాక్ టెస్టు సారధిగా మసూద్ ఎంపికయ్యాడు. ఇక దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌కు తొలిసారి పాక్ టెస్టు జట్టులో చోటు దక్కింది. అయూబ్‌తో పాటు యువ బౌలర్ ఖుర్రం షాజాద్‌కు పాక్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా డిసెంబర్ 14న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆసీస్‌తో టెస్టులకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ అయూబ్, అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇమామ్-ఉల్-హక్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీప), షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మీర్ హమ్జా, ఖుర్రం షాజాద్ హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్, నోమన్ అలీ, అబ్రార్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్ చదవండి: CWC 2023: నిన్నటి రోజు మనది కాకుండా పోయింది.. మోదీకి ధన్యవాదాలు: షమీ భావోద్వేగం The 18-member squad for Australia series has been revealed Saim Ayub & Khurram Shahzad have been called up for the three-match series #PAKvAUS #TestSeries pic.twitter.com/9rhZujQOg1 — Cricket Pakistan (@cricketpakcompk) November 20, 2023 -
బాబర్ ఆజం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్దం.. పాక్ స్టార్ బ్యాటర్ సంచలన వాఖ్యలు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంపై గత కొంతకాలంగా విమర్శల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ సారథిగా మాత్రం జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలవమవుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పాకిస్తాన్ ను సొంతగడ్డమీదే మట్టికరిపించాయి. ఈ క్రమంలో ఆజంను పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తొలిగించాలని ఆ దేశ మాజీ ఆటగాళ్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇప్పటికీ బాబర్‌ను పాక్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అతడి జట్టు సహచరులు మాత్రం బాబర్ కు అండగా నిలుస్తున్నారు. తాజాగా సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబర్ ఆజంను ఉద్దేశించి పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ షాన్ మసూద్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బాబర్ అంటే తమకు ఎంతో ఇష్టమని.. అతడి కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని మసూద్ తెలిపాడు. "మేముందరం బాబర్‌కు మద్దతుగా ఉంటాం. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతని కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడ్డాం. ఇప్పడు బాబర్ ఆజం కోసం కూడా అదే పని చేసేందుకు సిద్ధమయ్యాం. దేశం కోసం అత్యుత్తమంగా ఆడటమే మా అందరి లక్ష్యం. మా జట్టుపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజం. అంత మాత్రాన జట్టును తక్కువగా చేసి మాట్లడకూడదు. మమ్మల్ని వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు. కానీ మేము అవి పట్టించుకోం అని" మసూద్ పేర్కొన్నాడు. కాగా వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా మసూద్ వ్యవహరిస్తున్నాడు. -
ఘనంగా క్రికెటర్ పెళ్లి వేడుక.. జనవరి 27న రిసెప్షన్
పాకిస్తాన్ క్రికెటర్.. జట్టు వైస్‌కెప్టెన్ షాన్ మసూద్ వివాహం పెషావర్‌లో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి ఫ్రెండ్, ప్రేయసి నిషే ఖాన్‌ను అతను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పాకిస్తాన్ క్రికెట్ నుంచి చీఫ్ సెలెక్టర్ షాహిద్ అఫ్రిది, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్లు హాజరయ్యారు. కరాచీ వేదికగా జనవరి 27న గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ రిసెప్షన్‌కు పాక్ క్రికెటర్లు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇక షాన్ మసూద్ పెళ్లి వేడుకను ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అయేమన్ మాలిక్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షాన్ మసూద్, నిఖా షేన్ వివాహ వేడుకల ఫోటోలను పంచుకున్నాడు. కాగా కొత్త జంటకు మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అహ్మద్‌లతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మసూద్, నిషేతో తన రిలేషన్షిప్ గురించి ప్రస్తావించాడు. నిషే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెను మొదటిసారిగా లాహోర్‌లో కలిశానని చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ అయిన మసూద్ టి20 వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీలో పాకిస్థాన్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో షాన్ మసూద్ హాఫ్ సెంచరీ (52)తో రాణించాడు. