బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం. పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టుగా బంగ్లాదేశ్ రికార్డుల్లోకెక్కింది.
పాక్ సొంతగడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలిచి 1294 రోజులు అవుతుంది. 2021లో పాక్ చివరిగా సొంతగడ్డపై సౌతాఫ్రికాను ఓడించింది. పాక్ ఈ మ్యాచ్‌లో మరో పేలవ రికార్డు కూడా మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఓటమిపాలవ్వడం పాక్‌కు ఇది నాలుగో సారి.
బంగ్లా చేతిలో ఊహించని పరాభవం అనంతరం ఆ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ స్పందించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ముందుగా డిక్లేర్ చేయడం ఓటమిపై కొంతమేర ప్రభావం చూపించిందని అన్నాడు. మ్యాచ్‌ను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసకున్నామని తెలిపాడు.
ఊహించనట్లుగా పిచ్ నుంచి సహకారం లభించలేదని పేర్కొన్నాడు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం పేలవ వ్యూహమని అన్నాడు. మా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం కారణం కాదని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం.
పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.
స్కోర్ వివరాలు..
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్)
Comments
Please login to add a commentAdd a comment