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌పై 38 పరుగులు చేశాడు. పాక్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షాన్ మసూద్ 28 టెస్టుల్లో 1500 పరుగులు, 19 టి20ల్లో 395 పరుగులు, ఆరు వన్డేల్లో 110 పరుగులు చేశాడు. Shan Masood Bhai Mubarak ho bohot Bohot . You both look adorable together, Ma Sha Allah♥️ #ShanMasood pic.twitter.com/UCVSjVWd26 — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 20, 2023 View this post on Instagram A post shared by Ayeman Malik 🔥 (@ayemanmalik01) చదవండి: 'కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం' -
బాబర్ ఆజమ్‌పై వేటు, పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నాయకత్వ మార్పు చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజమ్‌ను దించేసి, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్‌కు పట్టం కట్టేందుకు సర్వం సిద్ధమైనట్లు పాక్ మీడియాలో కధనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు వెటరన్ వికెట్‌కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ కెప్టెన్ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వన్డే, టీ20ల్లో షాన్ మసూద్‌కు కెప్టెన్సీ అప్పగించినా.. టెస్ట్‌ల్లో మాత్రం సర్ఫరాజ్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయంపై నజీం నేథీ నేతృత్వంలోని పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పాక్ క్రికెట్ సర్కిల్స్‌లో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాక్ మాజీలు, ఆ దేశ క్రికెట్ విశ్లేషకులేమో మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని సమాచారం. ఏదిఏమైనప్పటికీ పీసీబీ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాక్ స్వదేశంలో ఆడిన దాదాపు ప్రతి సిరీస్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమిపాలైన పాక్.. అంతకుముందు అదే జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ అయిన పాక్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై వేటు అంశం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే, పీసీబీ కొద్దికాలం క్రితమే బోర్డు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తొలుత అధ్యక్షుడు రమీజ్ రజాపై వేటు వేసి నజీం సేథికి బాధ్యతలు అప్పగించిన పీసీబీ.. ఇటీవలే షాహిద్ అఫ్రిదిని జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. -
'అవసరమా మనకు.. 'స్పైడర్'ను బ్యాన్ చేయండి'
ఆదివారం టీమిండియా,పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన హై వోల్జేజ్ మ్యాచ్‌లో కోహ్లి స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించాడు. ఈ విషయం పక్కనబెడితే.. ఇదే మ్యాచ్‌లో ఒక అంశం తెరమీదకు వచ్చింది. అదే స్పైడర్ కెమెరా. మ్యాచ్ జరగుతున్న సమయంలో మైదానంలో అటూ ఇటూ తిరుగుతూ ఆటగాళ్ల కదలికలతో పాటు మ్యాచ్‌ను కవరేజ్ చేస్తుంది. అయితే ఈ స్పైడర్ కెమెరా వల్ల పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. బాగా ఆడుతున్న బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్లు నేలపాలు చేస్తున్నారు. దానికి కారణం స్పైడర్ కెమెరానే. బ్యాటర్ కొట్టిన బంతి స్పైడర్‌కు తగిలి ఒకచోట పడాల్సింది పోయి మరొక చోట పడుతుంది. దీంతో బ్యాటర్లకు అదృష్టంగా.. బౌలింగ్ చేస్తున్న జట్టుకు దురదృష్టంగా మారిపోయింది. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించిన షాన్ మసూద్ స్పైడర్ కెమెరా వల్ల బతికిపోయాడంటే నమ్ముతారా. పాక్ ఇన్నింగ్స్ సమయంలో షాన్ మసూద్ కొట్టిన ఒక బంతి నేరుగా స్పైడర్ కెమెరా కేబుల్‌కు తగిలింది. దీంతో బంతి దిశ మారి వేరేచోట పడింది. ఒకవేళ స్పైడర్ కెమెరా లేకపోయుంటే డీప్‌లో కోహ్లి క్యాచ్ అందుకోవడం ద్వారా షాన్ మసూద్ ఔటయ్యేవాడు. ఇది చూసిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు స్పైడర్ కెమెరాపై అసహనం వ్యక్తం చేశారు. అప్పటికి మసూద్ 31 పరుగుల వద్ద ఉన్నాడు. అలా బతికిపోయిన మసూద్ ఆ తర్వాత అర్థసెంచరీతో రాణించి చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇలా స్పైడర్ కెమెరాకు బంతి తగిలి బ్యాటర్ బతికిపోవడం చాలాసార్లు జరిగింది. ఇంతకముందు 2014-15లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక మ్యాచ్ సందర్భంగా ఈ స్పైడర్ కెమెరా అడ్డు వల్లే బతికిపోయాడు. ఇంకా చాలా సందర్భాల్లో ఈ కెమెరా వల్ల ఫీల్డర్లు ఇబ్బందిపడ్డారు. దీంతో స్పైడర్ కెమెరాపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ''స్పైడర్ కెమెరా వాడకం అవసరమా.. పరోక్షంగా ఇది బ్యాటర్లకు అదృష్టంగా కలిసొస్తుంది. అవవసరమా ఇవన్నీ మనకు.. స్పైడర్ కెమెరాను బ్యాన్ చేయండి'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో స్పైడర్ కెమెరాను పదేళ్లుగా వాడుతున్నారు. 2007లో ఐపీఎల్ తొలి సీజన్లో తొలిసారి స్పైడర్ కెమెరాలను ఉపయోగించారు. ఆ తర్వాత క్రమంగా అంతర్జాతీయ క్రికెట్లోనూ అడుపెట్టింది. pic.twitter.com/ZaSvVkGqk7 — Vaishnavi Iyer (@Vaishnaviiyer14) October 23, 2022 చదవండి: Viirat Kohli: ఒక్క ఇన్నింగ్స్‌తో టాప్-10లోకి దూసుకొచ్చిన 'కింగ్' కోహ్లి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ind Vs Pak: పాక్‌కు ఊహించని షాక్.. కీలక బ్యాటర్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు
T20 World Cup 2022- India Vs Pakistan: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా పాక్ బ్యాటర్ షాన్ మసూద్ తలకు గాయమైంది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని జర్నలిస్టు బోరియా మజుందార్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా శనివారం (అక్టోబరు 23) పాక్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రోహిత్ సేనతో మెల్బోర్న్ క్రికెట్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీసు మొదలుపెట్టాయి. నవాజ్ షాట్ ఆడగా.. ఈ క్రమంలో పాక్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ షాట్ ఆడగా.. బంతి మసూద్ తలకు తగలగా గ్రౌండ్లో కుప్పకూలినట్లు సమాచారం. దెబ్బ గట్టిగా తగలడంతో సుమారు ఐదు నిమిషాల పాటు అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది షాన్ మసూద్‌ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పాక్ వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగే ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటి వరకు 12 టీ20 మ్యాచ్‌లు ఆడి 221 పరుగులు చేశాడు. ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో ట్రై సిరీస్ నేపథ్యంలోనూ జట్టుతో ఉన్నాడు. అయితే, కీలక మ్యాచ్‌కు ముందు గాయపడ్డ అతడు.. టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దాయాదితో పోరుకు సిద్ధమవుతున్న వేళ టాపార్డర్ బ్యాటర్ గాయపడటంతో పాక్ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్' T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’ Update: Pakistani Batter Shan Masood has been taken to the hospital. Doctors will examine him and then further steps will be taken. Mohd. Nawaz’s shot hit Masood on the head for this unfortunate injury. He was lying down on the ground for 5-7 mints. Wish him a speedy recovery. — Boria Majumdar (@BoriaMajumdar) October 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ENG VS PAK: రాణించిన షాన్ మసూద్.. ఇంగ్లండ్ టార్గెట్ 161
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 17) ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓ మోస్తరు స్కోర్ సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు షాన్ మసూద్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తాత్కాలిక కెప్టెన్ షాదాబ్ ఖాన్ (12), ఇఫ్తికార్ అహ్మద్ (22), ఖుష్దిల్ (0), ఆసిఫ్ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో మహ్మద్ వసీమ్ జూనియర్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్‌లకు తలో వికెట్ దక్కింది. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (1), అలెక్స్ హేల్స్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వన్ డౌన్లో వచ్చిన బెన్ స్టోక్స్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 7.2 ఓవర్లు పూర్తియ్యే సరికి ఇంగ్లండ్ స్కోర్ 63/3గా ఉంది. లివింగ్‌స్టోన్ (5), హ్యారీ బ్రూక్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే 70 బంతుల్లో 98 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. -
'అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది'
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాన్ మసూద్ దాదాపు ఆరు నెలల తర్వాత పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టు ఓపెనర్‌గా ముద్రపడిన షాన్ మసూద్ ఇంతకాలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తన కెరీర్లో ఒక్క టి20 మ్యాచ్ ఆడని షాన్ మసూద్‌ను పీసీబీ ఏకంగా ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌కు ఎంపికచేసింది. గాయంతో బాధపడుతున్న ఫఖర్ జమాన్ స్థానంలో షాన్ మసూద్‌ను ఎంపిక చేసింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాన్ మసూద్ ఇప్పటివరకు 25 టెస్టులాడి 1378 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు అర్థసెంచరీలు ఉండడం విశేషం. కాగా టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంపై షాన్ మసూద్ శనివారం స్పందించాడు. ''పాక్ జట్టుకు ఆడని కాలంలో చాలా విషయాలు తెలుసుకున్నా.. ఒక వ్యక్తిగా, ఆటగాడిగా చాలా ఎదిగాననిపిస్తుంది. క్రికెట్ కంటే జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయని తెలుసుకున్నా. మన ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది. అది నేను అనుభవించా. ఈ ఏడాది మా అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె మరణంతో ఒక్కసారిగా అంతా కోల్పోయానన్న భావన కలిగింది. కానీ దేశం కోసం మనకిష్టమైన ఆట ఆడినప్పుడు విఫలం కంటే సఫలం ఎక్కువగా ఉంటుందని అక్క చెప్పిన మాటలు మనసులో ఉంచుకున్నా. జట్టులో ఎంపికవుతామా అన్న విషయాన్ని పక్కనబెట్టి రాణిస్తే ఫలితాలు వెతుక్కుంటూ వస్తాయని నా విషయంలో నిరూపితమైంది. ఇక జట్టులోకి తిరిగి రావడం సంతోషమనిపించింది. జట్టులో నా పాత్రను సమర్థంగా పోషిస్తానని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్ ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఇది ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న పాకిస్తాన్ టి0 ప్రపంచకప్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం) ఆడనుంది. చదవండి: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. మొహాలీకి చేరుకున్న భారత ఆటగాళ్లు -
మసూద్ తుపాన్ ఇన్నింగ్స్.. 6 ఫోర్లు.. 4 సిక్స్‌లతో!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా క్వాట్టా గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లాడియేటర్స్ 168 పరుగులకే ఆలౌటైంది. ముల్తాన్ సుల్తాన్ బౌలర్లలో కుష్దిల్ షా, తాహిర్, విల్లీ చెరో మూడు వికెట్లు పడగొట్టాడు. గ్లాడియేటర్స్ బ్యాటర్లలో బెన్ డకెట్(47), ఇఫ్తికార్ అహ్మద్(30) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముల్తాన్ సుల్తాన్ ఆదిలోనే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ షాన్ మసూద్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షాన్ మసూద్ కేవలం 58 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. షాన్ మసూద్ చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్ 174 పరుగులు చేసింది. ఇక గ్లాడియేటర్స్ బౌలర్లలో మహ్మద్ హస్నైన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఫాల్క్‌నర్ ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
అత్యంత విలువైన వ్యక్తివి నువ్వు.. చాలా మిస్ అవుతున్నా: క్రికెటర్ భావోద్వేగం
Shan Masood Gets Emotional: పాకిస్తాన్ క్రికెటర్ షాన్ మసూద్ నివాసంలో విషాదం నెలకొంది. అతడి సోదరి మీషూ మరణించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించిన మసూద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘మీషూ.. నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తివి నువ్వు. నీకు నేను గుడ్‌బై చెప్పలేను. ఆ దేవుడు నిన్ను ఇంతకంటే మంచి చోటుకు తీసుకువెళ్లాడని నాకు తెలుసు. అయినా.. నిన్ను చాలా మిస్ అవుతున్నా’’ అని ట్వీట్ చేశాడు. తన సోదరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించమని అభిమానులను కోరాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, అన్వర్ అలీ, అబిద్ అలీ, పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా తదితరులు మసూద్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కాగా తన సోదరి మీషూ(30) అరుదైన క్రోమోజోమ్ డిజార్డర్‌తో బాధపడుతోందని మసూద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘తను దివ్యాంగురాలు. నవజాత శిశువుతో సమానం. శారీరక ఎదుగుదల ఉంది కానీ.. మానసికంగా పరిపక్వత చెందలేదు. తనకు డిపెండెంట్ వీసా కూడా లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆదివారం తమను విడిచి శాశ్వతంగా దూరం కావడంతో శోక సంద్రంలో మునిగిపోయాడు. ఇక కెరీర్ విషయానికొస్తే... 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో పాకిస్తాన్ తరఫున మసూద్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. చివరగా న్యూజిలాండ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతడు ఆడాడు. ఇక 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం నేషనల్ టీ20 కప్‌లో భాగంగా సింధ్ తరఫున ఆడుతున్నాడు. Meeshu you were the most precious thing in my life and I did not even get to say goodbye, I will miss you so much but I know God has taken you to a better place. Please pray for my sister’s departed soul 🙏🏽 pic.twitter.com/1AFHad7red — Shan Masood (@shani_official) October 3, 2021 -
పాకిస్తాన్ షాన్‌దార్
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు పాకిస్తాన్ సత్తా చాటింది. ముందుగా ఓపెనర్ షాన్ మసూద్ (319 బంతుల్లో 156; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు సాధించిన పాక్... ఆ తర్వాత తమ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఫలితంగా గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (4), సిబ్లీ (8)లతో పాటు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ (0), కెప్టెన్ జో రూట్ (14) కూడా పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఒలీ పోప్ (46 బ్యాటింగ్), బట్లర్ (15 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో షాహిన్ అఫ్రిది వికెట్ తీయగా... తర్వాతి రెండు వికెట్లు మొహమ్మద్ అబ్బాస్ ఖాతాలో చేరాయి. యాసిర్ షా మరొ వికెట్ పడగొట్టాడు. అంతకు ముందు పాక్ 326 పరుగుకు ఆలౌటైంది. మసూద్‌కు షాదాబ్ ఖాన్ (45) అండగా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోరు 139/2తో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ తొలి ఓవర్లోనే అదే స్కోరు వద్ద బాబర్ ఆజమ్ (69) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే అసద్ షఫీఖ్ (7), రిజ్వాన్ (9) వెనుదిరిగారు. ఈ దశలో మసూద్, షాదాబ్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో 251 బంతుల్లో మసూద్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికి ఇది నాలుగో సెంచరీ కాగా... వరుసగా మూడోది కావడం విశేషం. గత రెండు ఇన్నింగ్స్‌లలో అతను 135 (శ్రీలంకపై), 100 (బంగ్లాదేశ్‌పై) పరుగులు సాధించాడు. ఎట్టకేలకు షాదాబ్‌ను బెస్ అవుట్ చేయడంతో 105 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. సెంచరీ తర్వాత మరో 60 బంతుల్లోనే 150కు చేరుకున్న మసూద్ చివరకు తొమ్మిదో వికెట్‌గా అవుటయ్యాడు. -
24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఓపెనర్‌గా..
మాంచెస్టర్: పాకిస్తాన్ ఓపెనర్ షాన్ మసూద్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మసూద్ సెంచరీ సాధించాడు. 251 బంతుల్లో 13 ఫోర్లతో శతకం బాదేశాడు. ఈ రోజు(రెండో రోజు) ఆటలో బాబర్ అజామ్ సెంచరీ చేస్తాడనుకుంటే అతను మాత్రం 69 వ్యక్తిగత పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో మసూద్ నిలకడగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్ల నుంచి పదునైన బంతులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో శతకం పూర్తి చేస్తున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో శతకం సాధించిన ఐదో పాకిస్తాన్ ఓపెనర్‌గా నిలిచాడు. కాగా, 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి పాకిస్తాన్ ఓపెనర్‌గా మసూద్ నిలవడం ఇక్కడ విశేషం. ఇంగ్లండ్ గడ్డపై చివరిసారి 1996లో సయ్యీద్ అన్వర్ టెస్టుల్లో శతకం సాధించిన పాక్ ఓపెనర్ కాగా, ఆ తర్వాత ఇంతకాలానికి మసూద్ సాధించాడు. ఇక ఇది మసూద్‌కు టెస్టుల్లో వరుసగా మూడో సెంచరీ. 2019-20 సీజన్లో మసూద్ మూడో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఆరో పాకిస్తాన్ ఆటగాడిగా మసూద్ నిలిచాడు. అంతకుముందు జహీర్ అబ్బాస్(1982-83), ముదాస్సార్ నజార్(1983), మహ్మద్ యూసఫ్(2006), యూనిస్ ఖాన్(2014), మిస్బావుల్ హక్(2014)లు హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన పాక్ క్రికెటర్లు. కాగా, ఇందులో ముదాస్సార్ నజార్ మాత్రమే ఓపెనర్ కాగా, ఆ తర్వాత స్థానంలో మసూద్ నిలిచాడు. (ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?) 139/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఈ రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్ ఆటగాడు బాబర్ అజామ్(69) నిన్నటి స్కోరు వద్దే పెవిలియన్ చేరాడు. అండర్సన్ వేసిన బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా పాకిస్తాన్ 139 పరుగుల వద్దే మూడో వికెట్ నష్టపోయింది. ఆపై షఫీక్(7), రిజ్వాన్(9)లు నిరాశపరచడంతో పాక్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మసూద్ బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ చేసుకున్న మసూద్.. దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. దాంతో పాక్ తేరుకుంది. పాకిస్తాన్ 95 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 281 పరుగులతో ఉంది. మసూద్(126 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఇది మసూద్‌కు నాల్గో టెస్టు సెంచరీ. -
పాకిస్థాన్ అనూహ్య విజయం
పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో పాకిస్థాన్ అనూహ్య విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. 377 పరుగుల టార్గెట్ ను సునాయాసంగా ఛేదించింది. 103.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. ఓపెనర్ షాన్ మసూద్ (125), సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ (171) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ మిస్బా(59) అర్ధసెంచరీతో రాణించాడు. 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును వీరు ముగ్గురు అసమాన ఆటతీరుతో విజయ తీరాలకు చేర్చారు. మూడో వికెట్ కు 242, నాలుగో వికెట్ కు 127 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్ లో లంక 278, పాక్ 215 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 313 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో పాకిస్థాన్ కైవసం చేసుకుంది. యూనిస్ ఖాన్ 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' దక్కించుకున్నాడు. 12 వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ యాసిర్ షా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నాడు.